Begin typing your search above and press return to search.
నన్నెవరూ ఆపలేరు.. కయ్యానికి కాలుదువ్విన గవర్నర్ తమిళిసై!
By: Tupaki Desk | 10 Jun 2022 4:26 PM GMTతెలంగాణ గవర్నర్ తమిళిసై పంతం పట్టారు. తగ్గేదేలే అంటూ తొడగొట్టేశారు. రాజ్ భవన్ వేదికగా.. కేసీఆర్ ప్రభుత్వ అభీష్టానికి విరుద్ధంగా ‘మహిళా దర్భార్’ నిర్వహించి సవాల్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించిన ఈ సమావేశం చర్చనీయాంశమైంది.
మహిళా దర్భార్ అనంతరం గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నన్ను ఆపేశక్తి ఎవరికీ లేదు. తెలంగాణ ప్రజల కోసం నేను పనిచేస్తున్నాను. ప్రజల పక్షాన బలమైన శక్తిగా ఉంటాను. నాకు వ్యతిరేకంగా మాట్లాడే వారిని నేను పట్టించుకోను. బాలికలు , మహిళలపై జరుగుతున్న అన్యాయాలను చూస్తే నా గుండె రగిలిపోతుంది. జూబ్లీహిల్స్ సామూహిక లైంగిక దాడి ఘటనలో నివేదిక ఇవ్వకపోవడంపై అసంతృప్తి ఉన్నాను. రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని కోరినా స్పందించడం లేదన్నారు.
తెలంగాణప్రభుత్వం నా విషయంలో ప్రోటోకాల్ పాటించలేదని.. దీనిపై స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. నేనేమీ నా కోసం పోరాటం చేయడం లేదు. మహిళలను ఆదుకోవడానికి నేను ఎప్పుడూ బలంగా ఉంటాను. బాధితులు ఎవరైనా వారి కోసం నా హృదయం రోడిస్తుందని గవర్నర్ తమిళి సై ఎమోషన్ స్పీచ్ ఇచ్చారు.
బనా బలమైన స్వరంతో మహిళల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేస్తానని గవర్నర్ స్పష్టం చేశారు. రాజ్ భవన్ నుంచి వచ్చే వినతులు అధికారులు పరిష్కరించాలని కోరారు. మహిళా దర్భార్ వెనుక ఎలాంటి రాజకీయం లేదన్నారు. భవిష్యత్తులోనూ మహిళా దర్భార్ కొనసాగిస్తానన్నారు. మన గెలుపును ఎవరూ ఆపలేరు అని స్పష్టం చేశారు.