Begin typing your search above and press return to search.

జగన్ రైట్ హ్యాండ్ తప్పుకున్నాడా?

By:  Tupaki Desk   |   18 Nov 2020 9:50 AM GMT
జగన్ రైట్ హ్యాండ్ తప్పుకున్నాడా?
X
ఏపీ సీఎం జగన్ కు నమ్మిన బంటు.. ఏపీ సీఎంవోలో మొన్నటిదాకా కీరోల్ పోషించిన పీవీ రమేవ్ సీఎంవో నుంచి తప్పుకోవడం ఆసక్తికర పరిణామంగా ఏపీ రాజకీయ వర్గాలు అభివర్ణిస్తున్నాయి. ఏపీ సీఎం అదనపు ప్రధాన కార్యదర్శి బాధ్యతలు నిర్వహిస్తున్న పీవీ రమేశ్ .. ఏపీ పాలనలో జగన్ తర్వాత అంతటి పవర్ ఫుల్ అధికారిగా పేరు సంపాదించారు. గత సీఎస్ ను కూడా ఆదేశించేలా ఆయన చర్యలు కొనసాగాయన్న ప్రచారం రాజకీయవర్గాల్లో సాగింది..

అయితే సడన్ గా పీవీ రమేశ్ వైదొలగడం చర్చనీయాంశంగా మారింది.నవంబర్ 1న తాను ఏపీ సీఎంవో బాధ్యతల నుంచి తప్పుకున్నట్టుగా తాజాగా పీవీ రమేశ్ ట్వీట్టర్ లో ట్వీట్ చేయడం సంచలనమైంది. 35 ఏళ్ల నుంచి జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో ప్రజాసేవ చేస్తున్నానని.. తన కెరీర్ లో ప్రజలకు మెరుగైన సుపరిపాలన,చిత్తశుద్ధితో సేవలు అందించేందుకు తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. తనకు సీఎంవో అవకాశం ఇచ్చిన సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు.

గత నాలుగు నెలల క్రితమే ఏపీ సీఎంవో అనూహ్య మార్పులు జరిగాయి. సీఎం కార్యాలయంలోని అధికారులకు శాఖల్లో మార్పులు చేశారు. సీఎంవో బాధ్యతల నుంచి అజయ్ కల్లాం, పీవీ రమేశ్, జే మురళిని తప్పించారు.

ఆ ముగ్గురి స్థానంలో ప్రవీణ్ ప్రకాష్, సాల్మాన్ రాజ్, ధనుంజయ్ రెడ్డిలకు అప్పగించారు. పీవీ రమేశ్ కు మొదట కీలక శాఖలు అప్పగించి అనంతరం కోత వేశారు. తాజాగా ఆయన సీఎంవో నుంచి తప్పుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.