Begin typing your search above and press return to search.

జగన్ మాటలతో.. 'దీనమ్మ జీవితం?' అని మంత్రులు అనుకున్నారా?

By:  Tupaki Desk   |   29 April 2022 2:30 AM GMT
జగన్ మాటలతో.. దీనమ్మ జీవితం? అని మంత్రులు అనుకున్నారా?
X
మారే కాలానికి తగ్గట్లుగా కొన్ని పదవులు ఛరిష్మాను కోల్పోతుంటాయి. ఇప్పుడు ఆ జాబితాలో చేరాయి మంత్రి పదవులు. అటు కేంద్రంలోని మోడీ సర్కారులో కావొచ్చు.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని మంత్రుల పరిస్థితిని చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమైపోతుంది.

బలమైన ప్రజానేత ప్రధానిగా.. రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా ఉన్నంత మాత్రాన మంత్రుల స్థాయి తగ్గిపోవాల్సిన అవసరం లేదు. కానీ.. అధినేతల అహంకారం ఇలాంటి పరిస్థితికి కారణమని చెప్పాలి. అంతా తాము చూసుకుంటామని.. తమకు మించిన తోపులు ఎవరూ లేరన్న భావనే ఇలాంటి పరిస్థితికి కారణంగా చెప్పొచ్చు.

రాజకీయం మొత్తం తమ చుట్టూనే తిరిగి.. ప్రజలు ఓట్లు వేసేది నన్ను చూసే అన్న భావన పీక్స్ కు చేరినప్పుడే.. అధినేతల తీరు.. మాట తీరు మారిపోతుందని చెప్పాలి. తాజాగా మంత్రులు.. ప్రాంతీయ సమన్వయకర్తలు.. జిల్లా అధ్యక్షులతో భేటీ నిర్వహించిన సీఎం జగన్మోహన్ రెడ్డి.. పలు సందర్భాల్లో మంత్రుల ఇమేజ్ ను దారుణంగా డ్యామేజ్ చేశారన్న మాట వినిపిస్తోంది.

ఎంత చెడ్డా మంత్రి అయినప్పుడు.. ఆ పదవికి ఉండే ఛరిష్మా వేరుగా ఉంటుంది. అయితే.. సీఎం జగన్ మాత్రం.. అలాంటి కాన్ఫిడెన్సు మంత్రుల్లో మాయమయ్యేలా మాట్లాడారని చెబుతున్నారు. తాజాగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రుల ముందే వారి గాలి తీసేసిన క్రెడిట్ సీఎం జగన్ కు చెల్లుతుంది.

''మంత్రులంతా ఒక్క విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. జిల్లా అధ్యక్షులు.. ప్రాంతీయ సమన్వయకర్తల తర్వాతే మంత్రుల స్థానం. మంత్రుల కంటే వీళ్లే ఎక్కువ. ఆ విషయాన్ని మంత్రులు మనసులోకి ఎక్కించుకోవాలి. పార్టీయే సుప్రీం. దీనిని అందరూ గుర్తుంచుకోవాలి'' అంటూ జగన్ చేసిన వ్యాఖ్యల్ని విన్న తర్వాత.. ఉప్పు కారం తినని మంత్రి సైతం.. 'దీనమ్మ జీవితం' అన్న మాట అనుకోకుండా ఉండలేరన్న మాట కొందరు కీలక నేతల నోటి నుంచి వినపడటం గమనార్హం.

అయినా మంత్రుల ఇగోను ఇంతలా దెబ్బ తీసి.. ప్రాంతీయ సమన్వయకర్తలు.. జిల్లా అధ్యక్షుల ఇగోను సంతృప్తి పరిచేలా ఉన్నజగన్ వ్యాఖ్యలు ఇప్పుడు షాకింగ్ గా ఉన్నాయని చెప్పక తప్పదు.