Begin typing your search above and press return to search.

నాన్ ఎన్డీయేలో చీలిక మొదలైందా ?

By:  Tupaki Desk   |   23 Jun 2022 7:30 AM GMT
నాన్ ఎన్డీయేలో చీలిక మొదలైందా ?
X
రాష్ట్రపతి అభ్యర్థికి ఓట్లేసే విషయంలో నాన్ ఎన్డీయే పార్టీల్లో చీలిక మొదలైందా ? తాజాగా జరిగిన ఒక పరిణామాన్ని గమనిస్తే ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. నాన్ ఎన్డీయే పార్టీల ఉమ్మడి అభ్యర్ధిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా ఎంపికై నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. అలాగే ఎన్డీయే తరపున జార్ఖండ్ గవర్నర్ గా పనిచేసిన ద్రౌపది ముర్ము ఎంపికయ్యారు.

ఈమె కూడా శుక్రవారం తన నామినేషన్ వేయబోతున్నారు. బీజూ జనతా దళ్ అధినేత, ఒడిస్సీ సీఎం నవీన్ పట్నాయక్ ఎన్డీయే అభ్యర్ధికి తమ మద్దతు ప్రకటించడం తో గెలుపు లాంఛనమైపోయింది.

రెండు వైపుల బలాబలాలను భేరీజు వేస్తే ద్రౌపది గెలుపు దాదాపు ఖాయమని అర్ధమైపోతోంది. ఎక్కువ కష్టపడకుండానే ముర్ము గెలుస్తారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే నాన్ ఎన్డీయే తరపున పోటీచేస్తున్న యశ్వంత్ సిన్హాకు రావాల్సిన ఓట్లన్నీ పడతాయా అన్నదే సందేహం. ఎందుకంటే ద్రౌపదిని అభినందిస్తు మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవెగౌడ మాట్లాడారు. రాష్ట్రపతి పదవికి ద్రౌపది అన్నీ విధాలుగా అర్హురాలే అంటు కితాబిచ్చారు.

జార్ఖండ్ గవర్నర్ గా పనిచేసిన కాలంలో కూడా ముర్ముపై ఎవరు ఎలాంటి ఆరోపణలు, విమర్శలు చేయకపోవటమే ఆమె పనితీరుకు నిదర్శనంగా దేవేగౌడ చెప్పారు. ఒకవైపు రాష్ట్రపతిగా యశ్వంత్ తమ కూటమి తరపున పోటీ చేయబోతుంటే ప్రత్యర్ధి అభ్యర్ధిని దేవేగౌడ్ అభినందించారంటే అర్ధమేంటి ? ఇదే సమయంలో జేడీఎస్ పార్టీ ఎవరికి ఓట్లేస్తుందని అడిగిన ప్రశ్నకు దేవేగౌడ సమాధానం చెప్పటానికి ఇష్టపడలేదు.

దీంతో యశ్వంతకు పడే ఓట్ల విషయంలో అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎలక్టోరల్ కాలేజీలో యూపీయే కూటమికి 24 శాతం ఓట్లున్నాయి. అలాగే నాన్ యూపీఏ పార్టీల బలం సుమారుగా 12 శాతం ఓట్లున్నాయి.

ఇందులో జేడీఎస్ ఓట్లు 0.55 శాతం కూడా కలిసుంది. మరి జేడీఎస్ ఓట్లు యశ్వంత్ కు పడతాయని కూడా కచ్చితంగా దేవేగౌడ్ చెప్పకపోవటంతోనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ద్రౌపది విషయంలో ఇపుడు దేవేగౌడ బయటపడ్డారు. మరి మిగిలిన పార్టీల అధినేతల మనసులో ఎలాంటి అభిప్రాయముందో తెలీదు. చూస్తుంటే తమ కూటమి ఓట్లు కూడా యశ్వంత్ పడేది అనుమానంగానే ఉంది.