Begin typing your search above and press return to search.
అమిత్ షాను ఏపీ సీఎం అన్ని డిమాండ్లు అడిగారా?
By: Tupaki Desk | 16 Dec 2020 3:41 AM GMTకేంద్రంలోని మోడీ సర్కారు కాస్త సిత్రమైంది. కేంద్ర ఆర్థికమంత్రి అంటూ ఒకరున్నా.. రాష్ట్రాలకు అవసరమైన నిధులకు సంబంధించిన వ్యవహారాల్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోనే చర్చిస్తుంటారు ముఖ్యమంత్రులు. మొన్నటికి మొన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన మూడు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా షాను కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన నిధుల చిట్టాను అందజేశారు. ఆర్థిక అంశాలు హోంమంత్రితో చర్చించటమా? అన్న ప్రశ్న తలెత్తినా.. దాని గురించి మాట్లాడేవారే కనిపించరు.
ఇదిలా ఉండగా.. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. మంగళవారం రాత్రివేళలో అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీకి రావాల్సిన నిధుల గురించి.. పోలవరం ప్రాజెక్టు కేటాయింపుల గురించి ఆయన విన్నవించుకున్నారు. కేంద్రం నుంచి విడుదల కావాల్సిన బకాయిల గురించి ప్రస్తావించిన ఆయన.. భారీ డిమాండ్లను పెట్టినట్లుగా చెప్పాలి.
పోలవరం ప్రాజెక్టును సవరించిన అంచనాల ప్రకారం రూ.55,650 కోట్లకు ఆమోదం తెలపాలని.. అదే సమయంలో ఇప్పటికే ఆ ప్రాజెక్టు కోసం ఖర్చు చేసిన రూ.1779 కోట్ల పెండింగ్ బకాయిల్ని విడుదల చేయాలని కోరారు. అదే సమయంలో రాష్ట్రానికి రావాల్సిన రూ.4300 కోట్ల జీఎస్టీ బకాయిల్ని వెంటనే ఇవ్వాలని కోరారు.
పద్నాలుగవ ఫైనాన్స్ కమిషన్ సిఫార్సుల ప్రకారం రావాల్సిన రూ.1100 కోట్ల నిధుల్ని కూడా వెంటనే విడుదల చేయాలన్నారు. ఏపీ సర్కారు ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కంప్లైంట్ చేసినట్లుగా వార్తలు వచ్చిన వేళ.. జగన్ చేస్తున్న ఢిల్లీ పర్యటనపై ఆసక్తి వ్యక్తమవుతోంది.
తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ తరహాలోనే అమిత్ షా ముందు పెద్ద ఎత్తున డిమాండ్లను పెట్టారు సీఎం జగన్. మరి.. ఎన్నింటి విషయంలో షా సానుకూలంగా స్పందిస్తారు? కేంద్రం నుంచి ఏ మాత్రం నిధులు ఏపీకి ఇస్తారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
షా ముందు జగన్ ఉంచిన వినతులివే..
- పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల ప్రకారం రూ.55656 కోట్లను ఆమోదించాలి
- పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.1779 కోట్లు రీయింబర్స్ చేయాలి
- ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి. అప్పుడే రాష్ట్రం స్వయం సమృద్ధి సాధిస్తుంది
- సబ్సిడీ బియ్యం పంపిణీకి సంబంధించి కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన రూ.1600 కోట్లు విడుదల చేయాలి.
- రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయిలు రూ.4308.46 కోట్లు రిలీజ్ చేయాలి
- స్థానిక సంస్థలకు అందాల్సిన బకాయిలు రూ.1954.5 కోట్లు రిలీజ్ చేయాలి
- కొత్తగా 16 మెడికల్ కాలేజీలకు అనుమతులు ఇవ్వాలి
- ఏపీ ప్రభుత్వం తెచ్చిన దిశ బిల్లు, ప్రత్యేక కోర్టుల బిల్లులకు ఆమోదించాలి.