Begin typing your search above and press return to search.
గోవాకు నెహ్రూ అన్యాయం చేశారా? మోడీకి ఇప్పుడే గుర్తుకొచ్చిందే?
By: Tupaki Desk | 9 Feb 2022 1:30 PM GMTమంచి ఇవాళ చెప్పు.. చెడు రేపు చెప్పు అని కొందరు అంటుంటారు. దీని అర్థం మంచి విషయాల గురించి మాట్లాడటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ.. చెడు విషయాల్ని వీలైనంతవరకు మాట్లాడకుండా ఉండటం మంచిదన్న ఉద్దేశంలో చెబుతుంటారు. దేశ ప్రధానిగా వ్యవహరిస్తున్న నరేంద్ర మోడీ మిగిలిన ప్రధానమంత్రులకు కాస్త భిన్నం. ఏదైనా రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూ ఉండి..
ఆ రాష్ట్రంలో బీజేపీ గెలిచే అవకాశం ఉందని భావిస్తే చాలు.. ఆయనలోని అసలుసిసలు రాజకీయ నేత బయటకు వస్తారు. దేనికైనా.. ఎంతకైనా సిద్ధమన్నట్లుగా వ్యవహరిస్తూ.. సదరు రాష్ట్రంలో అధికారాన్ని సొంతం చేసుకోవటం కోసం ఆయన నానా పాట్లు పడతారు. తన పరపతిని తానే తగ్గించుకోవటానికైనా వెనుకాడరు. ఇందుకు నిదర్శనంగా ఆ మధ్య ముగిసిన పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్ని చెప్పక తప్పదు.
ప్రస్తుతం ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ.. ఆయనకు హటాత్తుగా కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులు గుర్తుకు వచ్చాయి. ఆ పార్టీనే లేకపోతే దేశం మరెంత బాగుండేదన్నట్లుగా ఆయన మాటలు ఉన్నాయి. జరిగిన పోయిన విషయాల్ని ఇప్పటికిప్పుడు ప్రస్తావించాల్సిన అవసరం లేదు. కానీ.. అందుకు భిన్నంగా మాట్లాడిన ఆయన కొత్త చర్చ తెర మీదకు వచ్చేలా చేశారు. నిజానికి.. ఎప్పుడో జరిగిపోయిన విషయాల్ని ఇప్పుడు ప్రస్తావించటం అవసరమా?అన్నట్లుగా మారింది. ఒకవేళ.. వాటిని ప్రస్తావించాల్సి వస్తే.. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన దాదాపు ఎనిమిదేళ్లు కావొస్తున్న వేళ.. మాట్లాడటమా? అన్నది ప్రశ్నగా మారింది.
ఏపీ రాష్ట్ర విభజనలో జరిగిన అన్యాయాన్ని ప్రస్తావించిన మోడీ.. కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పుల్ని ఎండగట్టే ప్రయత్నం చేశారు. అదే సమయంలో అవసరంలేని అంశాల్ని తెర మీదకు తీసుకొచ్చారు. దీనికి నిదర్శనంగా గోవా ఇష్యూను ప్రస్తావించటాన్ని చెప్పొచ్చు. గోవాకు దేశ తొలి ప్రధాని జవహరల్ లాల్ నెహ్రు తప్పు చేశారని.. ఆయన కారణంగా గోవాకు అన్యాయం చేశారని ఆరోపించారు.
స్వాతంత్య్రం వచ్చిన 15 ఏళ్ల వరకు గోవా.. పోర్చుగీసు అధీనంలోనే ఉందన్న విషయాన్ని ప్రస్తావించిన మోడీ.. అందుకు కారణం నెహ్రూ చేసిన తప్పులేనని వ్యాఖ్యానించారు. ‘‘ఆయన తప్పిదాల వల్లే గోవాకు విముక్తి లభించలేదు. ప్రపంచం మొత్తం తనను శాంతి కాముకుడిగా భావించాలన్న ఉద్దేశంతోనే గోవా ప్రజలకు నెహ్రూ అన్యాయం చేశారు. ఎర్రకోటపై నుంచి గోవా ప్రజలకు వ్యతిరేకంగా నెహ్రూ ప్రకటన చేశారు. అక్కడికి సైన్యాన్ని పంపబోమన్నారు’ అంటూ పాత విషయాల్ని తనదైన శైలిలో తవ్వి తీసిన ఆయన తీరు చూస్తే.. ఇప్పుడు జరిగే ఎన్నికల కోసం జరిగిపోయిన విషయాల్ని తవ్విపోయటం అవసరమా? అన్న ప్రశ్న ఉదయించకమానదు.
ఇలాంటి అంశాల్ని ఇప్పుడు ప్రస్తావించే కన్నా.. రాజకీయాలకు అతీతంగా ఉండే అంశాల్ని ప్రస్తావించే వేళలో ఇలాంటివి చెప్పి ఉంటే బాగుంటాయి తప్పించి.. ఇప్పుడు చెప్పటం కేవలం ఆ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్ని పరిగణలోకి తీసుకునేనని చెప్పక తప్పదు. గోవాలో జన్మించిన లతా మంగేష్కర్ సోదరుడు హృదయనాథ్ మంగేష్కర్ ఆకాశవాణిలో వీర సావర్కర్‌పై కవితా గానం చేసినందువల్లే ఆయనను తొలగించారని చెప్పటం చూస్తే.. ప్రధాని మోడీ ఎజెండా ఏమిటన్న విషయం ఇట్టే అర్థం కాక మానదు. దేశ ప్రధానిగా వ్యవహరిస్తున్న మోడీ.. ఇలాంటి అంశాల్ని ప్రస్తావించటం ద్వారా ఆయనకు జరిగే రాజకీయ లాభం ఎంతన్నది పక్కన పెడితే.. సామాజికంగా మాత్రం భారీ నష్టాన్నే చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.