Begin typing your search above and press return to search.
మాణిక్యంతో భేటీ తర్వాత కొండా దంపతులు మనసు మార్చుకున్నారా
By: Tupaki Desk | 13 Dec 2020 1:30 PM GMTరెండు పడవల మీద ప్రయాణం ఏ మాత్రం మంచిది కాదు. అందునా రాజకీయాల్లో ఇదో ప్రమాదకరమైన ఆటగా చెప్పాలి. కాలం కలిసి వచ్చినంత కాలం అంతా బాగున్నట్లుగా అనిపించినా.. చిన్న తేడా వచ్చినా మొదటికే మోసం రావటం ఖాయం. ఆ విషయాన్ని పట్టించుకోకుండా ఇబ్బందిపడిన నేతలు ఎందరో ఉన్నారు. తాజాగా వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో కీలకంగా వ్యవహరిస్తున్న కొండా దంపతులు ఇటీవల కాలంలో తరచూ వార్తల్లోకి వస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంఛార్జి మాణిక్యం ఠాకూర్ తో భేటీ అయిన సందర్భంగా వరంగల్ కార్పొరేషన్ కు జరిగే ఎన్నికల గురించి చర్చకు వచ్చింది. పార్టీలో కీలకభూమిక పోషిస్తే.. టికెట్ల కేటాయింపును వారే చూసుకోవాలని.. వారు చెప్పిన వారికే టికెట్లు ఇస్తామన్న హామీని కూడా మాణిక్యం చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి.
ఇదిలా ఉంటే.. తాజాగా కొత్త వాదన ఒకటి తెర మీదకు వచ్చింది. కొండా దంపతులు బీజేపీ లోకి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. కమలనాథులు చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ లో వారు చిక్కుకున్నట్లుగా చెబుతున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ తన సత్తా చాటటం.. తెలంగాణలో పార్టీ మాంచి ఊపు మీద ఉన్నట్లుగా కనిపిస్తున్న వేళ.. తమ పార్టీలోకి చేరితే వరంగల్ జిల్లా పార్టీ బాధ్యతలు అప్పగించటంతోపాటు.. వారి కుమార్తెకు అసెంబ్లీలో సీటు ఇస్తానని హామీ ఇచ్చారని చెబుతున్నారు.
బీజేపీ ఇచ్చిన ఆఫర్ తో కొండా దంపతులు ఆలోచనలో పడినట్లుగా చెబుతున్నారు. అయితే.. ఇదంతా ఉత్త మైండ్ గేమ్ అని.. బీజేపీ బూచి చూపించి కాంగ్రెస్ లో తమ పట్టును మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా వాదనలు వినిపిస్తున్నాయి. రానున్న స్థానిక ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు మొత్తం కొండా దంపతులకు ఇస్తామని చెప్పిన మీదట.. ఆ హామీని మరింత బలంగా చెప్పించుకునేందుకే బీజేపీ ఎపిసోడ్ ను తెర మీదకు తెచ్చారంటున్నారు. మొత్తంగా వరంగల్ జిల్లా రాజకీయాల్లోకొండా కపుల్స్ ఇప్పుడుహాట్ టాపిక్ గా మారారు. మరి.. వారెలాంటి నిర్ణయం తీసుకుంటారో కాలమే సరిగా చెబుతుందని చెప్పాలి.