Begin typing your search above and press return to search.

ఎన్టీయార్ ఫ్యాన్స్ కి బాబు దొరికేశారా...?

By:  Tupaki Desk   |   12 Oct 2022 2:12 PM GMT
ఎన్టీయార్ ఫ్యాన్స్ కి బాబు దొరికేశారా...?
X
రాజకీయాలు ఇపుడు ఎక్కడ లేవు అన్నట్లుగా పరిస్థితి ఉంది. తుమ్మినా దగ్గినా అందులో నుంచి అర్ధాలు పెడార్ధాలు పరమార్ధాలు తీసి సోషల్ మీడియాలో రచ్చే చేసేసే రాక్షస రోజులివి. ఇదిలా ఉంటే ఎపుడూ జూనియర్ ఎన్టీయార్ మీద టీడీపీ క్యాడర్ వేసుకుంటూ ఉంటుంది. జూనియర్ టీడీపీకి సపోర్ట్ గా పెద్దగా ఉండరని బండ వేస్తూ ఉంటుంది. ఏ చిన్న విషయం దొరికినా ఆయన్ని కార్నర్ చేసేందుకు చూస్తూ ఉంటుంది.

ఇపుడు అలాంటి చాన్స్ ఎన్టీయార్ ఫ్యాన్స్ కి దొరికిందా అంటే అవును అంటున్నారు. అన్ స్టాపబుల్ రియాల్టీ షో లో చంద్రబాబు తనకు బెస్ట్ ఫ్రెండ్ వైఎస్సార్ అని చెప్పారు. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే జూనియర్ ఫ్యాన్స్ బాబు మీద కామెంట్స్ పాస్ చేస్తున్నారుట. వైఎస్సార్ కి జిగినీ దోస్త్ అని బాబు చెప్పుకోవచ్చు. అదే జూనియర్ కి కొడాలి నానితో స్నేహం ఉండకూడదు, ఆయన వేరే విధంగా ఎవరితో స్నేహం నెరపకపోయినా జగన్ ఫ్రెండ్ అని ముద్ర వేసేస్తారు ఇదే కదా మీ రాజకీయం అంటూ మండిపడుతున్నారుట.

అయితే ఇక్కడ వారు అర్ధం చేసుకోవాల్సింది ఏంటి అంటే బాబు చెప్పింది ఆయన రాజకీయ జీవితంలో తొలి రోజుల గురించి. పీగా అప్పట్లో వైఎస్సార్ బాబు ఇద్దరూ మంచి మిత్రులుగా ఉండేవారు. అవన్నీ అందరికీ తెలిసిందే ఆ తరువాత బాబు టీడీపీలోకి వెళ్లడంతోనే ఇద్దరు మధ్య ప్రత్యర్ధి పాలిటిక్స్ నడిచాయి. అయినా కూడా ఇద్దరూ హుందా అయిన రాజకీయమే చివరి దాకా చేశారు.

ఇక చూస్తే ఏపీలో రాజకీయం తెలిసిన వారందరికీ బాబుకు వైఎస్సార్ ఫ్యామిలీకి రాజకీయ విరోధం ఏ రేంజిలో ఉందో ఇట్టే అర్ధమవుతుంది. అదే జూనియర్ విషయం తీసుకుంటే కొడాలి నాని జూనియర్ ఎన్టీయార్ మంచి సన్నిహితులు అని అంతా ఒప్పుకుంటారు. అదే కొడాలి నానికి రాజకీయంగా అవకాశాలు ఇప్పించింది జూనియరే. ఇపుడు నాని వైసీపీలో ఉన్నారు. ఆయన జూనియర్ ఎన్టీయార్ భుజాల నుంచి టీడీపీ మీద గురి పెడుతున్నారు. ఎవరూ ఇప్పటిదాకా అనని మాటలను అంటున్నారు. ఘాటుగా విమర్శలు చేస్తున్నారు.

మొత్తం మీద చూస్తే జూనియర్ ఎన్టీయార్ విషయం వేరు బాబు విషయం వేరు అని తేల్చేస్తున్నారు. ఇక జూనియర్ టీడీపీ విషయంలో అంటీ ముట్టనట్లుగా ఉండడం మీద కూడా పసుపు పార్టీ క్యాడర్ ఫైర్ అవుతున్నారు, అది తన సొంత మేనత్త భువనేశ్వరి విషయం అయినా లేక ఎన్టీయార్ హెల్త్ వర్శిటీ అయినా టీడీపీ ఆశించిన స్థాయిలో జూనియర్ రియాక్షన్ లేదన్నదే వారి బాధ, వాదన. మొత్తం మీద చూస్తే బాబు వైఎస్సార్ నా ఫ్రెండ్ అనడంలో రాజనీతి ఉంది అని అంటున్నారు. అయినా సరే తమ హీరోను కార్నర్ చేస్తున్నారు అన్న ఆగ్రహం అయితే జూనియర్ ఫ్యాన్స్ లో ఉండడమే ఇక్కడ కొసమెరుపు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.