Begin typing your search above and press return to search.
మళ్లీ జగన్.. `ఓటర్` టేక్ చేశాడా.. టీడీపీలో గుబులు...!
By: Tupaki Desk | 21 Jun 2021 7:30 AM GMTసీఎం జగన్ చేస్తున్న పనులు, తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రధాన ప్రతిపక్షం టీడీపీ తీవ్రస్థాయిలో ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. సీఎం జగన్‌ను ఏమేరకు టార్గెట్ చేయాలో.. అంతకుమించి అన్న విధంగా టార్గెట్ చేస్తున్న అంశం.. కూడా అందరికీ తెలిసిందే. దీంతో గత ఎన్నికల్లో తాము కోల్పోయిన ఓటు బ్యాంకును.. తిరిగి లాక్కునేందుకు టీడీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. యువతను టార్గెట్ చేసుకుని.. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి.. లోకేష్.. ఇటీవల కాలంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇంటర్ పరీక్షలు, పదోతరగతి పరీక్షలు రద్దు చేయాలని.. వర్చువల్ ఉద్యమానికి ఆయన శ్రీకారం చుట్టారు.
వీటిని సక్సెస్ చేసేందుకు నారా లోకేష్ బాగానే శ్రమించారు. అయితే.. ఓటు బ్యాంకు పెరిగిందా ? లేదా ? అన్నది పక్కన పెడితే ఇప్పుడు జగన్ తీసుకున్న నిర్ణయం.. టీడీపీలో మళ్లీ గుబులు పుట్టిస్తోంది. కొత్తగా ఓటర్లుగా నమోదు అయ్యేవారు.. తమవైపు మొగ్గు చూపుతారని.. తాము చేస్తున్న పోరాటాల ఫలితంగా తమకు అండగా నిలుస్తారని అనుకున్న టీడీపీ నేతలకు ఇప్పుడు జగన్ తీసుకున్న నిర్ణయం.. శరాఘాతంగా తగిలిందని అంటున్నారు పరిశీలకులు. టీడీపీ ఇప్పటి వరకు పెట్టుకున్న ఆశలు జగన్ నిర్ణయంతో పటాపంచలు అయ్యాయనే కాస్త బాధపడుతున్నారు.
తాజాగా జగన్.. యువతీ యువకులు, ముఖ్యంగా టీడీపీ అదినేత కుమారుడు లోకేష్ ఎవరినైతే టార్గెట్ చేసుకుని.. ఇటీవల కాలంలో ఉద్యమాలు చేస్తున్నారో.. వారినే టార్గెట్ చేసుకుని జగన్ ఉద్యమించారు. యువతకు ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేశారు. నిజానికి ఇది ఊహించని పరిణామం.
ఇప్పుడున్న పరిస్థితిలో కరోనాను వంకగా చూపించి.. జగన్ ఈ హామీలను తప్పించుకోవచ్చు. టీడీపీ కూడా ఇదే అంచనా వేసుకుంది.తమకు నోటినిండా(విమర్శించేందుకు) పనిదొరుకుతుందని భావించింది. కానీ, అనూహ్యంగా యువతను ఆకర్షించేలా.. జగన్.. వ్యూహాత్మక అడుగులు వేసే సరికి.. ఇప్పుడు టీడీపీ ఓటు బ్యాంకు లక్ష్యం మళ్లీ జగన్‌వైపు మళ్లిపోయిందని అంటున్నారు పరిశీలకులు. మొత్తానికి జగన్ చేసిన ఓటర్ టేక్ పాలిటిక్స్ వ్యూహం.. టీడీపీకి షాకివ్వడం ఖాయమని చెబుతున్నారు.