Begin typing your search above and press return to search.
హుజురాబాద్‌లో కాంగ్రెస్ ముందుగానే ఓటమిని అంగీకరించిందా?
By: Tupaki Desk | 3 Oct 2021 9:30 AM GMTరాజకీయాల్లో పత్యర్థిని ఢీ కొట్టాలంటే అతని బలాన్ని, బలహీనతలను ముందుగా గుర్తించాలి. ఆ తర్వాత బలహీనతలపై దాడి చేసి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలి. అప్పటికీ కూడా విజయావకాశాలను బేరీజు వేసుకోవాలి. విజయానికి ఇదే అనుకూలమైన సమయమని భావిస్తే అప్పుడు మూకుమ్మడి దాడికి దిగాలి. ఇవే మాత్రమే సరిపోవు అన్నింటికంటే ఆత్మ విశ్వాసం అనేది పక్కాగా ఉండాలి. అప్పుడే అనుకున్న విజయాన్ని సొంత చేసుకోవచ్చు. ఒకవేళ ప్రత్యర్థి బలంగా ఉంటే..? ప్రత్యర్థిని ఢీ కొట్టలేని శక్తి లేకుంటే..? అప్పుడు తలపడి ఓడిపోవడం కన్నా రాజీకుదుర్చుకోవడం తెలివైన పని. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎదురుచూస్తున్న హుజురాబాద్ ఉప ఎన్నికలో... కాంగ్రెస్‌లో ఇవేమీ కనిపించట్లేదు. కాంగ్రెస్ నేతలు ముందుగానే ఓటమిని అంగీకరించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
ఎందుకంటే బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ బలమైన అభ్యర్థి... ఆయనకు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది. ఇక టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌కు గతంలో టీఆర్‌ఎస్ అనుబంధ విద్యార్థి సంఘంలో పనిచేసినప్పటికీ అధికార పార్టీ అండదండలున్నాయి. ముగ్గురు మంత్రులు హుజురాబాద్‌లోనే మకాం వేసి.. హామీలు కురిపిస్తున్నారు. ఈ రెండు పార్టీలను ఎదుర్కొవడం కాంగ్రెస్‌కు కష్టమే. అట్లని పోటీలో తలపడకుండా ఉండలేరు. ఇది పరువు సమస్య కూడా.. కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందంటే పలుగు తాడులో కొండను లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. పోతే తాడు పోతుంది. లేకుంటే కొండను ఢీ కొట్టిన ఘనతను సొంతం చేసుకోవచ్చు. ఇలాగే హుజురాబాద్‌లో కాంగ్రెస్ ఆలోచించనట్లు అర్ధమవుతోంది. అందుకు కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ నర్సింగరావు(వెంకట్) పేరును ఏఐసీసీ ప్రకటించింది.
హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్ధి ఎంపికలో పెద్ద హై డ్రామానే నడించింది. ఎందుకంటే ఇప్పటివరకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలువలేదు. హుజూర్‌నగర్, దుబ్బాక, నాగార్జునసాగర్, హుజురాబాద్ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు వచ్చాయి. హుజూర్‌నగర్, నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో రెండో స్థానానికి పరిమితమైంది. దుబ్బాకలో అయితే మూడో స్థానానికి దిగజారింది. ఇప్పుడు హుజురాబాద్ ఉప ఎన్నికలో విజయం సాధించాలని అనుకుంటారు. విజయం సాధించాలని అనుకుంటే సరిపోదు. అభ్యర్థి ఎంపిక చాలా కీలకం. అభ్యర్థి ఎంపిక కోసం...ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా దామోదర రాజనర్సింహను నియమించారు. ఇంత వరకు బాగానే ఉంది. ఇక్కడి నుంచే అసలు కథ మొదలైంది. కులాల సమీకరణలు, అనుకూల అంశాలు, స్థానికత ఇలా అన్నింటిని పరిశీలించిన తర్వాత రాజనర్సింహ ఓ నివేదికను రూపొందారు. ఈ నివేదికపై కాంగ్రెస్ నేతలు చర్చించుకున్నారు. అయితే ఇక్కడే కాంగ్రెస్ నేతల కొన్నివిభేదాలు వచ్చాయనే ప్రచారం కూడా జరిగింది. రాజనర్సింహ నివేదకపై కాంగ్రెస్ పెద్దలు అసంతృప్తి వ్యక్తం చేశారని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. అభ్యర్థి ఎంపిక కోసమే రాజనర్సింహ ఆధ్వర్యంలో కమిటీ వేశారు. ఆ కమిటీ నివేదికను ఆమోదించాలి. అలా కాకుండా కాంగ్రెస్ సీనియర్ నేతలు మరికొన్ని పేర్లను ప్రతిపాదించారు. కొండా సురేఖ, సీతక్క ఇలా చాలా పేర్లు తెరపైకి వచ్చాయి. అనేక తర్జనభర్జన నడుమ బల్మూరి వెంకట్‌ను ఎంపిక చేశారు.
