Begin typing your search above and press return to search.

అప్పుడే రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడా?

By:  Tupaki Desk   |   6 July 2021 11:30 AM GMT
అప్పుడే రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడా?
X
ఔను! ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నేత‌ల మ‌ధ్య‌.. ముఖ్యంగా తీవ్ర అసంతృప్తితో ర‌గిలిపోతున్న సీనియ‌ర్ నేత‌ల మ‌ధ్య ఇదే విష‌యంపై చ‌ర్చ సాగుతోంది. రేవంత్ రెడ్డి దూకుడు చూసి వారు ఈర్ష్య ప‌డుతున్నారు కూడా. నిన్న‌ గాక మొన్న పార్టీలోకి వ‌చ్చి.. అప్పుడే.. ఏకంగా రాష్ట్ర కాంగ్రెస్ ప‌గ్గాల‌ను చేప‌ట్ట‌డంపై కాంగ్రెస్లో సీనియ‌ర్లు ర‌గిలిపోతున్నారు. అయితే. వీరి మాట ఎలా ఉన్నా.. రేవంత్ మాత్రం త‌న దారిలో తాను దూకుడుగా ముందుకు సాగుతున్నారు. తెలంగాణ పీసీసీ చీఫ్‌గా ఎంపికైన రేవంత్‌.. ఈ నెల ఏడున బాద్య‌త‌లు చేప‌ట్టనున్నారు.

అయితే.. ఈకార్య‌క్ర‌మాన్ని.. అదిరిపోయేలా చేయాల‌ని ప్లాన్ చేసుకున్న‌ట్టు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. రేవంత్ తెలంగాణ పీసీసీ అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్న కార్య‌క్ర‌మానికి పొరుగు రాష్ట్రం క‌ర్ణాట‌క నుంచి మాజీ సీఎంను కూడా ఆహ్వానించిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. అదేస‌మ‌యంలో దాదాపు త‌న అనుకూల మీడియాలో ఈ కార్య‌క్ర‌మానికి పెద్ద ఎత్తున ప్ర‌చారం క‌ల్పించాల‌ని కూడా నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే టీవీల్లో యాడ్స్‌కూడా ఇస్తున్నారు. ఇలా.. రేవంత్ దూకుడును చూస్తున్న ప‌లువురు అసంతృప్త నేత‌లు.. `రేవంత్ అప్పుడే.. సీఎం అయిపోయాడా?` అంటూ.. కామెంట్లు చేస్తున్నారు.

అయితే.. దూకుడు మాట పక్క‌న పెడితే.. కాంగ్రెస్‌లో మ‌నుగ‌డ సాధించ‌డం అంటే అంత ఈజీకాద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. అంత‌ర్గ‌త ప్ర‌జాస్వామ్యం పేరుతో ఒక‌రిపై ఒక‌రు నిప్పులు చెర‌గ‌డం.. పార్టీ ప‌రువును కూడా బ‌జారుకు లాగ‌డం అనేది ఈ పార్టీలో కామ‌న్‌. అదేస‌మ‌యంలో ఎవ‌రికి వారే అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించ‌డం. గ్రూపు రాజ‌కీయాలు కాంగ్రెస్‌లో కామ‌న్‌. సో.. వీటిని త‌ట్టుకుని.. రేవంత్ అంద‌రినీ క‌లుపుకొనిపోయి.. కార్య‌క‌ర్త‌ల‌ను ఏక‌తాటిపై న‌డిపించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఒకింత క‌ష్ట‌ప‌డి.. అంద‌రూ ఏక‌తాటిపైకి వ‌స్తే.. కాంగ్రెస్ విజ‌యం ద‌క్కించుకునే అవ‌కాశం ఉంది. కానీ, అదేస‌మ‌యంలో బీజేపీ కూడా బ‌ల‌ప‌డుతోంది. ఫైర్ బ్రాండ్ నాయ‌కులు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ క్ర‌మంలో కాంగ్రెస్‌లో అసంతృప్తుల‌ను చ‌ల్లార్చ‌డం.. అంద‌రికీ ప్రాధాన్యం ఇవ్వ‌డం, త‌న‌వైపు తిప్పుకోవ‌డం, అనేది రేవంత్‌కు రాజ‌కీయంగా పెను స‌వాలేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఈ క్ర‌మంలో రేవంత్ ఎలా ముందుకు సాగుతారు.. కేసీఆర్ వంటి బ‌లమైన నేత ఒక‌వైపు, ఎట్టి ప‌రిస్తిలోనూ అధికారంలోకి రావాల‌ని భావిస్తున్న బీజేపీ మ‌రోవైపు వెర‌సి.. రేవంత్ ఎలా దూకుడు చూపిస్తారో చూడాల‌ని అంటున్నారుప‌రిశీల‌కులు.