Begin typing your search above and press return to search.

ఆయ‌న మాట విన‌క‌ పోవ‌డంతోనే..మోదీ,షా న‌వ్వుల‌పాలు

By:  Tupaki Desk   |   27 Nov 2019 5:58 AM GMT
ఆయ‌న మాట విన‌క‌ పోవ‌డంతోనే..మోదీ,షా న‌వ్వుల‌పాలు
X
బీజేపీ అగ్ర‌నేత‌, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మ‌హారాష్ట్ర రాజ‌కీయాల గురించి చేసిన కామెంట్లు మ‌రో రూపంలో నిజ‌మ‌య్యాయి. ఊహించని విధంగా ఎన్సీపీ శాసనసభా పక్షనేత అజిత్ పవార్ బీజేపీకి మద్దతు ప్రకటించడంతో దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర సీఎం అయ్యారు. బీజేపీకి మద్దతు ఇచ్చిన ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. దీనిపై బీజేపీ ముఖ్య‌నేత అయిన గ‌డ్క‌రీ స్పందిస్తూ...రాజకీయాల్లో, క్రికెట్ మ్యాచ్ లో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరని పేర్కొంటూ శివ‌సేన‌ను ఎద్దేవా చేసిన‌ విషయం తెలిసిందే. అయితే, పైకి ఇలాంటి కామెంట్లు చేసిన ఆయ‌న లో లోప‌ల బీజేపీ ద్వ‌యం ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ని, జాతీయ అధ్య‌క్షుడు అమిత్‌షాను హెచ్చ‌రించార‌ట‌. స‌ర్కారు మ‌నుగ‌డ‌ పై అల‌ర్ట్ చేశార‌ట. అయితే పెడ‌చెవిన పెట్ట‌డం తో....తాజాగా మ‌హారాష్ట్ర లో బీజేపీ ప‌రువు పోగొట్టుకుంద‌ని అంటున్నారు.

మ‌హారాష్ట్ర లో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాల‌ని భావించిన‌ ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా ద్వయం గతంలో కర్ణాటక, గోవా అనుభవాలను గుర్తు తెచ్చుకొని ఎన్సీపీ నేత అజిత్ పవార్ ను తమ వైపు తిప్పుకున్నారు. నరేంద్ర మోదీ, అమిత్ షా చతురత ఫలితంగా ఇది జ‌రిగింది. అయితే, ఈ స‌మ‌యంలోనే గ‌డ్క‌రీ ఎంట్రీ ఇచ్చార‌ట‌. బీజేపీ కి అజిత్ ప‌వార్ మ‌ద్ద‌తిచ్చిన‌ప్ప‌టికీ...అజిత్ విశ్వ‌సించ‌ద‌గిన వ్య‌క్తి కాద‌ని హెచ్చ‌రించిన‌ట్లు స‌మాచారం. త్వ‌ర‌గా అభిప్రాయం మార్చుకునే వ్య‌క్తిత్వం ఉన్న అజిత్‌ను న‌మ్ముకుంటే ప్రభుత్వం ఎప్పుడైనా కూలి పోతుందని గ‌డ్క‌రీ చేసిన సూచ‌న‌ను ఈ ఇద్ద‌రు నేత‌లు పెడ‌చెవిన పెట్ట‌డం తో ప్ర‌స్తుత ప‌రిస్థితి అంటున్నారు.

మ‌హారాష్ట్ర రాజ‌కీయాల్లో సీనియ‌ర్ నేత‌, బీజేపీ జాతీయ అధ్య‌క్షుడిగా ప‌నిచేసిన అనుభ‌వం, బీజేపీ మాతృక అయిన రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్‌తో స‌న్నిహిత సంబంధాలున్న గ‌డ్కరీ త‌మ రాష్ట్రం లోని ప‌రిణామాల‌ను ప‌క్కాగా చెప్పిన‌ప్ప‌టికీ....మోదీ-షా లైట్ తీసుకోవ‌డంతో...ప్ర‌స్తుత ప‌రిస్థితి ఎదురైంద‌ని అంటున్నారు. `క్రికెట్ లో ఇక మ్యాచ్ మా వైపే ఉంది, విజయం మాదే అనుకుంటున్న సమయంలో ఫలితం మారి పోయే అవకాశం ఉంటుంది. రాజకీయాలూ అంతే` అని నితిన్ గడ్కరీ చెప్పిన మాటలు మహారాష్ట్రలో ఇంకో రూపం లో నిజం అయ్యాయ‌ని ప‌లువురు కామెంట్లు చేస్తున్నారు.