Begin typing your search above and press return to search.
సుష్మ ట్వీట్ - అర్థమేంటో చెప్పండి ప్లీజ్!
By: Tupaki Desk | 23 Dec 2018 12:35 PM GMTసోషల్ మీడియాలో చురుగ్గా ఉంటుంటారు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్. దేశ ప్రజానీకానికి అవసరమైన పలు విషయాలను ట్విటర్ వేదికగా ఆమె పంచుకుంటుంటారు. అప్పుడప్పుడు సరదా వ్యాఖ్యలు కూడా చేస్తుంటారు. నెటిజన్లను నవ్విస్తుంటారు. ట్విటర్ వేదికగా ఎవరైనా సమస్యలు చెప్పుకున్నా సుష్మ వెంటనే స్పందిస్తుంటారు. తగిన విధంగా సాయం చేస్తుంటారు.
తాజాగా శనివారం ఓ ట్వీట్ తో నెటిజన్ల బుర్రలకు పనిచెప్పారు సుష్మాస్వరాజ్. ఆమె చేసిన ట్వీట్ కు అర్థమేంటో తెలియక ఇప్పుడంతా తల పట్టుకుంటున్నారు. ఇంతకీ ఆ ట్వీట్ ఎంటో తెలుసా. అదొక నంబరు. 638721.
ట్వీట్ చేసిన 20 నిమిషాల తర్వాత ఆ నంబరును సుష్మ డిలీట్ చేశారు. ఈలోపు ఈ ట్వీట్‌పై సుష్మాను అనుసరించేవారు, అభిమానులు ఆ నంబర్‌పై కామెంట్ల వర్షం కురిపించారు. ‘వచ్చే ఏడాది జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో మీకంత మెజార్టీ వస్తుందని ఆశిస్తున్నారా?’ అని కొందరంటే.. ‘మేడమ్.. అది మీ ఓటీపీ సంఖ్య కదా!’ అని మరికొందరు వ్యాఖ్యానించారు. ‘సుష్మా మేడమ్..నెటిజన్లకు ఏదో రహస్యం చెప్పాలనుకుంటున్నారు. అందుకే ఈ కోడ్’ అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.
సాధారణంగా క్లౌడ్‌హోపర్ ద్వారా ట్వీట్ చేయాల్సి వచ్చినప్పుడు సంబంధిత సర్వీస్ ప్రొవైడర్ వినియోగదారుల మొబైల్‌కి ఒక ఓటీపీ పంపుతారు. ఆ నంబరును సుష్మా అనుకోకుండా ట్వీట్ చేశారేమోనని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా కేంద్ర మంత్రి తన ట్వీట్ తో నెటిజన్ల బుర్రలకు బాగానే పదును పెట్టారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని సుష్మా స్వరాజ్ ఇప్పటికే ప్రకటించిన సంగతి గమనార్హం.