Begin typing your search above and press return to search.
ఎలెన్ మస్క్ పతనం మొదలైందా..? చైనా తీరుతో భారీ నష్టం..
By: Tupaki Desk | 23 Jun 2022 11:30 PM GMTతమకు బిలియన్ డాలర్ల నష్టం చేకూరింది.. అందుకు చైనానే కారణమని టెస్లా అధినేత ఆరోపిస్తున్నాడు. టెక్సాస్ లోని తన ఫ్యాక్టరీ బ్యాటరీల ఉత్పత్తిని పెంచడంలో ఎదురవుతున్న సవాళ్లతో కొద్ది మొత్తలో ఉత్పత్తి చేస్తుండగా.. ఎలక్ట్రిక్ కార్ల తయారీ కోసం ఉపయోగించే బ్యాటరీలు చైనా పోర్టులో చిక్కుకుపోయాయని అన్నారు. దీంతో టెస్లాకు బిలియన్ డాలర్ల నష్టం చేకూరిందని అన్నాడు. అందుకే ఉద్యోగలు విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోందని తెలిపారు. గత నెల ఆస్ట్రిన్ లోని టెస్లా అఫీషియల్ రికగ్నైజ్ డ్ క్లబ్ టె్లా ఓనర్స్ సిలికాన్ వ్యాలీ ఎలెన్ మస్క్ తో ఇంటర్వ్యూ చేశారు. దీనిని నాలుగు విభాగాలుగా విడగొట్టి ప్రసారం చేశారు. ఒక భాగంలో ఎలెన్ మస్క్ ఈ విషయాన్ని చెప్పడం సంచలనంగా మారింది.
గత కొన్ని నెలలుగా ఎలెన్ మస్క్ నిత్యం వార్తల్లో నానుతున్నాడు. ప్రపంచ కుభేరుడుగా ఉన్న ఆయనకు సంబంధించిన ప్రతీ విషయం వైరల్ అవుతోంది. టెస్లా కంపెనీ అధినేత అయిన ఎలెన్ మస్క్ ఇప్పటి వరకు నిర్మించుకున్న సామ్రాజ్యంలో అన్నీ అవరోధాలు ఎదురవుతున్నాయి. ప్రముఖ సోషల్ మీడియా ట్వీట్టర్ ను చేజిక్కించుకోవడానికి ప్రయత్నించినప్పటి నుంచి ఆయనకు అన్నీ కష్టాలు, విమర్శలు ఎదురవుతున్నాయి.
మొన్నటి వరకు ఉద్యోగుల విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఆయన తాజాగా తన కంపెనీకి భారీ నష్టం చేకూరుతుందని అంటున్న వీడియో వైరల్ అవుతోంది. అయితే టెస్లాకు భారీగా నష్టం చేకూరినందునే ఉద్యోగులను తొలగించాల్సి వస్తోందని అంటున్నాడు.
టెక్సాస్ లోని టెస్లా ఫ్యాక్టరీ కొత్తగా '4680' బ్యాటరీల ఉత్పత్తిని పెంచడంలో సవాళ్లను ఎదుర్కొంటున్నానని ఎలెన్ మస్క్ తెలిపారు. ప్రపంచంలో ఏర్పడిన ఆర్థిక మాంద్యం, తదితర కారణాలతో ఉత్పత్తిలో అవరోధాలు ఎదురవుతున్నాయని అంటున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా కార్ల వినియోగం తక్కువ కావడంతో లక్ష్యం మేరకు ఉత్పత్తి చేయడం లేదంటున్నాడు. అదీ గాక ఎలక్ట్రిక్ కార్ల తయారీ కోసం వినియోగించే సాంప్రదాయ 2170 బ్యాటరీలు చైనా పోర్టులో చిక్కుకుపోయానని అన్నారు. దీంతో పరోక్షంగా నష్టాల పాలైనట్లు తెలిపారు.
అయితే తన నష్టానికి చైనానే కారణమని ఎలెన్ మస్క్ ఆరోపిస్తున్నారు. ఆ కంట్రీలో పెరుగుతున్న కరోనా కేసులు కారణంగా లాక్డౌన్ ఆంక్లలు అమల్లోకి వచ్చాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దిగ్గజ కంపెనీలు తమ వ్యాపార కార్యకలాపాలు తగ్గించాయి. ముఖ్యంగా షాంఘైలోని టెస్లా కార్ ప్రొడక్షన్ పూర్తిగా ఆగిపోయింది. ఈ ప్రభావం అక్కడున్న ఫ్యాక్టరీతో పాటు కాలిఫోర్నియా ప్లాంట్ పై పడింది. ఎందుకంటే టెస్లా కార్ల విడిభాగాలు కొన్ని చైనాలో తయారవుతాయి. వాటిని చైనా కాలిఫోర్నియాకు తరలిస్తుంది.
ఈ సమయంలో తమ ఉద్యోగులకు జీతాలు ఎలా చెల్లించాలి..? అని మస్క్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అందుకే ఉద్యోగుల విషయంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోందని చెప్పారు. అయితే ఉద్యోగుల తొలగింపుపై ఎన్ని విమర్శలు వస్తున్నా ఒక్కోసారి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడంలో తప్పేం లేదని అన్నారు. అయితే ఉద్యోగులను తొలగించకపోతే టెస్లా కంపెనీ భారీగా నష్టపోతుందని చెప్పారు. కానీ సోషల్ మీడియా వ్యాప్తంగా కంపెనీ ఖర్చులు తగ్గించుకునేందుకే ఉద్యోగులను తొలగిస్తుందని అంటున్నారు. ఏదీ ఏమైనా ఎలెన్ మస్క్ పతనం మొదలైందా..? అనే చర్చ సాగుతోంది.