Begin typing your search above and press return to search.
బీజేపీ ఇంచార్జులు రేవంత్‌రెడ్డికి ఫోన్ చేశారా?
By: Tupaki Desk | 11 Oct 2022 10:30 AM GMTతెలంగాణ బీజేపీలో ముసలం పుడుతోందా? పార్టీలో కీలక నాయకులు,.. ముఖ్యంగా ఇంచార్జులుగా ఉన్న వారు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారా? వారు పార్టీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్‌పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా? ఈ క్రమంలో తమ దారితాము చూసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఇక్కడ పనిచేసిన.. రాష్ట్రంలో పార్టీ కోసం.. జెండా మోసిన అనేక మంది నాయకులు ఆశలు పెట్టుకున్నారు.
కానీ, వారిని కనీసం పరిగణనలోకి తీసుకోకుండా.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. ఇది ఇప్పటి వరకు పార్టీలో ఉన్న నాయకులకు మంట పుట్టించింది. అదేసమయంలో గతంలో వచ్చిన దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నిక లసమయంలోనూ.. ఇలానేతమకు ఎలాంటి ప్రాధాన్యం లేకుండా చేశారని వారు వాపోతున్నారు. ఈ పరిణామాలతో బీజేపీ ఇరుకున పడుతోంది. వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తీరులో పాయింట్ ఉండడం.. తాము చేస్తున్నది తప్పని తెలిసి.. పార్టీ హైకమాండ్ కూడా ఇబ్బంది పడుతోంది.
ఎందుకంటే.. పార్టీలో ఏ కష్టం వచ్చినా.. పార్టీలో కీలక నేత ఎవరు తెలంగాణ కు వచ్చినా.. బీజేపీ సత్తా చూపించేందుకు నాయకులు జెండాలు పట్టుకుని రెడీ అవుతున్నారు. మేమున్నామంటూ.. పార్టీ తరఫున గట్టి వాయిస్ వినిపిస్తున్నాయి.
ఖర్చు కూడా పెట్టుకుని మరీ సభలు నిర్వహిస్తున్నారు. బండి సంజయ్ పాదయాత్ర చేపట్టినా.. వారు ముందున్నారు. ఇక, ఢిల్లీ నుంచి వచ్చిన పెద్దలు నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభలకు జనాలను సమీకరిస్తున్నారు.
ఈ మొత్తం వ్యవహారాలు సక్సెస్ అయ్యేందుకు చేతి నిండా డబ్బులు ఖర్చు చేస్తున్నారు. అప్పులు చేసిన నాయకులు కూడా ఉన్నారు. అయితే.. తీరా టికెట్లు ఇచ్చే సమయంలోనూ.. పదవులు కట్టబెట్టే సమయంలోనూ వీరికి ప్రాధాన్యం లేకుండా పోతోంది. దీంతో వారు.. తీవ్రంగా వేదనకు గురవుతున్నారు. బండి వ్యవహరిస్తున్నతీరును వారు తప్పుబడుతున్నారు.
ఈ క్రమంలోనే కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ రేవంత్ రెడ్డికి టచ్‌లోకి వెళ్తున్నట్టు తెలుస్తోంది. రేవంత్‌కు ఫోన్లు చేసి.. అవసరం అయితే.. జంప్ చేసస్తామని కూడా వారు చెబుతున్నట్టు సమాచారం. మరి ఈ విషయం ఎంత దూరం వెళ్తుందో చూడాలి. ఇప్పటికైనా.. బండి మేల్కొనకపోతే.. బీజేపీ ఖాళీ కావడం ఖాయమనే వాదన బలంగా వినిపిస్తుండడడం గమనార్హం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.