Begin typing your search above and press return to search.

రోనాల్డోను పక్కనపెట్టడానికి అసలు కారణం అదేనట?

By:  Tupaki Desk   |   13 Dec 2022 2:30 AM GMT
రోనాల్డోను పక్కనపెట్టడానికి అసలు కారణం అదేనట?
X
ఈ దశాబ్ధపు అత్యుత్తమ ఫుట్ బాల్ ప్లేయర్ క్రిస్టియానో రోనాల్డో మైదానంలో పాదరసంలా కదులుతూ అతడు చేసే విన్యాసాలు ఎప్పటికీ మరిచిపోలేము. పోర్చుగల్ తరుపున 195 మ్యాచ్ లు ఆడిన రోనాల్డో 118 గోల్స్ కొట్టాడు. కానీ అతడి జీవితంలో ఫిఫా వరల్డ్ కప్ తీరని కలగా మిగిలిపోయింది. ఈసారి కప్ కొడుదామనుకున్నా క్వార్టర్ ఫైనల్ లో మొరాకో చేతిలో 2-1తో ఓడి పోర్చుగల్ వెనుదిరిగింది. దీంతో 37 ఏళ్ల రోనాల్డో చిన్నపిల్లాడిలా ఏడ్చాడు. కప్ కొట్టే తన కల వైఫల్యం చెందినందుకు కన్నీళ్లు పెట్టుకున్నాడు.

అయితే కీలకమైన క్వార్టర్ ఫైనల్లో రోనాల్డోను కోచ్ ఫెర్నాండో శాంటోజ్ బెంచ్ కే పరిమితం చేయడాన్ని చాలా మంది క్రీడాభిమానులు తప్పుపట్టారు. పోర్చుగల్ కెప్టెన్ అయిన రోనాల్డో ఫామ్ లో లేకనే పక్కనపెట్టామని.. ఈ వరల్డ్ కప్ లో పెద్దగా ప్రభావం చూపించలేదని.. నాలుగు మ్యాచుల్లో ఒక్క గోల్ మాత్రమే చేయడంతోనే ఇలా చేశానని కోచ్ తెలిపాడు. కానీ కెప్టెన్ నే పక్కనపెట్టడంతో ఆ టీం పై ప్రభావం పడి పోర్చుగల్ ఇంటిదారి పట్టింది.

ప్రస్తుతం జరుగుతున్న ఫిఫా ప్రపంచ కప్ క్వార్టర్-ఫైనల్స్‌లో మొరాకో చేతిలో పోర్చుగల్‌ను మట్టికరిపించిన ఒక రోజు తర్వాత క్రిస్టియానో రొనాల్డో ఆదివారం తన అనుభవాలు పంచుకోవడానికి ఇన్ స్టాగ్రామ్ లోకి వెళ్లారు. కీలకమైన మ్యాచ్‌లో ఆడకుండా బెంచ్‌ కే పరిమితమై ఉన్న రొనాల్డో సెకండ్ హాఫ్‌లో సబ్ స్టిట్యూట్ గా బరిలోకి దిగాడు. అయితే అప్పటికే మొరాకో చేసిన గోల్ తో సెమీ-ఫైనల్‌కు ఆ జట్టు వెళ్లిపోయింది. కాబట్టి రోనాల్డో ప్రభావం చూపలేకపోయాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో రొనాల్డో మాట్లాడుతూ పోర్చుగల్‌కు ప్రపంచ కప్ గెలవాలనే తన కల మొరాకోతో షాకింగ్ ఓటమి తర్వాత ముగిసిందని ఆవేదన వ్యక్తం చేశాడు.

పోర్చుగల్ తరఫున ప్రపంచ కప్ గెలవడం నా కెరీర్‌లో అతిపెద్ద.. అత్యంత ప్రతిష్టాత్మకమైన కల. అదృష్టవశాత్తూ నేను పోర్చుగల్‌తో సహా అంతర్జాతీయ స్థాయికి సంబంధించిన అనేక టైటిల్‌లను గెలుచుకున్నాను, కానీ మన దేశం పేరును ప్రపంచంలోనే అత్యున్నత స్థాయిలో ఉంచడం నా అతిపెద్ద కల" అని రొనాల్డో ఇన్ స్టాగ్రామ్ లో భారంగా రాసుకొచ్చాడు. తన ఐదవ , బహుశా తన చివరి ప్రపంచ కప్‌లో ఆడుతున్న రొనాల్డో సంవత్సరాలుగా తనకు మద్దతుగా నిలిచిన పోర్చుగీస్ ప్రజలకు తాను ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటానని చెప్పాడు.

"నేను ప్రపంచకప్ సాధించడం కోసం పోరాడాను. ఈ కల కోసం నేను తీవ్రంగా పోరాడాను. 16 ఏళ్లలో ప్రపంచ కప్‌లలో నేను ఆడిన 5 కప్ ఇది. ఎల్లప్పుడూ గొప్ప ఆటగాళ్లతో పాటు మరియు మిలియన్ల మంది పోర్చుగీస్ ప్రజల మద్దతుతో, నేను నా సర్వస్వం ఇచ్చాను. మైదానంలో ప్రతిదీ చేశాను. నేను ఎప్పుడూ పోరాటం విషయం మొహం తిప్పలేదు. ఆ కలను నేను ఎప్పుడూ వదులుకోలేదు." అని రోనాల్డో రాసుకొచ్చాడు.

అయితే, 37 ఏళ్ల అతను తన భవిష్యత్తు గురించి ఏమీ వెల్లడించలేదు. "దురదృష్టవశాత్తూ నిన్నటి కల ముగిసింది. ఇప్పుడు స్పందించడం విలువైనది కాదు. నాపై చాలా ఊహాగానాలు చేయబడ్డాయి. కానీ పోర్చుగల్ పట్ల నా అంకితభావం ఒక్క క్షణం కూడా మారలేదు. ప్రతి ఒక్కరి లక్ష్యం కోసం ఎల్లప్పుడూ మరొక వ్యక్తి పోరాడుతూ ఉండేవాడు. నేను నా సహచరులకు మరియు నా దేశానికి ఎప్పటికీ వెనుదిరగను." అంటూ రోనాల్డో భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు.

"ప్రస్తుతానికి, చెప్పడానికి ఎక్కువ ఏమీ లేదు. ధన్యవాదాలు, పోర్చుగల్ వాసులకు ధన్యవాదాలు, ఖతార్ లో కప్ కొట్టాలన్న నా కల నెరవేరలేదు. ప్రతి ఒక్కరూ తమ స్వంత తీర్మానాలను రూపొందించడానికి అనుమతించాల్సిన సమయం వచ్చింది." అని సోషల్ మీడియా ఊహాగానాలను పట్టించుకోనని రోనాల్డో రాసుకొచ్చాడు.

ముఖ్యంగా పరస్పర అంగీకారంతో మాంచెస్టర్ యునైటెడ్‌తో తన ఒప్పందాన్ని రద్దు చేసుకోవడానికి అంగీకరించిన తర్వాత, రొనాల్డో ప్రస్తుతం ఏ జట్టుతోనూ కలిసిలేడు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.