Begin typing your search above and press return to search.
లోకేష్ గుడ్ బై చెప్పేసినట్లేనా ?
By: Tupaki Desk | 21 Jun 2021 5:30 AM GMTవచ్చే ఎన్నికల్లో పోటీచేసే విషయంలో నారా లోకేష్ సేఫ్ నియోజకవర్గం కోసం వెతుకుతున్నారా ? కొన్ని నియోజకవర్గాలపై అంతర్గతంగా సర్వే చేయించుకున్న తర్వాత విశాఖపట్నం జిల్లాలోని భీమిలీ నియోజకవర్గమే సరైనదని భావించారా ? అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. దీంతో గుంటూరు జిల్లాలోని మంగళగిరి నియోజకవర్గానికి లోకేష్ గుడ్ బై చెప్పేసినట్లే అనిపిస్తోంది.
2019 ఎన్నికల్లో ఇలాగే చాలా నియోజకవర్గాలపై సర్వేచేసి చివరకు మంగళగిరి అనే రాంగ్ నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నారు. చివరకు ఫలితం ఏమైందో అందరు చూసిందే. మొన్నటి ఫలితం కారణంగా వచ్చే ఎన్నికల్లో మళ్ళీ మంగళగిరిలో పోటీ విషయంలో లోకేష్ వెనకాడుతున్నట్లు సమాచారం. అందుకనే మరో కొత్త సీటు కోసం వెతుకులాట మొదలైందట. ఇందులో భాగంగానే భీమిలీ నియోజకవర్గం సేఫ్ అని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
భీమిలీ నియోజకవర్గం కూడా లోకేష్ కు అంత సేఫ్ అని చెప్పేందుకు లేదు. ప్రస్తుతం ఇక్కడి నుండి వైసీపీ తరపున మంత్రి అవంతి శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నియోజకవర్గం అవంతికి సొంత నియోజకవర్గం కాబట్టి పాతుకుపోయున్నారు. మొన్నటి ఎన్నికల్లోనే భీమిలీ నుండి పోటీచేయాలని లోకేష్ ప్రయత్నించినట్లు ప్రచారం జరిగింది. అయితే ఇక్కడ నుండి గంటా శ్రీనివాసరావు పోటీచేయాలని పట్టుబట్టడంతో చివరకు లోకేష్ మంగళగిరికి షిఫ్ట్ అయ్యారు.
అయితే చివరకు గంటా కూడా ఇక్కడ పోటీచేయలేదు. చివరకు ఇక్కడి నుండి చివరి నిముషంలో సబ్బంహరి పోటీచేశారు. ఈమధ్యనే సబ్బం మరణించటంతో ఇక్కడ నాయకత్వం లేదు. కాబట్టి ఈ సీటుపై లోకేష్ దృష్టిపెట్టారనే ప్రచారం జరుగుతోంది. అయితే భీమిలీ నుండి గెలవటం కూడా లోకేష్ కు అంత వీజీకాదు. ఎక్కడి నుండి పోటీచేయాలన్నది డిసైడ్ కాకపోయినా మంగళగిరికి గుడ్ బై చెప్పేసినట్లే అనిపిస్తోంది. ఎన్నికలకు ఇంకా మూడేళ్ళుంది కాబట్టి ఈ మధ్యలో ఇంకెన్ని డెవలప్మెంట్లు జరుగుతుందో చూడాల్సిందే.