Begin typing your search above and press return to search.
నితీశ్ కటీఫ్.. ముందే ఊహించిందేనా? కవరింగ్ అంతే ఇదే బాస్
By: Tupaki Desk | 10 Aug 2022 5:56 AM GMTదారుణ డ్యామేజ్ జరిగినప్పుడు శోకాలు పెట్టే కన్నా.. ఆ డ్యామేజ్ ను తక్కువగా ఫీల్ అయ్యే తెలివిని ప్రదర్శిస్తుంటారు కొందరు. జరగాల్సిన నష్టం జరిగిపోయి.. చేసేదేమీ లేనప్పుడు.. దాని గురించి అట్టే ఆరాటపడే కన్నా.. దానికి పెద్ద ప్రాధాన్యత ఇవ్వకపోవటం లాంటి కొత్త ఎత్తులు మోడీషాలు బిహార్ ఎపోసోడ్ లో వేస్తున్నారా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. నితీశ్ దెబ్బేస్తారని.. మిత్ర బంధాన్ని తెంచుకుంటారని ముందే తెలుసంటూ చేస్తున్న విశ్లేషణలు అన్ని కూడా మోడీషాల ఇమేజ్ మరింత డ్యామేజ్ కాకుండా చేసే ప్రయత్నాలుగా చెప్పాలి.
ఇప్పుడున్న పరిస్థితుల్లో మోడీషాలను ఎవరు తక్కువ అంచనా వేయలేరు. సుబ్బరంగా సాగే ప్రభుత్వాలను సైతం ఏక్ నాథ్ షిండేలను తయారు చేసి తాము కోరుకున్న వారు పవర్లో ఉండేలా చేస్తున్న బీజేపీ అధినాయకత్వం.. బిహార్ విషయంలో ఎక్కడో లెక్క తేడా తప్పినట్లుగా అంచనా వేస్తున్నారు.
నితీశ్ మీద మోడీషాలకు ఉన్న నమ్మకంతో అలా చేసి ఉండరని అంచనా వేస్తున్నారు. తమతో పోలిస్తే నితీశ్ కు బలం తక్కువగా ఉన్న వేళ.. తమ అండతోనే ఆయన ఆగిపోతారన్న విషయంలో వారి అంచనాలు పూర్తిగా ఫెయిల్ అయినట్లుగా చెప్పాలి.
కొన్ని విశ్లేషణల్లో పేర్కొన్నట్లు.. తనకు జనాదరణ తగ్గినట్లుగా నితీశ్ భావిస్తే.. ఇప్పుడు అనుకుంటున్న కాంబినేషన్ (జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ లతో కూడి ప్రభుత్వం) ముందే ఎందుకు వర్కువుట్ కాలేదన్నది ప్రశ్న. బిహార్ లో బీజేపీ బలపడుతుందన్న అనుమానంతోనే నితీశ్ ఇలా చేశారనటంలోనూ తప్పేనని చెబుతున్నారు. నిజానికి నితీశ్ ఇలా చేయటం వెనుక మాస్టర్ ప్లాన్ వేరే ఉందన్న మాట వినిపిస్తోంది.
నితీశ్ ను తమ అసలుసిసలు మిత్రుడిగా మోడీషాలు భావించారని.. అదే వారిని దెబ్బ తీసినట్లుగా అంచనా వేస్తున్నారు. నిజానికి..మోడీషాలకు మిత్రుల విషయంలో ఎలా వ్యవహరించాలన్నదానిపై క్లారిటీ ఉంది. తమ పార్టీ బలపడాలే కానీ..తమ కారణంగా తమ మిత్రుడు బలపడటాన్ని సైతం అస్సలు ఒప్పుకోరని.. అలాంటిది నితీశ్ విషయంలో మాత్రం వారి అంచనాలు ఘోరంగా ఫెయిల్ అయ్యాయని చెబుతున్నారు. నితీశ్ విషయాన్ని ముందే ఊహించారని.. ఆయన మనసు మార్చే ప్రయత్నాలు చేయలేదన్న వాదనలో పస లేదని.. ఇది కేవలం మోడీషాల ఇమేజ్ ను డ్యామేజ్ చేయకుండా కాపాడటమే తప్పించి మరొకటి కాదంటున్నారు.
నిజానికి మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే బిహార్ విషయంలో కమలనాథులు కాస్త భిన్నంగా వ్యవహరించారనే చెప్పాలి. ఎక్కడైనా తమకు ఎక్కువ సీట్లు ఉంటే.. ముఖ్యమంత్రిగా తమ పార్టీ వ్యక్తే ఉంటాడన్న దానికి భిన్నంగా.. తమకున్న సీట్లలో సగం మాత్రమే ఉన్నప్పటికీ నితీశ్ ను సీఎంగా ఒప్పుకోవటానికి కారణం.. ఆయన మీద ఉన్న నమ్మకం.. పెద్ద మనిషిలా ఉండే సౌమ్యుడు కావటంతో.. ఎక్కువగా ఫోకస్ చేయలేదని.. అదే ఇప్పుడు బీజేపీ కొంప ముంచినట్లుగా చెబుతున్నారు.