Begin typing your search above and press return to search.
ఆ జిల్లాలో సైకిల్‌కు ‘కమ్మ’ని దెబ్బ పడిందా..?
By: Tupaki Desk | 27 May 2021 2:30 PM GMTసాధారణంగా తెలుగుదేశం పార్టీలో కమ్మ సామాజికవర్గం హవా ఎక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే. కమ్మ నేతలే టీడీపీలో ఆధిపత్యం చెలాయిస్తారు. ఇక జిల్లాల వారీగా చూసుకుంటే గుంటూరు జిల్లాలో కమ్మ నేతల డామినేషన్ చాలా ఎక్కువ. ఈ జిల్లాలో ఎక్కువ నియోజకవర్గాల్లో పోటీ చేసేది కమ్మ నేతలే. 2014 ఎన్నికల్లో కమ్మ నాయకులే టీడీపీ తరుపున ఎక్కువ గెలిచారు. పొన్నూరులో ధూళిపాళ్ళ నరేంద్ర, చిలకలూరిపేటలో ప్రత్తిపాటి పుల్లారావు, తెనాలిలో ఆలపాటి రాజా, సత్తెనపల్లిలో కోడెల శివప్రసాద్, వినుకొండలో జివి ఆంజనేయులు, పెదకూరపాడులో కొమ్మాలపాటి శ్రీధర్, గురజాలలో యరపతినేని శ్రీనివాసరావులు గెలిచారు.
ఇక నాడు జిల్లాలో నరసారావుపేట, గుంటూరు ఎంపీలుగా కూడా కమ్మ నేతలే గెలిచారు. గెలిచాక పార్టీలో వీరి ఆధిపత్యం ఎలా ఉందో చెప్పాల్సిన పనిలేదు. అయితే వీరే 2019 ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దీనికితోడు మంగళగిరిలో నారా లోకేష్ పోటీ చేసి ఓడిపోయారు. ఇక చినబాబుతో కలుపుకుంటే గుంటూరులో మొత్తం కమ్మ నాయకులు 8 మంది అయ్యారు. ఇద్దరు ఎంపీలను కూడా కలుపుకుంటే ఒక్క గుంటూరు ఎంపీగా జయదేవ్ మినహా ఏ కమ్మ నేత కూడా విజయం సాధించలేదు.
అటు సత్తెనపల్లిలో కోడెల శివప్రసాద్ చనిపోవడంతో, ఆయన స్థానంలో కోడెల శివరాం వచ్చారు. నరసారావుపేట మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కూడా రాజకీయ సన్యాసం చేశారు. ఆయన వారసుడు కూడా పెద్దగా యాక్టివ్‌గా ఉండడం లేదు. అంటే మొత్తం మీద గుంటూరు జిల్లాలో ఎన్నికల్లో పోటీచేసే కమ్మ నాయకులు 10 మంది ఉన్నారు. ఇక ఇంతమంది కమ్మ నాయకులు ఉన్నా సరే, జిల్లాలో టీడీపీని బలోపేతం చేయలేకపోతున్నారు. పైగా పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోయింది.
కమ్మ నాయకుల సొంత నియోజకవర్గాల్లో కూడా టీడీపీ జెండా ఎగరలేదు. కొందరు అయితే అనవసరంగా పోటీ పెట్టి డబ్బులు వృథా చేసుకోవడం దండగని ముందే అస్త్రసన్యాసం చేసేశారు. దీని బట్టి చూసుకుంటే జగన్ బొమ్మ, కమ్మ నాయకులపై ఎంత ప్రభావం చూపుతుందో అర్ధమవుతుంది. గురజాల, వినుకొండ, చిలకలూరిపేట, పొన్నూరు, ప్రత్తిపాడు, తెనాలి లాంటి చోట్ల కమ్మ నేతలు వైసీపీలోకి వెళ్లిపోతున్నారు. జగన్ బొమ్మ బట్టే జిల్లాలో వైసీపీ హవా నడుస్తోంది. ఎక్కడికక్కడే జగన్ కమ్మగా దెబ్బకొట్టేస్తున్నారు. మరి వచ్చే ఎన్నికల్లోనైనా జగన్ కమ్మని దెబ్బ తట్టుకుని టీడీపీ కమ్మ నాయకులు విజయాలు సాధిస్తారేమో చూడాలి.