Begin typing your search above and press return to search.

రఘురామ.. మళ్లీ రచ్చ మొదలుపెట్టావా?

By:  Tupaki Desk   |   23 Jan 2022 12:30 AM GMT
రఘురామ.. మళ్లీ రచ్చ మొదలుపెట్టావా?
X
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ ప్రతీరోజు విలేకరులకు కాఫీలు టిఫిన్లు పెట్టి తన ప్రెస్ మీట్ కు ఆహ్వానించి బుర్ర కథ చెప్పడం అలవాటుగా చేసుకున్నాడని ఆయన ప్రెస్ మీట్ చూసిన వాళ్లు సెటైర్లు వేస్తున్నారు. తాజాగా శ్రీశ్రీ కథలు, బుర్రకథలు చెబుతూ జగన్ సర్కార్ పై విరుచుకుపడ్డారు. ఆ వీడియో వైరల్ గా మారింది.

ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు వర్ధంతి సందర్భంగా ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్లు రఘురామ రాజు పేర్కొంది. ఈ క్రమంలోనే శ్రీశ్రీ కవితలు పలుకుతూ ఏపీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. పీఆర్సీపైనా ఉద్యోగుల నిరసనను సమర్థించారు. ఈ క్రమంలోనే ఉద్యోగులను జగన్ సర్కార్ మోసం చేసిందని రఘురామ ఆరోపించారు.

ఉద్యోగులను బుజ్జగించడానికి వేసిన కమిటీలో మంత్రులు బొత్స, బుగ్గన, నాని, సజ్జల, సీఎస్ సమీర్ శర్మ ఉన్నారని.. ఉద్యోగులు సమ్మె చేయడానికి వెళ్లినా జగన్ సర్కార్ పట్టించుకోని విధంగా ప్రవర్తిస్తుందని హెచ్చరించారు. ఏపీలో ఆర్థిక పరమైన అత్యవసర పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. రాష్ట్రంలో ఉద్యోగులకు వేతనాలిచ్చే పరిస్థితి లేదన్నారు. ఐఆర్ ఇచ్చి ఉద్యోగులను ఏపీ సర్కార్ మభ్య పెట్టిందని ఆరోపించారు. ఉద్యోగులకు ఐఆర్ ఇవ్వడం ద్వారా ఏపీ సర్కార్ పైన రూ.17వేల కోట్ల భారం పడనుందని ఆర్ఆర్ఆర్ తెలిపారు. అయితే ఐఆర్ తోపాటు పీఆర్సీ ఇవ్వాల్సిన సర్కార్ మొండి చేయి చూపే అవకాశాలున్నాయని ఆరోపించారు.

రాష్ట్రంలో విమానాశ్రయాలపైన ప్రభుత్వం ఆలోచించడం మింగ మెతుకు లేదు.. మీసాలకు సంపెంగ నూనె అన్న రీతిన ఉందని విమర్శించారు. ఈ క్రమంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తనకు ఫాంటో ఫోబియా ఉందని విమర్శించాడని గుర్తు చేశారు.

మొత్తంగా నరసాపురం ఎంపీ రఘురామ.. తన ప్రత్యర్థిపైన సీఎం జగన్ సర్కార్ పై తనదైన శైలిలో పలు విషయాలపైన సుదీర్ఘంగా విమర్శించారు.