వెంకట్‌ను ఎంపిక విషయంలోనే కాంగ్రెస్ ఓటమిని అంగీకరించిందనే చర్చ జరుగుతోంది. హుజురాబాద్ పోటీలో నిలబడాలంటే కరిష్మా ఉండాలి. బీజేపీ, టీఆర్‌ఎస్ ఈ రెండు బలమైన శక్తులను ఎదుర్కొవడం అంత సులభం కాదు. ఇన్ని తెలిసిన కాంగ్రెస్ నేతలు అభ్యర్థి ఎంపికలోనే పొరపాటు చేశారనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. వెంకట్ పేరు ఇప్పటివరకు అంతగా ప్రాచుర్యంలో లేదు. కాంగ్రెస్ అనుబంధ ప్రజాసంఘాలపై ఎప్పుడు దృష్టిపెట్టలేదు. ఎన్‌ఎస్‌యూఐ పేరుకే తప్ప.. ఆ సంఘానికి బలమైన నిర్మాణాలు లేవు. దానికి సుదీర్ఘమైన కార్యాచరణ కూడా లేదు. విద్యార్థి సంఘాల సమస్యలపై పెద్దగా మాట్లాడిన సందర్భం కూడా లేదు. ఏదో ముక్కుబడి దిష్టిబొమ్మలను దగ్ధం చేయడం తప్పా.. విద్యార్థి సమస్యలపై దృష్టి పెట్టిన దాఖలాలేవనే విమర్శలున్నాయి. ఇన్నీ ప్రతికూల అంశాలునప్పటికీ.. వెంకట్‌ను ఎందుకు బరిలోకి దింపారనే ప్రశ్నలు వస్తున్నాయి.
ప్రస్తుతం హుజురాబాద్‌లో గాయాల కథ నడుస్తోంది. ఈ గాయాల వ్యవహారానికి మంత్రి కొప్పుల ఈశ్వర్ తెర లేపారు. గతంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందరావు చేతికి బ్యాడేజ్ వేసుకుని ప్రచారం చేశారని, బండి సంజయ్ సృహ తప్పిపడిపోయారని, ఈ నెల 12,13వ తేదీల్లో ఈటలకు గాయాలతో స్ట్రెచ్ఛర్‌పై ప్రచారం వస్తారని ఈశ్వర్ జోస్యం చెప్పారు. ఈ వ్యాఖ్యలకు ఈటల కూడా కౌంటరిచ్చారు. అయితే ఇక్కడ టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య గాయాల గొడవ నడుస్తుంటే అనూహ్యంగా కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్ పోలీసుల దాడిలో గాయపడ్డారు. నిన్న కాంగ్రెస్'విద్యార్థి జంగ్ సైరన్'కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, కాంగ్రెస్ నేతల మధ్య ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలోనే హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్, ప్రధాన కార్యదర్శి రేగులపాటి రితేశ్‌రావు, ఓయూ విద్యార్థి నేత కురువ విజయ్‌కుమార్ సొమ్మసిల్లి పడిపోయారు. ప్రస్తుతం వీరంతా నాగోల్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారని చెబుతున్నారు. వెంకట్ ఎప్పుడు కోలుకుంటారో? ఎప్పుడు ప్రచారం మొదలు పెడుతారో? వేచి చూడాలి.