Begin typing your search above and press return to search.
జగన్ పర్మిషన్ ఇచ్చేశాడా పీకేకి...?
By: Tupaki Desk | 22 April 2022 8:08 AM GMTఅదేంటో పీకే అనబడే ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ అధినాయకత్వానికి ఏమి ప్రజంటేషన్ ఇచ్చాడో తెలియదు కానీ టీడీపీకి సంబంధించిన మీడియా మాత్రం దాని మీద పెద్ద ఎత్తున వార్తలు రాస్తున్నాయి. పీకే కాంగ్రెస్ కి ఇచ్చిన ప్రెజెంటేషన్ ఇదీ అని కూడా రాసేస్తున్నాయి. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ని ఈసారి అధికారంలోకి తీసుకురావడానికి పీకే చాలా వ్యూహాలను కాంగ్రెస్ పెద్దలకు చెప్పారని అంటున్నారు.
అవన్నీ గుదిగుచ్చి పీకే మార్క్ ప్రజెంటేషన్ ని ఇచ్చారని అంటున్నారు. దాని ప్రకారం కాంగ్రెస్ తనకు బలమున్న కేవలం 380 సీట్లకు మాత్రమే సొంతంగా పోటీ చేసి మిగిలిన చోట్ల వివిధ రాష్ట్రాలలో బలమైన ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకోవాలని పీకే ప్రజెంటేషన్ లో సూచించినట్లుగా చెబుతున్నారు.
దేశంలో చాలా రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలను పీకే ప్రజెంటేషన్ లో సూచించారు. అయితే అవన్నీ వేరు. ఏపీ వేరు. ఏపీలో వైసీపీతో కాంగ్రెస్ పొత్తు అంటే అది జాతీయ స్థాయిలోనే కాదు, ఏపీ రాజకీయాల్లోనూ బిగ్గెస్ట్ సర్ప్రైజ్ గానే చూడాలి. ఎందుకంటే ఏపీలో వైసీపీ పుట్టుకకు కాంగ్రెస్ కారణం. జగన్ని అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టింది కాంగ్రెస్. అది వైసీపీ వారిలో ఉన్న నిలువెత్తు భావన.
అంతే కాదు, కాంగ్రెస్ ని సోనియా గాంధీని తిట్టిన తిట్టు తిట్టకుండా వైసీపీ వారు ఈ రోజుకీ తిడతారు. అలాంటి కాంగ్రెస్ వైసీపీ పొత్తులు పెట్టుకోవడం ఒక విధంగా ఎనిమిదవ వింతగానే చూడాలి. ఈ పొత్తు వార్తల మీద వైసీపీలోనే భిన్న వాదనలు ఉన్నాయి. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే ఏ ముఖం పెట్టుకుని జనాల్లోకి వెళ్తామన్న చర్చ కూడా ఉంది.
అంతే కాదు ఇన్నాళ్ళు కాంగ్రెస్ ని తిట్టిన తిట్లకు అర్ధం ఉంటుందా అన్నది కూడా మరో చర్చ. ఇక ఏపీ కాంగ్రెస్ నాయకులు కూడా ఈ పొత్తుల పట్ల ఎలా రియాక్ట్ అవుతారో కూడా ఎవరికీ తెలియదు. కాంగ్రెస్ కి జగన్ కి మధ్య బిగ్ గ్యాప్ ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ పొత్తుల కధనాలు కాదు కానీ టీడీపీలో అయితే ఫుల్ జోష్ కనిపిస్తోంది అని అంటున్నారు.
అదేలా అంటే వైసీపీ కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే టీడీపీ రొట్టె విరిగి నేతిలో పడినట్లే. ఏపీలో టీడీపీ ఆవిర్భావమే కాంగ్రెస్ కి వ్యతిరేకంగా. ఆ బలమైన రాజకీయ సిద్ధాంత భూమిక ఏపీలో కాంగ్రెస్ అంతర్ధానంతో మసకబారుతోంది. ఇపుడు వైసీపీ, కాంగ్రెస్ లు పొత్తు పెట్టుకుని ముందుకు వస్తే కనుక టీడీపీకి అది రెట్టించిన బలం అవుతుంది. దాంతో ధీటుగా ఎదుర్కొని ఏపీలో రాజకీయ లాభాన్ని పెద్ద ఎత్తున పొందే అవకాశం అయితే ఉంది.
పైగా మళ్లీ ఉమ్మడి ఏపీ విభజన అంశాన్ని కూడా టీడీపీ తెర మీదకు తీసుకురావచ్చు. అదే విధంగా అడ్డగోలు విభజంతో ఏపీ అన్ని విధాలుగా నష్టపోయిందని కూడా జనాల్లోకి తీసుకెళ్ళి రాజకీయ యాగీ చేసి పూర్తి ఫలితాలను పొందవచ్చు. మరో వైపు కాంగ్రెస్ అన్యాయంగా జగన్ని అరెస్ట్ చేసి పదహారు నెలల పాటు జైలులో ఉంచింది అన్న సానుభూతి ఇక మీద ఏ కోశానా వైసీపీకి లేకుండా ఈ పొత్తు వల్ల చిత్తు అయ్యే అవకాశం ఉంది. అలాగే కాంగ్రెస్ మైనస్సులు అన్నీ కూడా జగన్ నెత్తిన గుదిబండగా మారే అవకాశాలు ఉంటాయి.
మొత్తానికి చూస్తే కాంగ్రెస్ వైసీపీ పొత్తు వల్ల ఏపీలో టీడీపీ ఏ విధంగానూ వెనక్కి చూసుకోకుండా అధికారం వైపు అడుగులు వేసే వీలు ఉంటుందని అంటున్నారు. అయితే ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ కి ఇచ్చిన ప్రజెంటేషన్ లో ఏపీలో వైసీపీ పొత్తుని ఎందుకు ప్రస్తావించారు. ప్రస్తావిస్తే అది ఆయన సొంత నిర్ణయమా. లేక జగన్ పర్మిషన్ తోనే ఆయన అలా చేశారా అన్న చర్చ కూడా ఉంది.
ఇంకోవైపు నుంచి ఆలోచిస్తే ప్రశాంత్ కిశోర్ అంటే జగన్ కచ్చితంగా నమ్ముతారు. ఆయన వ్యూహాలను కూడా బాగా విశ్వసిస్తారు. దాంతో కాంగ్రెస్ తో పొత్తు అన్న దాన్ని కూడా ఆయన పీకే మాటలను నమ్మి ఓకే చెప్పేరా అన్న డౌట్లు వస్తున్నాయిట. అలాగే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఎటూ మెజారిటీ రాదు కాబట్టి కాంగ్రెస్ కనుక పుంజుకుంటే మద్దతు ఇచ్చేందుకు కూడా రెడీ అవుతున్నారా అన్న చర్చ వస్తోంది.
ఏది ఏమైనా ఈ పొత్తు మాత్రం వైసీపీకి రాజకీయ నష్టాన్ని చేకూరుస్తుంది అన్నది వైసీపీలో ఉన్న వారిదే కాదు, బయట నుంచి వస్తున్న విశ్లేషణలు. మరి ఈ ప్రజెంటేషన్ నిజమైతే ఈ వ్యూహాలు కరెక్ట్ అయితే దానికి జగన్ అనుమతి కనుక ఉంటే వైసీపీ రాజకీయ భవిష్యత్తు మీద డౌట్లు పుడుతున్నట్లే అంటున్నారు.