Begin typing your search above and press return to search.
హైదరాబాద్ పోలీసులు అంత సాహసం చేశారా? రాంగ్ రూట్ లో కేటీఆర్ వాహనాన్ని ఆపారా?
By: Tupaki Desk | 2 Oct 2021 5:30 PM GMTతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎంత సుపరిచితమో ఆయన కుమారుడు కమ్ మంత్రి కేటీఆర్ ను అత్యధికులు డిప్యాక్టో సీఎంగా అభివర్ణిస్తారు. అలాంటి కేటీఆర్ కాన్వాయ్ ను అడ్డుకునే సాహసం పోలీసులు చేయగలరా? అన్నది క్వశ్చన్ గా మారింది. ఆయన వాహన శ్రేణి వస్తుందంటే.. మూడు నాలుగు కిలోమీటర్ల ముందే అలెర్టుగా ఉండే పోలీసు సిబ్బంది.. కేటీఆర్ వాహనం రాంగ్ రూట్ లో ప్రయాణిస్తుంటే.. దాన్నిఆపేసే ధైర్యం పోలీసులకు ఉందా? అన్న ప్రశ్న వ్యక్తమవుతోంది. ఇంతకీ ఇదంతా ఎందుకంటే.. గాంధీ జయంతి నేపథ్యంలో రాంగ్ రూట్ లో వెళుతున్న కేటీఆర్ వాహన శ్రేణిని పోలీసులు నిలిపినట్లుగా చెబుతున్నారు.
గాంధీ జయంతి రోజున పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఉండటంతో పలు ప్రాంతాల్లో ఆంక్షల్ని విధించారు. ఇదిలా ఉంటే జాతిపిత గాంధీజీకి బాపూఘాట్ వద్ద నివాళులు అర్పించి తిరిగి వస్తున్న వేళ.. కేటీఆర్ వాహన శ్రేణి రాంగ్ రూట్ లోకి వెళ్లినట్లుగా చెబుతున్నారు. ఈ క్రమంలో అక్కడి స్థానిక పోలీసు ట్రాఫిక్ అధికారి ఒకరు కేటీఆర్ వాహన శ్రేణిని ఆపేసినట్లుగా చెబుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో.. పోస్టులు సోషల్ మీడియాను ముంచెత్తుతున్నాయి.
ఈ సందర్భంగా తెలంగాణ అధికారపక్షమైన టీఆర్ఎస్ నేతలు పలువురు ఈ చర్యను తప్పు పట్టినట్లుగా తెలుస్తోంది. పోలీసు అధికారుల తీరుపై వారు నిరసించారని చెబుతున్నారు. ఈ సందర్భంగా కాసింత ఉద్రికత్త చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. కేటీఆర్ వాహన శ్రేణికి సంబంధించిన వాహనాన్ని రాంగ్ రూట్ లో వెళుతుందన్న కారణంగా నిలిపివేయటం ఓకే అయినా.. అందులో కేటీఆర్ ఉన్నారా? లేరా? అన్న దానిపై క్లారిటీ రావటం లేదు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే కేటీఆర్ సైతం ఈ చర్చకు పుల్ స్టాప్ పడేలా పోస్టు పెట్టకుండా మౌనంగా ఉండిపోవటంతో.. అసలు విషయం ఏమిటో అర్థం కాని పరిస్థితి నెలకొందని మాత్రంచెప్పక తప్పదు. ఈ కన్ఫ్యూజన్ నుంచి కేటీఆర్ కాస్త బయటపడేయకూడదు?