Begin typing your search above and press return to search.
వివేకా కేసు క్లైమ్యాక్స్ కి వచ్చేసినట్లేనా ?
By: Tupaki Desk | 23 Dec 2021 3:27 AM GMTక్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదే అనిపిస్తోంది. 2019 మార్చి 15వ తేదీన తనింట్లోనే వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురైన విషయం అందరికీ తెలిసిందే. హత్య జరిగినప్పటి నుండి ఈ కేసు దర్యాప్తు అనేక మలుపులు తిరుగుతోంది.
చంద్రబాబునాయుడు అధికారంలో ఉండగా జరిగిన హత్యపై దర్యాప్తు కోసం ముందుగా సిట్ వేశారు. దాదాపు ఎనిమిది నెలల దర్వాప్తు తర్వాత సిట్ అధికారులు చేతులెత్తేశారు. ఒకవైపు సిట్ దర్యాప్తు జరుగుతున్నపుడే జగన్మోహన్ రెడ్డి సిబీఐ విచారణ కోరుతు హైకోర్టులో పిటీషన్ వేశారు.
తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ చిత్తుగా ఓడిపోయింది. ఆ తర్వాత విచారణ ఎంతకీ ముందుకు సాగకపోయేసరికి వివేకా కూతురు డాక్టర్ సునీత కూడా సీబీఐ ఎంక్వైరీ కోరుతు కోర్టులో పిటీషన్ వేశారు.
హైకోర్టు ఆదేశాలతో సీబీఐ రంగంలోకి దిగింది. సిట్ అయినా ఇపుడు సీబీఐ అయినా దాదాపు 1400 మందిని విచారించింది. చివరకు వివేకా ఇంటి వాచ్ మెన్ ఇచ్చిన సాక్ష్యంతో డ్రైవర్ గా పనిచేసిన దస్తగిరి, సన్నిహితుడు ఎర్రగంగిరెడ్డి, సునీల్ కుమార్ యాదవ్, శివశంకరరెడ్డి లాంటి వాళ్ళను సీబీఐ అరెస్టులు చేసింది.
చివరకు దస్తగిరి అప్రూవర్ గా మారిపోయి హత్య నేపధ్యాన్ని పూర్తిగా సీబీఐకి వివరించారట. దాంతో అరెస్టుచేసిన వారందరినీ మళ్ళీ కస్టడీలోకి తీసుకుని విచారించింది. ఈ మొత్తం ఎపిసోడ్ లో శివశంకరెడ్డి పాత్ర చాలా కీలకమని దస్తగిరి పదే పదే చెబుతున్నాడు. అందుకనే శివశంకరెడ్డతో నిజాలు చెప్పించేందుకు నార్కో పరీక్షలు చేయించాలని సీబీఐ డిసైడ్ అయ్యిందట. నార్కో పరీక్షలు జరగాలంటే కోర్టు అనుమతి అవసరం.
అందుకనే అనుమతి కోరుతు కోర్టుకి దరఖాస్తు పెట్టుకుందట. ఒకవేళ కోర్టు గనుక సీబీఐకి అనుమతిస్తే వెంటనే శివశంకరరెడ్డి మీద నార్కో పరీక్ష జరిపేందుకు సీబీఐ రెడీగా ఉంది. ఒకసారి నార్కో పరీక్ష జరిపితే నిజాలు వాటంతట అవే బయటకు వచ్చేస్తాయని సీబీఐ అనుకుంటోంది.
ఇదే సమయంలో కోర్టు అనుమతించకపోతే ? అప్పుడేమవుతుంది ? ఏమవుతుంది రెడ్డొచ్చె మొదలెట్టె అన్న పద్దతిలో మళ్ళీ మొదటినుండి సీబీఐ విచారణ మొదలవుతుంది. కాకపోతే హై ప్రొఫైల్ కేసు కాబట్టే నార్కో పరీక్షకు కోర్టు అనుమతిస్తుందని అనుకుంటున్నారు. చూడాలి ఏమవుతుందో.