Begin typing your search above and press return to search.

ద‌ళితులు గెలిచారా? బాధితుల‌కు న్యాయం ద‌క్కిందా?

By:  Tupaki Desk   |   23 May 2022 9:53 AM GMT
ద‌ళితులు గెలిచారా? బాధితుల‌కు న్యాయం ద‌క్కిందా?
X
ఎమ్మెల్సీ అనంత బాబు అరెస్టు అయితే (ఇంకా క‌న్ఫం కాలేదు) ద‌ళితులు గెలిచార‌ని భావించ‌వ‌చ్చా? లేదా బాధితుల‌కు ప్రాణ హాని త‌ప్పింద‌ని భావింప‌వ‌చ్చా? ఇంత‌వ‌రకూ ద‌ళిత సంఘాలు అయితే ఆందోళ‌న‌లు చేస్తూనే ఉన్నాయి.

డ్రైవ‌ర్ సుబ్ర‌హ్మ‌ణ్యం హ‌త్య‌కు సంబంధించి పోలీసు చ‌ర్య ఏదీ నిర్థార‌ణ‌లో లేదు.ప కానీ మేరుగ నాగార్జున లాంటి మంత్రులు మాత్రం సుబ్ర‌హ్మ‌ణ్యంది హ‌త్యే అని తేల్చారు. కేసుకు సంబంధించి పోస్టు మార్టం రిపోర్టు ఆల‌స్యంగా అందినందువ‌ల్లే తాము త‌దుప‌రి చ‌ర్య‌లు తీసుకోలేక‌పోతున్నామ‌ని పోలీసులు చెబుతున్నా అవేవీ న‌మ్మ‌కంగా లేవ‌ని ద‌ళిత సంఘాలు అంటున్నాయి. అంటే ఇప్ప‌టికిప్పుడు ఆయ‌న అరెస్టును చూపిస్తారో లేదో అన్న సంశ‌యం ఒక‌టి కొన‌సాగుతోంది.

మ‌రోవైపు శ‌నివారం రాత్రే అరెస్టు చేస్తాం అన్న పోలీసులు ఎందుకు చ‌ర్య‌లు తీసుకోలేక‌పోయారు అన్న వాద‌న కూడా వినిపిస్తోంది. ఇక ఆయ‌న అరెస్టు అయినా బాధితురాలి ప్రాణాల‌కు ర‌క్ష‌ణ ఉంటుందా అన్న వాద‌న కూడా వినిపిస్తోంది.

మ‌రోవైపు అనంత‌బాబు అరెస్టుపై పోలీసులు త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌లు పడుతున్నార‌న్న వార్త‌లు వ స్తున్నాయి. ఏలూరు రేంజ్ డీఐజీ ఘ‌ట‌న‌పై స‌మీక్ష నిర్వ‌హించార‌ని మాత్రం ప్ర‌ధాన మీడియా ద్వారా తెలుస్తోంది. ఇక గ‌తంలోనూ నేర ప్ర‌వృత్తి ఉన్న వ్య‌క్తిగా అనంత‌బాబు పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. మ‌రి! ఆ రోజు క‌ట్ట‌డి చేయ‌లేని పోలీసులు, ఇప్పుడెలా ఆయ‌న‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటార‌ని? అస‌లు ఎఫ్ఐఆర్ లో ఏయే చ‌ట్టాలు, ఏయే సెక్ష‌న్లు అన్న‌వి న‌మోదితం అయి ఉంటాయి అని ? ఇవే ఇప్పుడు వేధిస్తున్న ప్ర‌శ్న‌లు.

మ‌రోవైపు తెలుగుదేశం పార్టీ నాయ‌కుల‌ను మాత్రం వైసీపీ స‌ర్కారు ఎక్క‌డిక‌క్క‌డ నిర్బంధిస్తోంది. నిన్న‌టి వేళ కూడా తూర్పుగోదావ‌రి జిల్లాలో నిర్బంధ కాండ న‌మోదితం అయింది. మరోవైపు ద‌ళిత సంఘాల ఒత్తిళ్ల‌కు లొంగితే అధికార పార్టీ ప‌రువు మ‌రింత పోతుంద‌న్న అభిప్రాయం ఒక‌టి వైసీపీలో వినిపిస్తోంది.

పోనీ అరెస్టు చూపి త‌రువాత బెయిల్ ఇప్పిద్దామా అన్న ఆలోచ‌న కూడా కొంద‌రు చేస్తున్నారు. ఈ విధంగా ఆలోచిస్తున్న వారంతా అనంత‌బాబు వ‌ర్గీయులే ! మంత్రి బొత్స‌కు కూడా ఇది ఒక త‌ల‌నొప్పే ! ఆయన కులానికే చెందిన నేత క‌నుక ఏం చేస్తారా ? అరెస్టు చూపిస్తారా లేదా అన్న సంశ‌యం ఒక‌టి వెన్నాడుతోంది.