Begin typing your search above and press return to search.
వ్యూహాత్మకంగానే మమత దెబ్బకొట్టారా ?
By: Tupaki Desk | 23 July 2022 5:43 AM GMTఉపరాష్ట్రపతి అభ్యర్ధిని పోటీకి దింపే విషయంలో నాన్ ఎన్డీయే పార్టీలను బెంగాల్ సీఎం మమతాబెనర్జీ వ్యూహాత్మకంగానే దెబ్బ కొట్టినట్లు సమాచారం. ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా సీనియర్ కాంగ్రెస్ నేత మార్గరేట్ ఆల్వాను మమత నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ బహిష్కరించిన విషయం తెలిసిందే. కారణం ఏమిటంటే ఆల్వాను అభ్యర్ధిగా ఎంపిక చేసే ముందు తమను సంప్రదించలేదని మమత మండిపోతున్నట్లు పార్టీ ఎంపీ అభిషేక్ బెనర్జీ ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే అసలు విషయం ఏమిటంటే రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసిన యశ్వంత్ సిన్హాను ఎంపిక చేసింది మమతాయే. అందుకని ఉపరాష్ట్రపతిగా పోటీ చేయాల్సిన అభ్యర్ధి ఎంపికను కాంగ్రెస్ కు వదిలేశారు. సో పార్టీ తరపున ఆల్వాను ఎంపిక చేసినట్లు మమతకు చెప్పేందుకు సోనియాయే ఈనెల 15వ తేదీ ఫోన్ చేసి మాట్లాడారు.
అప్పుడు మమత తన అభ్యంతరాన్ని వ్యక్తం చేయలేదట. 16వ తేదీ సాయంత్రం మరోసారి ఫోన్ చేసి మాట్లాడేందుకు సోనియా ప్రయత్నిస్తే మమత అందుబాటులోకి రాలేదు.
తర్వాత ఇదే విషయమై మాట్లాడేందుకు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ రెండుసార్లు ప్రయత్నించినా మమత అందుబాటులోకి రాలేదు. తర్వాత సీపీఐ కార్యదర్శి డీ రాజా ప్రయత్నించినా మమత పలకలేదు. అంటే జరిగింది చూసిన తర్వాత మమత కావాలనే వీళ్ళందరినీ దూరంగా పెట్టేసినట్లు అర్ధమవుతోంది. అప్పటికే అస్సాం సీఎం సమక్షంలో బద్ధశతృవైన జగదీప్ థనకర్ తో మమత భేటీ అయ్యారు.
నిజానికి ధనకర్ ఉపరాష్ట్రపతి అభ్యర్ధి కావటంతో మమత రెట్టించిన ఉత్సాహంతో వ్యతిరేకంగా పనిచేస్తారని నాన్ ఎన్డీయే పార్టీలన్నీ అనుకున్నాయి. ఎందుకంటే మమత-ధనకర్ మధ్య సంబంధాలు ఉప్పునిప్పులాగున్నాయి కాబట్టి. కానీ ఆశ్చర్యంగా ఉపరాష్ట్రపతి ఎన్నికను బహిష్కరిస్తున్నట్లు మమత ప్రకటించారు.
అంటే థనకర్ తో జరిగిన సమావేశంలోనే నరేంద్రమోడీతో మమతకు ఏదో ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగానే, సోనియా, పవార్ రాజాల ఫోన్లకు మమత అందుబాటులోకి రాకపోవటం. చివరకు ఎన్నికను బహిష్కరించటం ద్వారా థనకర్ గెలుపుకు మమత మద్దతిస్తున్నట్లయ్యింది.