Begin typing your search above and press return to search.
కేసీఆర్ వ్యూహం.. పవన్ కు అర్ధమైందా?!
By: Tupaki Desk | 3 Jan 2023 7:28 AM GMTరాజకీయాల్లో ఎవరి వ్యూహాలు వారికి ఉంటాయి. ఎవరి ప్లాన్ వారికి ఉంటుంది. దీనిని ప్రత్యర్థి పార్టీలు అర్ధం చేసుకునేలోగానే.. జరగాల్సిన రాజకీయం జరిగిపోతుంది. ఇప్పుడు ఏపీలోనూ ఇలాంటి పరిణామమే తెరమీదికి వచ్చింది. నిన్న మొన్నటి వరకు కూడా. ఏపీలో కాపు సామాజిక వర్గం తనవెంట ఉంటుందని.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయానికి వచ్చారు. కాకినాడ సభ నుంచి రాజమండ్రి రోడ్ షో వరకు ఆయన దీనినిపైకి చెప్పకపోయినా.. తన వారు తనకు అండగా ఉంటారని అనుకున్నారు.
ఈ క్రమంలోనే 2024లో ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని అనుకున్నారు. కనీసం.. అధికారం కాకపోయి నా.. అసెంబ్లీలోకి ఈ సారి అడుగులు వేసి.. 10-12 మందిని గెలిపించుకుని తీరాలని పవన్ నిర్ణయించుకు న్నారు. ఈ క్రమంలోనే మెగా ఫ్యాన్స్, కాపునాడు నాయకులు కూడా అంతర్గత సమావేశాలు పెట్టుకుని.. పవన్‌కు మద్దతివ్వాలని నిర్ణయించుకున్నాయి. టీడీపీతో పొత్తు పెట్టుకునే విషయంలో కొంత విభేదం ఉన్నప్పటికీ.. పవన్ కోసం.. వారుముందుకు వస్తున్నారు.
అయితే.. ఇప్పుడు తెలంగాణ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ఒక పక్కా వ్యూహంతో వేసిన అడుగులు పవన్‌ను ఇరకాటంలోకి నెట్టేస్తున్నాయి. ఎందుకంటే.. కాపు సామాజిక వర్గానికి చెందిన తోట చంద్రశేఖర్‌ను ఏపీ బీఆర్ ఎస్ పార్టీకి అధ్యక్షుడిగా ప్రకటించారు.
అంటే.. తాము కాపులకు ప్రాధాన్యం ఇస్తన్నామని కేసీఆర్ చెప్పకనే చెప్పారు. దీంతో ఖచ్చితంగా కాపుల్లోని తటస్థ వర్గం బీఆర్ ఎస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. అంతేకాదు.. కాపుల్లో టికెట్ల కోసం వేచి చూస్తూ.. విసిగిపోయిన వారికి బీఆర్ ఎస్ ఒక అందివచ్చిన వరంగా మారనుంది.
అయితే, ఇక్కడ రెండు ప్రయోజనాలు కేసీఆర్ ఆశిస్తున్నట్టు కనిపిస్తోంది. ఒకటి.. తన మిత్రుడు.. జగన్‌కు ప్రత్యక్ష, పరోక్షాల్లో ఓటు బ్యాంకును ముఖ్యంగా కాపు ఓటు బ్యాంకును చీల్చడం ద్వారా సాయం చేయడం. రెండు తెలంగాణలో నూ తాను పోటీ చేస్తానని చెప్పిన పవన్‌ను ఏపీలో తుత్తునియలు కింద.. విచ్చిన్నం చేయడం.. అనే వ్యూహాలను పెట్టుకున్నట్టు తెలుస్తోంది.
ఎందుకంటే.. ఎవరు ఎక్కడైనా రాజకీయాలు చేయొచ్చు. తాను ఎక్కడైనా జెండా ఎగరేయొచ్చు. కానీ, ఎవరూ తెలంగాణపై అడుగు పెట్టకూడదనే వ్యూహంతో కేసీఆర్ ఎప్పటి నుంచో వ్యూహాలు వేస్తున్నారు. ఈ క్రమంలో పవన్‌ను డిఫెన్స్‌లో పడేసే వ్యూహం ఉందని అంటున్నారు పరిశీలకులు. మరి ఈ వ్యూహం పవన్‌కు అర్ధమైందా? లేదా.. అర్ధమైతే.. ఏం చేస్తారు? అనేది చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.