Begin typing your search above and press return to search.
షర్మిల ఏపీని మోసం చేశారా?
By: Tupaki Desk | 2 Feb 2022 10:30 AM GMTదివంగత వైఎస్ తనయ, ప్రస్తుతం వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు.. ఏపీ సీఎం జగన్ సోదరి.. వైఎస్ షర్మిల.. నవ్యాంధ్రకు మోసం చేశారా? గతంలో రెండు ఎన్నికల సమయంలో ఆమె ఏమన్నారు? ఇప్పుడు ఏం మాట్టాడుతున్నారు? ఇంతలోనే ఏపీ వెగటు పుట్టిందా? ఏపీ ఏం ద్రోహం చేసింది? ఎందుకు ఏపీపై ఇలా వ్యవహరిస్తున్నారు? ఆమె మాటలు నమ్మిన మహిళలు.. ఏపీలో వైసీపీని గెలిపించారు. మరి ఇప్పుడు ఆమె ఏపీని తూలనాడుతున్నారంటే.. ఆమె ఏపీని మోసం చేసినట్టే కదా? ఇదీ.. ఇప్పుడు నెటిజన్ల నుంచి సామాన్య ప్రజల వరకు అంటున్న మాట.
విషయంలోకి వెళ్తే.. షర్మిలకు ఏపీకి మధ్య సంబంధం ఉంది. గతంలో జగన్ జైల్లో ఉన్నప్పుడు పాదయా త్ర చేసి.. జగనన్న వదిలిన బాణాన్ని అనని పరిచయం చేసుకుని.. ప్రజల్లోకి పార్టీని తీసుకువెళ్లింది.. ఇక, పులివెందులలో పర్యటిస్తూ.. ఏపీ పుట్టినల్లు అని చెప్పి.. అన్నగారి కోసం.. 2014, 2019 ఎన్నికల్లో తల్లితో కలిసి ప్రచారం చేసింది. ఈ సందర్భంగానే.. ఏపీ ప్రజలకు అనేక హామీలు కూడా గప్పించింది. తన అన్నను సీఎం చేస్తే... రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని కూడా చెప్పింది. ఇక, ప్రతిపక్ష నేతలపై కారాలు మిరియాలు నూరింది.
ఎన్నికల వేళ.. బైబై బాబు.. లోకేష్ పప్పు! అంటూ.. నినాదాలు చేసి, కార్యకర్తలతోనూ చేయించింది. దీంతో ఏపీకి ఆమెకు మధ్య సంబంధం పెరిగింది. అంతేకాదు... తన అన్నను సీఎంను చేస్తే.. రాష్ట్రం అన్ని రూపాల్లోనూ అభివృద్ధి చెందుతుందని.. రాజన్న రాజ్యం వస్తుందనని.. ఇలా అనేక హామీలు గుప్పించారు అయితే.. ఇవి నెరవేరాయా? లేదా? అనేది ప్రజలు వచ్చే ఎన్నికల్లో తేలుస్తారు. ఇదిలావుంటే.. అన్నగారు తనకు ఏమీ ఇవ్వలేదని.. కనీసం తనను రాజ్యసభకు కూడా పంపించలేదని.. మనసులో ఉంచుకుని.. తెలంగాణలోకివెళ్లి పార్టీ పెట్టింది.
వాస్తవానికి ఉమ్మడిరాష్ట్రం కోసం ప్రయత్నించిన వైఎస్ కుటుంబం నుంచివచ్చిన షర్మిల.. తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టడం చిత్రం. ఇదిలావుంటే.. ఇప్పుడు వైసీపీ కేడర్ ఏపీలో నానా ఇబ్బందులు పడుతోంది. కనీసం తమను పార్టీ పట్టించుకోవడం లేదని.. అధికారంలో ఉండి కూడా తమకు ఏమీ ప్రయోజనం లేకుండా పోయిందని.. ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక, ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఏపీ తనది కాదన్నట్టుగా షర్మిల వ్యవహరిస్తున్నారు. అంతేకాదు.. తన దగ్గర ఏపీ గురించి మాట్లాడొద్దని మీడియాకు సైతం ఆమె హుకుం జారీ చేస్తున్నారు.
అయితే.. ఇదే ఇప్పుడు విమర్శలకు దారితీస్తోంది. ఎందుకంటే.. పులివెందులకు వెళ్లి ప్రతిసారీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారు. వైఎస్ జయంతి, వర్థంతులకు వెళ్లివస్తున్నారు. కానీ.. ఏపీ గురించి, అక్కడి వైసీపీ నేతల గురించి.. అక్కడ ప్రజలు పడుతున్న తిప్పల గురించి మాత్రం మాట్లాడితే.. మాత్రం డ్యామిట్ ఏపీ గురించి మాట్లాడొద్దని చెప్పానా? అంటున్నారు.
మరి షర్మిలకు ఏపీ ఏం చేసింది? ఆమెకు.. ఏపీపై కోపం ఎందుకు? ఏదైనాఆ ఉంటే.. తనను వాడుకుని వదిలేసిన తన అన్నగారిపై కోపం ఉండాలికానీ.. అంటున్నారు మేధావులు. ఏపీలో అందరినీ నమ్మించి.. జగన్ పార్టీకి ఓటేయమని చెప్పి.. ఇప్పుడు ఏపీలో ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎలా పోయినా... తన సంబంధం లేదన్నట్టు వ్యవహరించడం అంటే.. మోసం చేయడం కాదా? అంటున్నారు. మరి దీనికి షర్మిల ఏం చెబుతారో చూడాలి.