Begin typing your search above and press return to search.

పెద్దపులి మాట గుర్తుండే సోనియా షాకిచ్చారా?

By:  Tupaki Desk   |   12 Nov 2019 4:20 AM GMT
పెద్దపులి మాట గుర్తుండే సోనియా షాకిచ్చారా?
X
రాజకీయాల్లో శాశ్విత శత్రుత్వం.. మిత్రత్వం అన్నది ఉండదని చెబుతారు. సైద్దాంతికంగా తూర్పు.. పడమర గా ఉన్నప్పటికి కొన్ని సందర్భాల్లో కలిసి పోవటం రాజకీయాల్లోనే సాధ్యం. తాజా గా మహా రాష్ట్ర రాజకీయాన్ని చూస్తే.. ఇదే విషయం అర్థం కాక మానదు. చిన్న అవకాశం లభించినా కాంగ్రెస్ మీద విరుచుకు పడే శివసేన.. ఇప్పుడు అదే పార్టీ మద్దతు కోరటం చూస్తే.. అసలు విషయం అర్థమవుతుంది.

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని.. ఆమె కుమార్తె ప్రియాంక వాద్రాను ఉద్దేశించి శివసేన వ్యవస్థాపకులు.. పెద్ద పులి బాల్ ఠాక్రే గతం లో చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు శాపాలుగా మారాయా? అంటే అవునంటున్నారు. సైద్దాంతిక భావ సారూప్యత ఏ మాత్రం లేనప్పటి కి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ తో చేతులు కలిపేందుకు సేన ముందుకు వచ్చినా.. హస్తం అధినేత్రి సోనియా మాత్రం అందుకు నో చెప్పిన వైనం వెనుక గతమే కారణమని అంటున్నారు.

దేశాన్ని భ్రష్టు పట్టించిన క్రూర వలయంలో సోనియా గాంధీ ఒక భాగమని బాల్ ఠాక్రే వ్యాఖ్యానించటంతో పాటు.. వాద్రా కుటుంబాన్ని దేశం నుంచి వెలి వేయాలని మండి పడ్డారు. ఈ మాటలు సోనియా గాంధీ కి ఇప్పటికి గుర్తున్నాయని.. తమను అన్నేసి మాటలు అన్న శివసేనతో జట్టు కట్టటానికి ఆమె ససేమిరా అనటానికి కారణం గా చెబుతున్నారు.

సేన తో జత కట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. సైద్ధాంతికత అన్నది కాంగ్రెస్ లో ఏమీ లేదన్న భావన ప్రజల్లోకి వెళుతుందని.. అదే జరిగితే పార్టీ కి భారీ నష్టం వాటిల్లేలా చేస్తుందని.. అందుకే సేన తో జట్టు కట్టేందుకు నో చెప్పి షాకిచ్చారు. ఈ ఎపిసోడ్ తర్వాతైనా గతం ఎంత లా వెంటాడుతుందనటానికి ఇదో నిదర్శనంగా చెప్పక తప్పదు.