Begin typing your search above and press return to search.
‘నో ఓటు’ భారతీయ విద్యార్థులకు ఉక్రెయిన్ లో చేటుతెచ్చిందా?
By: Tupaki Desk | 28 Feb 2022 3:06 PM GMTఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ ఇప్పుడు భారతీయ విద్యార్థులకు కష్టాలు తెచ్చిపెట్టింది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో తాజాగా ఉక్రెయిన్ పై ప్రత్యేక అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. ఐరాస భద్రతా మండలి ఓటులో భారత ప్రభుత్వం మళ్లీ గైర్హాజరైంది. ఈ తీర్మానానికి అనుకూలంగా 11 ఓట్లు రాగా, భారత్, చైనా, యూఏఈలు గైర్హాజరయ్యాయి.
ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ఈ వారాంతంలో ప్రధాని మోదీతో మాట్లాడి, పుతిన్ దాడికి వ్యతిరేకంగా భారతదేశం సహాయం కోరారు. తమకు మద్దతు ఇవ్వాలని విన్నవించారు. అయినప్పటికీ భారత ప్రభుత్వం ఉక్రెయిన్‌కు వ్యతిరేకంగా తన వైఖరిని కొనసాగించింది.
భారత ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య ఉక్రెయిన్ సరిహద్దుల్లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సరిహద్దులు దాటేందుకు ప్రయత్నిస్తున్న విద్యార్థుల పట్ల ఉక్రెయిన్ సైనికులు దురుసుగా వ్యవహరిస్తున్నారు. వందలాది మంది విద్యార్థులను ఉక్రెయిన్ సైనికులు కొట్టి హింసించారు.
ఉక్రెయిన్ సైనికులు భౌతిక దాడికి పాల్పడుతున్న దృశ్యాలు కెమెరాలో రికార్డ్ అయ్యాయి. కొంతమంది విద్యార్థులు పరిస్థితిని ఎదుర్కొనేందుకు తాము ఎదుర్కొన్న కష్టాలను వివరించారు. బాలురు కనికరం లేకుండా వేధింపులకు గురవుతుండగా ఉక్రెయిన్ సైనికులకు పదే పదే అభ్యర్థనలు చేయడంతో మహిళా విద్యార్థులను విడిచిపెట్టారు.
ఇంతలో ప్రధాని మోడీ క్యాబినెట్ సహచరులతో అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు. భారత విద్యార్థులు సరిహద్దులు దాటడానికి కష్టపడుతుండడంతో పోలాండ్ మరియు రొమేనియాలకు కొంతమంది మంత్రులను పంపాలని భారత ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. వారు వెళ్లి భారత విద్యార్థులను తీసుకురానున్నారు..
-ఇక ప్లీజ్ కాపాడండి అంటూ తెలుగు యువతి ఆవేదన

ఇక ఉక్రెయిన్ లోని ఖార్కివ్ బంకర్లలో తలదాచుకున్న హైదరాబాద్ ఎంబీబీఎస్ ఫైనల్ విద్యార్థిని కల్పన అక్కడి ఇబ్బందులను చెబుతూ ఓ వీడియో పంపింది. ఇంకా 5వేల మంది భారత విద్యార్థులు బంకర్లలోనే ఉన్నారు. ఆహారం, వాష్ రూమ్స్ లేవు. ఉష్ణోగ్రత మైనస్ డిగ్రీల్లో ఉంది. భారత ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి కమ్యూనికేషన్ లేదు. సరిహద్దుకు 1400 కి.మీల దూరంలో ఉన్నాం.. ఎలా వెళ్లాలి అంటూ తెలుగు విద్యార్థి వాపోయింది.