Begin typing your search above and press return to search.
టీడీపీ బంద్ కు పోలీసులు షాకిచ్చారుగా?
By: Tupaki Desk | 20 Oct 2021 6:30 AM GMTతెలుగుదేశం పార్టీ నేత పట్టాభి పెట్టిన ప్రెస్ మీట్ భారీ పంచాయితీగా మారటం.. ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ వర్గాలు ఏపీలోని పలు ప్రాంతాల్లో టీడీపీ కార్యాలయాల మీదా..టీడీపీ నేతల ఇళ్ల మీద దాడులకు పాల్పడటం తెలిసిందే. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పార్టీ అధినేత చంద్రబాబు.. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నకు పిలుపునిచ్చారు. టీడీపీ ఆఫీసులు.. నేతల ఇళ్ల మీద జరిగిన దాడులు ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడులని.. వీటిని ఖండిస్తూ ప్రజలంతా బంద్ ను పాటించాలని పిలుపునిచ్చారు.
సార్వత్రిక ఎన్నికలు అయ్యాక.. ఘోర పరాజయంతో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న టీడీపీ.. బంద్ లను పెద్దగా ప్రకటించింది లేదు. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు పార్టీ ఆస్తిత్వానికి ప్రశ్నార్థకంగా మారటంతో బంద్ కు పిలుపునిచ్చింది. బంద్ అన్నంతనే షాపులు మూసేయటం.. విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వటం.. బస్సులు తిరగటం ఆగిపోవటం లాంటివి జరగాలి. కానీ.. ఏపీలో అలాంటి పరిస్థితి లేదంటున్నారు.
టీడీపీ ఇచ్చిన బంద్ ను అడ్డుకునే విషయంలో ఏపీ పోలీసులు పక్కాగా ఉన్నారని.. ఒక్క నేత కూడా బయటకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇవ్వటానికి వీల్లేని రీతిలో.. వారిని ఇంట్లో నుంచి బయటకు రానివ్వటం లేదని.. కొందరు నేతల్ని ముందస్తు జాగ్రత్తగా అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. దీంతో.. బయటకువచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొని ఉందంటున్నారు. అయితే.. ఇదంతా శాంతిభద్రతల్ని కాపాడటానికేనని పోలీసు వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
టీడీపీ కార్యాలయాల మీద దాడులు జరుగుతున్న సమాచారాన్ని తెలుసుకొని స్పందించేసరికి.. చాలాచోట్ల దాడులు జరిగిపోయాయి. అయితే.. అదనపు బలగాల్ని తీసుకొచ్చి.. తదనంతర పరిస్థితులకు తావివ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నారని చెబుతున్నారు. ఏపీ డీజీపీ ఆఫీసుకు కేవలం వంద మీటర్ల దూరంలో ఉన్న టీడీపీ ప్రధాన కార్యాలయం మీద దాడి జరుగుతుంటే.. అడ్డుకునే విషయంలోపోలీసులు ఫెయిల్ అయ్యారన్నవిమర్శ పెద్ద ఎత్తున వినిపిస్తోంది.
ఇలాంటివేళలో విపక్షం ఇచ్చిన బంద్ ఎలాంటి ఉద్రిక్తతలకు దారి తీయకుండా ఉండేందుకు.. పక్కా వ్యూహంతో వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు. టీడీపీ నేతలు బంద్ పేరుతో బయటకు వచ్చి ఆందోళన చేపట్టి.. కవ్వింపు చర్యలకు పాల్పడితే శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని.. అందుకే..వారిని బయటకు రానివ్వకుండా అడ్డుకోవటం ద్వారా బంద్ కు చెక్ చెబుతున్నట్లు చెబుతున్నారు.
బంద్ పేరుతో టీడీపీ వర్గాలు ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేయాలన్న యోచనలో ఉన్నట్లుగా నిఘా వర్గాలకుసమాచారం అందినట్లు చెబుతున్నారు. అదే జరిగితే పరిస్థితి మరింత దిగజారుతుందని.. అందుకే కఠినంగా వ్యవహరించేందుకు పోలీసులు డిసైడ్అయినట్లుగా తెలుస్తోంది. అయితే.. పోలీసులు అనుసరిస్తున్న వైఖరిపై టీడీపీ వర్గాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా బంద్ కు పిలుపునిచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు అంచనాలకు భిన్నమైన పరిస్థితులు ఉన్నట్లుగా చెప్పక తప్పదు.