Begin typing your search above and press return to search.
ప్రత్యర్థులకు పంచ్ లు వేయటానికి పవన్ ను భలేగా వాడేశారుగా?
By: Tupaki Desk | 8 Oct 2021 6:12 AM GMTదసరా ఉత్సవాల సందర్భంగా బెజవాడ కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్ ను ముస్తాబు చేయటం.. దానికి గ్రాండ్ గా లైటింగ్ వేయటం తెలిసిందే. అయితే.. ఈ లైటింగ్ ఎప్పటికప్పుడు మారుతూ.. వివిధ రంగుల్లో వస్తూ చూపురులను ఆకట్టుకునేలా తయారు చేశారు. అయితే.. ఒక సందర్భంలో వైసీపీ పార్టీ జెండా రంగులైన గ్రీన్.. బ్లూ కలర్ లో రావటం.. దాన్ని స్క్రీన్ షాట్ గా తీసుకొని నిన్నటి నుంచి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సాగుతున్న ప్రచారంపై తాజాగా వైసీపీ అభిమానులు సరికొత్త పంచ్ లు ఇస్తున్నారు.
వైఎస్సార్ పార్టీ కార్యాలయం అనుకునేరు కాదు.. విజయవాడ కనకదుర్గమ్మ గుడి అంటూ సాగుతున్న ప్రచారానికి.. భారీ కౌంటర్ ఇచ్చారు. ఇందుకోసం యాభై ఒక్క సెకన్ల వీడియోను సిద్ధం చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. తమ పార్టీని.. ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు సాగుతున్న ప్రచారానికి పంచ్ ఇచ్చేందుకు జనసేన అధినేత.. తమపై తరచూ మాటలతో విరుచుకుపడే పవన్ కల్యాణ్ ను వాడేయటం విశేషం. పవన్ నటించిన గంగతో రాంబాబు సినిమాలోని సీన్ ను తాజాగా తమ పంచ్ కు అనుుకూలంగా వాడుకున్నారు.
అసలు వార్తకు బదులుగా.. తమదైన శైలిలో పచ్చ మీడియా తమపై విషపు ప్రచారం జరుగుతుందన్న మాటను.. క్రియేటివిటీతో చూపించిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏమైనా.. తమ వాదనకు బలం చేకూరేందుకు ఎవరినైనా వాడేస్తామన్న విషయాన్ని పవన్ మూవీలోని క్లిప్ ను వాడేయటం ద్వారా మరోసారి ఫ్రూవ్ చేశారని చెప్పాలి.