Begin typing your search above and press return to search.

ఆ ఎమ్మెల్యేకు నోటి దురుసే.. శాపంగా మారిందా..?

By:  Tupaki Desk   |   15 Feb 2022 4:30 AM GMT
ఆ ఎమ్మెల్యేకు నోటి దురుసే.. శాపంగా మారిందా..?
X
సీఎం జ‌గ‌న్ ద‌గ్గ‌ర ఆయ‌న‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. పైగా ఆయ‌న సీఎం జ‌గ‌న్ సొంత మీడియాలో భాగ‌స్వామి కూడా. అంతేకాదు.. పార్టీలోనూ.. రాష్ట్ర కార్య‌ద‌ర్శిగా అవ‌కాశం ఇచ్చారు. ఆయ‌నే కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి. 2009 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ త‌ర‌ఫున తొలిసారి ఇక్క‌డ గెలిచిన ఆయ‌న త‌ర్వాత‌..వైసీపీ బాట‌ప‌ట్టారు.. 2014లో టికెట్ ఇచ్చినా.. గెలుపుగుర్రం ఎక్క‌లేక పోయారు.

గ‌త ఎన్నిక‌ల్లో మ‌రోసారి టికెట్ ద‌క్కించుకుని..విజ‌యంసాధించారు. పార్టీలోనూ మంచి పేరు కూడా ఉంది. ఆయ‌న తండ్రికి ఇటీవ‌ల‌.. పౌర‌స‌ర‌ఫ‌రాల కార్పొరేష‌న్ చైర్మ‌న్ ప‌ద‌విని కూడా అప్ప‌గించారు..

ఇంత‌గా.. సీఎం జ‌గ‌న్ ద‌గ్గ‌ర మంచి మార్కులు ఉన్న‌ప్ప‌టికీ... ఇప్పుడు ఆయ‌న పేరు ఎక్క‌డా.. మంత్రి వ‌ర్గంలో క‌నిపించ‌డం లేదు. పైగా..ఆయ‌న గురించిఎవ‌రూ.. ఊసు కూడా ఎత్తడం లేదు. నిజానికి వారికి మంత్రి ప‌ద‌వి వ‌స్తుంది.. వీరికి వ‌స్తుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతున్నా.. ద్వారంపూడి పేరు మాత్రం ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. రెడ్డి సామాజిక‌వ‌ర్గానికి చెందిన‌ప్ప‌టికీ.. ఆయ‌న‌కు కొన్నాళ్ల కింద‌టి వ‌ర‌కు.. అవ‌కాశం ఉంద‌నే ప్ర‌చారం జ‌రిగింది. కానీ, త‌ర్వాత‌.. ఆయ‌న నోటి దురుసుగా వ్య‌వ‌హ‌రించ‌డంతో.. పార్టీలోనూ.. రాజ‌కీయంగాను కూడా వివాదాస్ప‌దం అయ్యారు.

ముఖ్యంగా చంద్ర‌బాబుపైనా.. ఆయ‌న కుటుంబంపైనా.. ఆయ‌న వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారని టీడీపీ నేత‌లు తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇదే ఆయ‌న‌కు ప్ర‌తిబంధకంగా కూడా మారింది. ఈ నేప‌థ్య‌లో ఆయ‌న‌ను ప‌ట్టించుకునే వారు క‌నిపించ‌డం లేదు. కేడ‌ర్ కూడా ఆయ‌న‌కు దూరంగా ఉంద‌నే వాద‌న వినిపిస్తోంది. కాకినాడ పోర్టు నుంచి జ‌రిగిన‌.. ఎగుమ‌తుల‌పైనా.. తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ర‌గ‌డే చోటు చేసుకుంది.

అంతేకాదు.. ఒక కీల‌క మంత్రికి ఎగ‌స్పార్టీ గా మారి..ఆయ‌న‌పైనే విమ‌ర్శ‌లు చేయ‌డం.. ప్రొటోకాల్‌ను ప‌ట్టించుకోకుండా..మంత్రికి సెగ పెట్టేలా వ్య‌వ‌హ‌రించ‌డం వంటివి కూడా ఆయ‌న‌కు ఇబ్బందిగా ప‌రిణ‌మించాయ‌ని అంటున్నారు.

మ‌రీ ముఖ్యంగా.. నోటికి ఎంత మాట ప‌డితే.. అంత‌మాట అన‌డం... రెచ్చిపోయి విమ‌ర్శ‌లు చేయ‌డం వంటివి నాయ‌కుడిగా ఆయ‌న‌పైనా.. విమ‌ర్శ‌లు వ‌చ్చేలా.. వ్య‌క్తిగ‌త ప్ర‌తిష్ట కూడా దెబ్బ‌తినేలా చేశాయ‌ని అంటున్నారు. మొత్తంగా చూస్తే.. ఆయ‌న నోటి దురుసే ఆయ‌న‌కు శాపంగా మారింద‌ని.. లేక‌పోతే.. కీల‌క‌మైన అనేక ప‌దువుల్లో ఒక్క‌టైనా ఆయ‌న‌కు ద‌క్కి ఉండేద‌ని అంటున్నారు. దీనికి తోడు తూర్పు గోదావ‌రి జిల్లాలో సామాజిక స‌మీక‌ర‌ణ‌లు కూడా ఆయ‌న ప‌ద‌వులు, ప్ర‌మోష‌న్ల‌కు అడ్డంకిగా మారుతున్నాయి.