Begin typing your search above and press return to search.
ప్రధాని కార్యాలయమే ఎంపీకి షాకిచ్చిందా?
By: Tupaki Desk | 4 July 2022 5:17 AM GMTవైసీపీ నరసాపురం తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు యూ టర్న్ తీసుకున్నారు. అల్లూరి సీతారామరాజు జయంతోత్సవంలో పాల్గొనేందుకు నరేంద్ర మోడీ భీమవరం వచ్చిన సందర్భంలో తాను కూడా ఉండాలని ఎంపీ అనుకున్నారు. అయితే కార్యక్రమం కోసం బయలుదేరిన ఎంపీ మధ్యలోనే రైలుదిగి తిరిగి హైదరాబాద్ చేరుకుని అక్కడి నుండి ఢిల్లీ వెళ్లిపోయినట్లు సమాచారం.
ఇంతకీ విషయం ఏమిటంటే మోడి కార్యక్రమంలో తాను పాల్గొంటానని, తనను ఎవరు ఆపలేరంటు పదే పదే ఛాలెంజులు చేశారు. లేని సమస్యను ఉన్నట్లు బూతద్దంలో చూపించారు. కార్యక్రమానికి హాజరుకానీకుండా తనను జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటున్నారంటు కోర్టులో కేసులు కూడా వేశారు. అయితే ఎంపీ వేసిన కేసులను కోర్టు కొట్టేసింది. ఒకవైపు కోర్టులో కేసులు వేసిన ఎంపీ మరోవైపు జగన్ పై నోటికొచ్చినట్లు మాట్లాడారు. ఏదేమైనా తాను హాజరయ్యేది హాజరయ్యేదే దమ్ముంటే అడ్డుకోమంటు సవాళ్ళు విసిరారు.
తీరా చూస్తే కార్యక్రమానికి హాజరు కాకుండానే వెనక్కు తిరిగి వెళ్ళిపోయారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన ఎంపీ అక్కడి నుండి భీమవరంకు రైలులో బయలుదేరారు. అయితే మధ్యలోనే ఆయనకు ఫోన్ వచ్చింది.
దాని సారాంశం ఏమిటంటే తన మద్దతుదారులపై పోలీసులు కేసులు పెట్టారని. దాంతో మనస్తాపం చెందిన ఎంపీ రైలు దిగి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయారట. ఎంపీ మద్దతుదారులపై పోలీసులు కేసులు పెట్టారో లేదో తెలీదుకానీ మోడీ కార్యక్రమంలో పాల్గొనే ప్రముఖుల జాబితాలో ఎంపీ పేరేలేదట.
ప్రధాని కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొంటారనే విషయాన్ని ప్రధానమంత్రి కార్యాలయమే నిర్ధారిస్తుంది. ఆ జాబితాలో ఎంపీ పేరులేదని ఏలూరు రేంజి డీఐజీ పాల రాజు చెప్పారు. జాబితాలో పేరులేనపుడు ఎంపీని కార్యక్రమంలో పాల్గొనేందుకు అనుమతించరు.
ఈ విషయం ఎంపీకి బాగా తెలుసు. దాంతో భీమవరం వెళ్ళినా లాభంలేదని అర్ధమైపోయి చేసేదిలేక చివరకు వెనక్కు వెళ్ళిపోయారు. అయినా ప్రధాని పాల్గొనే కార్యక్రమంలో లోకల్ ఎంపీ పేరు లేకపోవటం ఆశ్చర్యంగానే ఉంది. మరీ విషయాన్ని ఎంపీ ఎందుకని చెక్ చేసుకోలేదో అర్ధం కావటం లేదు.