Begin typing your search above and press return to search.

రాణి ఎలిజిబెత్‌ ఆ రోజే మరణిస్తుందని అతడికి ముందే తెలుసా?

By:  Tupaki Desk   |   13 Sep 2022 11:30 PM GMT
రాణి ఎలిజిబెత్‌ ఆ రోజే మరణిస్తుందని అతడికి ముందే తెలుసా?
X
బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ 2.. 93 ఏళ్ల వయసులో సెప్టెంబర్‌ 8, గురువారం మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయాన్ని రెండు నెలల ముందుగానే ఓ వ్యక్తి చెప్పడం హాట్‌ టాపిక్‌గా మారింది. గతంలో కాలజ్ఞానం ద్వారా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, నోస్ట్రడామస్‌ బాగా పాపులర్‌ అయ్యారు. వారు చెప్పినవాటిలో చాలావరకు చెప్పినట్టు జరిగాయి. ఇప్పుడు ఇదే కోవలో లోగన్‌ స్మిత్‌ అనే వ్యక్తి చెప్పింది కూడా అక్షర సత్యమైంది.


బ్రిటన్‌కు అత్యధిక కాలం మహారాణిగా ఉన్నవారు సెప్టెంబర్‌ 8, 2022న మరణిస్తారు అని లోగన్‌ స్మిత్‌ అనే వ్యక్తి ఈ ఏడాది జూలైలో తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఎలిజబెత్‌ 2 అదే రోజు చనిపోతుందని రెండు నెలల ముందుగానే అతడు ఊహించాడు.

ఇప్పుడు ఆ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. రాణి ఎలిజబెత్‌ 2 మరణించగానే లోగన్‌ స్మిత్‌ చేసిన ట్వీట్‌ వెలుగులోకి వచ్చింది. ఈ ట్వీట్‌ను కొన్ని వేల మంది రీట్వీట్‌ చేయడం విశేషం.

ఎలిజబెత్‌–2 ఎప్పుడు మరణిస్తుందో చెప్పడమే కాకుండా బ్రిటన్‌కు తర్వాత వచ్చే మహారాజు 2026 మార్చి 28న మరణిస్తారని లోగన్‌ స్మిత్‌ అదే ట్వీట్‌లో పేర్కొనడం గమనార్హం. అంటే లోగన్‌ స్మిత్‌ చెప్పినదాని ప్రకారం.. ప్రస్తుతం రాణి ఎలిజబెత్‌ 2 మరణంతో బ్రిటన్‌ రాజు అయిన కింగ్‌ చార్లెస్‌ 3... 2026 మార్చి 28న చనిపోతారు.

దీంతో తన ట్వీట్‌లు బాగా వైరల్‌గా మారడంతో లోగన్‌ స్మిత్‌ తన ట్విట్టర్‌ అకౌంట్‌ను ప్రైవేటుగా మార్చేసుకున్నాడని చెబుతున్నారు. అయితే అప్పటి ట్వీట్లను ముందుగానే స్క్రీన్‌షాట్లు తీసుకున్నవారు వాటిని షేర్‌ చేస్తున్నారని పేర్కొంటున్నారు.

కాగా ట్విట్టర్‌ యూజర్లు లోగన్‌ స్మిత్‌కు జాగ్రత్తలు చెబుతున్నారు. ఇలా ముందుగానే బ్రిటన్‌ రాణి, రాజుల చావుల గురించి చెప్పేస్తే బ్రిటన్‌ ప్రజలు నిన్ను వెతుక్కుంటూ వస్తారని ఒక యూజర్‌ ట్వీట్‌ చేశాడు. అలాగే మరో యూజర్‌ ఇప్పటికే రాణి మరణంతో తీవ్ర బాధలో ఉన్నామని.. ఇప్పుడు రాజు కూడా మరణిస్తాడని తేదీలు చెప్పి భయపెట్టకని కోరుతున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.