Begin typing your search above and press return to search.
కేటీఆర్ చేసిన సాయాన్ని మరిచావా షర్మిల?
By: Tupaki Desk | 17 July 2021 4:34 PM GMTతెలంగాణలో రాజకీయం మొదలుపెట్టిన ఆంధ్రా ఆడకూతురు వైఎస్ షర్మిల జోరు పెంచారు. ఏకంగా తెలంగాణ సీఎం కుమారుడిని పట్టుకొని 'కేటీఆర్ ఎవరు?' అని షాకింగ్ కామెంట్ చేశారు. తెలంగాణలో ఏ మారుమూల అయిన దీనికి సమాధానం చెబుతారు. కానీ తెలియదన్నట్టుగా ప్రశ్నించి ఓ రకంగా అధికార పార్టీతో షర్మిల కయ్యానికి రెడీ అయ్యారు. టీఆర్ఎస్ పార్టీతో 'తగ్గేదిలే' అని స్పష్టం చేశారు.
తాజాగా ఓ టెలివిజన్ చర్చలో పాల్గొన్న టీఆర్ఎస్ అధికార ప్రతినిధి కృష్ణక్ దీనికి గాను షర్మిలకు గట్టి కౌంటర్ ఇచ్చాడు. 'ఏపీ విభజన సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసం.. తెలంగాణను వ్యతిరేకిస్తూ ర్యాలీలు, బహిరంగ సభలు, నిరసనుల చేసిన మహిళ ఈమె. తన సోదరుడు జగన్ తో గొడవ పెట్టుకొని విడిపోయి.. రాబందులా ఇప్పుడు తెలంగాణపై పడింది' అని కృష్ణక్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
'కేటీఆర్ ఎవరు?' అని షర్మిల వాడిన పదాలు ఆమె అహంకారానికి నిదర్శనం అని కృష్ణక్ విరుచుకుపడ్డారు. 'షర్మిలకు వ్యతిరేకంగా నాడు తెలంగానలో చేసిన అశ్లీల పోస్టులను తొలగించాలని ఇదే కేటీఆర్ మంత్రిగా నాడు ఆదేశించాడని.. షర్మిలకు ఈ విషయాన్ని తాము గుర్తు చేయాలనుకుంటున్నామని ' కృష్ణక్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ టీవీ చర్చలో పాల్గొన్న షర్మిల పార్టీ నాయకురాలు ఇందిరా షోబా ఈ వ్యాఖ్యలను ఖండించారు. రాజకీయ విషయాలపై వ్యక్తిగతంగా మాట్లాడకూడని కృష్ణక్ వ్యాఖ్యలకు అభ్యంతరం తెలిపారు.
వాస్తవానికి ఇదే షర్మిల ఉమ్మడి ఏపీని విడదీయవద్దని 'సమైఖ్యాంద్ర కోసం భారీ ఉద్యమాలే చేశారు. గత ఏడు సంవత్సరాలు తెలంగాణ రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. ఇప్పుడు అకస్మాత్తుగా తెలంగాణ రాష్ట్ర సమస్యలను తీసుకోవడంతో ఆమెపై నమ్మకం పోతోంది అని రాజకీయ వర్గాల్లో చర్చసాగుతోంది.