Begin typing your search above and press return to search.
జిన్ పింగ్ రాజీనామా చేశారా ?
By: Tupaki Desk | 15 May 2022 9:30 AM GMTడ్రాగన్ దేశం అధ్యక్షుడు జిన్ పింగ్ రాజీనామా చేశారా ? చేశారో లేదో తెలీదు కానీ రాజీనామా చేశారనే వార్త మాత్రం చైనా సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. జిన్ పింగ్ రాజీనామాకు మూడు కారణాలున్నట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మొదటిదేమో కరోనా వైరస్ నియంత్రణలో చాలా కఠినంగా అణచివేత చర్యలు తీసుకోవటం. రెండో కారణం ఏమిటంటే కరోనా వైరస్ కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను మళ్ళీ గాడిలో పెట్టలేకపోవటం.
ఇక మూడో కారణం ఏమిటంటే బ్రెయిన్ హెమరేజ్ సమస్య. నిజానికి మొదటి రెండు కారణాలకన్నా మూడో కారణమే వ్యక్తిగతంగా జిన్ పింగ్ కు చాలా తీవ్రమైనది. గడచిన రెండేళ్లుగా జిన్ పింగ్ మెదడు సంబంధిత సమస్యతో బాగా ఇబ్బంది పడుతున్నారు. మెదడులోని రక్తనాళాలు ఎప్పుడైనా పగలిపోవచ్చని ఇప్పటికే వైద్యులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రక్తనాళాలు పగిలిపోతే వెంటనే కోమాలోకి వెళ్ళిపోవటమో లేకపోతే చనిపోవటమో జరుగుతుందని డాక్టర్లు ఎప్పటినుండో హెచ్చరిస్తున్నారు.
అర్జంటుగా అధ్యక్షుడికి ఆపరేషన్ చేయకపోతే ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించారు కూడా. ఈ నేపధ్యంలోనే మొదటి రెండు కారణాలు కూడా కలిసొచ్చాయని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మధ్యనే పార్టీ స్టాండింగ్ కౌన్సిల్ సమావేశం జరిగినపుడు జిన్ పింగ్ తో రాజీనామా చేయించాలని నిర్ణయమైందట. సమావేశం తర్వాతే అధ్యక్షుడి రాజీనామా నిర్ణయం బయటకు పొక్కటంతో ఇపుడది వైరల్ గా మారిందనే ప్రచారం జరుగుతోంది.
కరోనా వైరస్ రోగుల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై యావత్ దేశంలో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా జనాలు రోడ్లపైకి వచ్చేసి నిరసనలు తెలుపుతున్నారు. జనాలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలపటాన్ని పాలిట్ బ్యూరో సమావేశం చాలా సీరియస్ గా తీసుకున్నది. నిజానికి అందరికీ కనిపించేది అధ్యక్షుడే అయినా వెనకుండి నడిపించేదంతా పాలిట్ బ్యూరో మాత్రమే. అద్యక్షుడికన్నా పాలిట్ బ్యూరో లేదా స్టాండింగ్ కౌన్సిల్ చాలా పవర్ ఫుల్. కాబట్టి జిన్ పింగ్ రాజీనామా వార్త దేశంలో వైరల్ అయిపోయింది.