Begin typing your search above and press return to search.
జగ్గారెడ్డి.. 'బాహుబలి-శివగామి స్టోరీ చెప్పాడా?' విలేకరులకు!?
By: Tupaki Desk | 22 March 2022 11:30 AM GMTతెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, ఫైర్ బ్రాండ్.. తీవ్ర అసమ్మతి వాదిగా పేరు తెచ్చుకున్న సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి దూకుడుకు పార్టీ అధిష్టానం పెద్ద అడ్గుకట్టే వేసింది. ఉన్న పదవులు పీకేసింది. పీసీసీ చీఫ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం.. ఏమాత్రం లక్ష్యపెట్టకుండా.. రేవంత్‌ను తీవ్రస్థాయిలో దూ షించడం వంటివి రాజకీయంగా చర్చకు వచ్చాయి. ఒకవైపు పార్టీని బలోపేతం చేసేందుకు.. పార్టీ చీఫ్‌గా రేవంత్ ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు... రేవంత్‌ను తిడుతూ.. పార్టీని బలహీన పరిచేందుకు.. ఇలా ప్రయత్నించడం..తీవ్రస్థాయిలో చర్చకు వస్తున్న అంశాలు.
అయితే.. ఇప్పుడు..జగ్గారెడ్డికి అధిష్టానం పదవులు తీసేసింది. దీంతో ఆయన లైన్‌లోకి వచ్చినట్టు కనిపిస్తున్నాడు. ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి.. సోనియా - రాహుల్ గాంధీలు చాలా మంచి వాళ్లు అనిచెబుతున్నారు. అంతేకాదు.. తనకు రేవంత్‌కు మాత్రమే.. తేడా ఉందని జగ్గారెడ్డి చెబుతున్నారు. సరే.. ఇదంతా స్టోరీ నేనని.. ఉద్దేశ పూర్వకంగా.. ఇలా జరుగుతున్నాయని... అంటున్నారు. రేవంత్ టీడీపీలో ఉన్న ప్పుడు.. మరీ ముఖ్యంగా.. తెలంగాణ ఉద్యమ సమయంలో సోనియాను ఏదో అన్న మాటలు ఇప్పుడు.. చూపిస్తున్నాడు జగ్గారెడ్డి అని అంటున్నారు.
రేవంత్ అలాంటివాడు, ఇలాంటి వాడు.. అని చెబుతున్నారు. టీఆర్ ఎస్‌లో ఉన్నప్పుడు.. బీజేపీలో ఉన్నప్పుడు.. కాంగ్రెస్‌ను తిట్టలేదా? అని చూస్తారుకానీ, భవిష్యత్తులో కాంగ్రెస్‌ను ఎవరు భుజాలపై వేసుకుంటారు? ఎవరు గెలిపిస్తారు? అని మాత్రం కాంగ్రెస్ వాదులు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు కాంగ్రెస్ కు.. మెరుగైన వాడు రేవంత్ అని భావించి.. ఫైర్‌బ్రాండ్ అని.. రాబోయే రోజుల్లో అధికార పార్టీని కట్టడి చేస్తారని.. భావించి.. పార్టీ అధిష్టానం రేవంత్‌కు అవకాశం కల్పించిందని అంటున్నారు. దీనికి మీరు ఎంత బాధపడినా ప్రయోజనం ఏంటి? అంటున్నారు.
ఇక, ఈ క్రమంలోనే జగ్గారెడ్డి.. రేవంత్‌రెడ్డి.. గురించి మరో స్టోరీ చెప్పారు. కేసీఆర్ కు బాగోలేదు.. ఏ నిముషంలో ఏమైనా జరగొచ్చు. ఈ క్రమంలో కేటీఆర్‌ను సీఎం చేసినా చేయొచ్చు. కాబట్టి.. మనం అలెర్ట్ కావా లి. అని రేవంత్ రెడ్డి జగ్గారెడ్డికి చెప్పారట. దీనిలో తప్పేముంది.. ? ప్రతిపక్షానికి కూడా ఒక క్లారిటీ ఉండాలి కదా?! వాస్తవానికి కేసీఆర్ కూడా వైఎస్సార్ ఉన్నప్పుడు.. బలహీనంగానే ఉన్నారు. తర్వాత.. వైఎస్ అకాల మరణంతో కేసీఆర్ బలోపేతం అయ్యారు.ఈ క్రమంలోనే కేసీఆర్ వీక్ అయినప్పుడు... కాంగ్రెస్‌ను బలోపేతం చేసుకోవాలని భావించి ఉండొచ్చు కదా!
దీనిలో రేవంత్ చేసిన తప్పేమిటో ఎవరికీ అర్ధం కాదు. కానీ, జగ్గన్న మాత్రం ఇదే పెద్ద తప్పన్నట్టుగా.. రేవంత్ ఏదో కుట్ర చేశాడన్నట్టుగా.. బాహుబలిలో శివగామి స్టోరీ.. చెప్పినట్టు.. మీడియా సమావేశాలు పెట్టి చెప్పాడు.
మరి ఏమైనా.. దీనిలో పస ఉందా? అంటే ఏమీ కనిపించదు. కానీ, జగ్గన్న మాత్రం దూకుడుగా మీడియా సమావేశాలు పెట్టి మీరి.. రేవంత్‌పై విరుచుకుపడుతున్నాడు. ఈ క్రమంలోనే అధిస్టానం ఆయనకు జర్ర జలక్ అయినట్టుగా ఉందిలే.. అంటున్నారు మీడియా వాళ్లు కూడా.