Begin typing your search above and press return to search.
పవన్ ఆ బాధను మనసులో దాచుకున్నారా?
By: Tupaki Desk | 18 July 2022 7:30 AM GMTమిత్రపక్షం హోదాలో బీజేపీ చేసిన అవమానాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పైకి చెప్పుకోలేకపోతున్నారా ? తాజాగా పవన్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది.
భీమవరంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా విగ్రహావిష్కరణ జరగిన విషయం తెలిసిందే. ఆ కార్యక్రమానికి పవన్ వెళ్ళలేదు. మీడియా సమావేశంలో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ స్ధానిక ఎంపీ రఘురామకృష్ణంరాజునే పిలవనపుడు తానెందుకు వెళ్ళడం అని తాను కూడా వెళ్ళలేదట.
అసలు పవన్ చెప్పిందానికి ఎలాంటి లాజిక్ లేదన్న విషయం అర్ధమైపోతోంది. అల్లూరి కార్యక్రమాన్ని పర్యవేక్షించింది కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి. కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ప్రాపర్ గా పవన్ కు ఆహ్వానం అందలేదన్నది వాస్తవం.
చివరి నిముషంలో పవన్ కు ఆహ్వానం పంపిన కిషన్ రెడ్డి ప్రతినిధిగా ఎవరినైనా పంపమని కోరారు. ప్రతినిధిని పంపాల్సిందిగా కోరటమంటే పవన్ రాకపోయినా పర్లేదనే కదా అర్దం.
అయితే పది రోజులకు ముందే సోదరుడు చిరంజీవిని మాత్రం ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఏ హోదాలేని చిరంజీవిని ప్రత్యేకంగా ఆహ్వానించి వేదిక మీద మోడీ పక్కన కూర్చోబెట్టి మిత్రపక్షమైన జనసేన అధినేత పవన్ను మాత్రం తీవ్రంగా అవమానించింది. దాన్ని బయటకు చెప్పుకుంటే పరువుపోతుందని దాన్ని చెప్పుకోలేక రఘురాజును సాకుగా చెప్పుకుంటున్నారు. రఘురాజు వైసీపీ ఎంపీ అన్న విషయం పవన్ మరచిపోయారా ? రఘురాజు కార్యక్రమానికి హాజరు కాకపోవటానికి వెనుక చాలా కారణాలున్నాయి.
కార్యక్రమానికి స్ధానిక ఎంపీ హాజరవ్వటానికి కాకపోవటానికి పవన్ కు ఏమీ సంబంధం లేదు. తనను ప్రత్యేకంగా ఆహ్వానించలేదు కాబట్టే పవన్ వెళ్ళలేదంతే. ఆ విషయాన్ని బయటకు చెప్పుకుంటే పరువుపోతుందని బాగా తెలుసు. ఎంపీని కార్యక్రమానికి ఎందుకు పిలవలేదని ప్రధానమంత్రి కార్యాలయాన్ని ప్రశ్నించలేరు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని నిలదీయలేరు. అందుకనే జరిగిన అవమానాన్ని చెప్పుకోలేక పిచ్చి లాజిక్కులన్నీ చెబుతున్నారు.