Begin typing your search above and press return to search.

క‌రోనా వ‌చ్చిందా..? ఊపిరితిత్తుల‌ను ఇలా కాపాడుకోండి

By:  Tupaki Desk   |   14 Jun 2021 1:30 AM GMT
క‌రోనా వ‌చ్చిందా..? ఊపిరితిత్తుల‌ను ఇలా కాపాడుకోండి
X
క‌రోనా మ‌హ‌మ్మారి దేశాన్ని ఎంత‌లా వ‌ణికించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ వైర‌స్ దాడిచేసి అవ‌య‌వాల్లో ప్ర‌ధాన‌మైన‌వి ఊపిరితిత్తులు. లంగ్స్ ను మేజ‌ర్ గా దెబ్బతీస్తే.. ప్రాణాపాయం ఎక్కువ‌గా ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్న సంగ‌తి తెలిసిందే. అందువ‌ల్ల లంగ్స్ ను సంర‌క్షించుకోవ‌డం అత్య‌వ‌స‌రం. కొవిడ్ వ‌చ్చింద‌న‌గానే బెంబేలెత్తిపోకుండా.. మానసిక ధైర్యం కూడ‌గ‌ట్టుకుంటూనే.. మ‌రోవైపు ఊపిరితిత్తుల‌ను కాపాడుకుంటే.. క‌రోనాపై తేలిగ్గా విజ‌యం సాధించ‌వ‌చ్చు.

అయితే.. ఇదంతా వంటింట్లో ల‌భించే వ‌స్తువుల‌తోనే చేసుకోవ‌చ్చ‌ని సూచిస్తున్నారు నిపుణులు. ఆసుప‌త్రికి వెళ్ల‌కుండానే.. లంగ్స్ ను కాపాడుకోవ‌చ్చ‌ని చెబుతున్నారు. మ‌రి, అవేంటీ? ఎలా ఉప‌యోగించుకోవాలి? అన్న‌ది చూద్దాం.

ఒక క‌ప్పు నీటిలో రెండు యాల‌కులు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క‌వేసి 10 నిమిషాలు వేడిచేసి తాగాలి. దీనివ‌ల్ల ఊపిరితిత్తుల‌కు చాలా మేలు జ‌రుగుతుంది. అంతేకాదు.. బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్ కావ‌డంతోపాటు బీపీ కూడా నార్మ‌ల్ అవుతుంది.

అల్లం చాయ్ లో కొద్దిగా ప‌సుపు వేసుకొని తాగాలి. లేదంటే.. పాల‌లో ప‌సుపు వేసుకొని తాగినా.. ఓకే. ఇలే చేయ‌డం వ‌ల్ల‌ ఊపిరి తిత్తుల్లోకి చ‌క్క‌గా గాలి ఆడుతుంది. అయితే.. ప‌సుపు మాత్రం స్వ‌చ్ఛ‌మైన‌ది వాడాలి. షాపుల్లో ల‌భించేది వాడ‌డం వ‌ల్ల పెద్ద‌గా ప్ర‌యోజ‌నం ఉండ‌దు.

పుదీనా ఆకుల‌తోనూ మంచి క‌షాయం త‌యారు చేసుకోవ‌చ్చు. వీటిని ఉడికించి ఆ ర‌సం తాగితే గొంతులో మంట త‌గ్గుతుంది. అంతేకాకుండా.. ఊపిరి తిత్తుల్లో ఇన్ఫెక్ష‌న్ పోగొడుతుంది.

గ్రీన్ టీ కూడా చాలా మంచిది. దీనివ‌ల్ల శ‌రీరానికి యాంటీ ఆక్సిడెంట్స్ అందుతాయి. ఈ ప‌ద్ధ‌తి ద్వారా కూడా లంగ్స్ ను చ‌క్క‌గా కాపాడుకోవ‌చ్చు. సో.. క‌రోనా ట్రీట్మెంట్ కొన‌సాగిస్తూనే.. ఈ విధానాల ద్వారా ఊపిరితిత్తుల‌ను సంర‌క్షించుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.