Begin typing your search above and press return to search.
ప్రతీకారం కోసం భార్యనే కాల్ గర్ల్ చేశాడు?
By: Tupaki Desk | 7 Oct 2019 8:39 AM GMTచెడపకురా చెడేవు అంటారు పెద్దలు.. తన పై ఉద్యోగి తనను టార్గెట్ చేశాడని.. అధిక పని ఇస్తూ ఇబ్బంది పెడుతున్నాడని పగ పెంచుకున్న ఓ ప్రబుద్ధుడు అతడి పరువు తీయాలని ఏకంగా భార్యనే ఎరవేసిన సంఘటన విస్తుగొలుపుతోంది.
హైదరాబాద్ లోని దమ్మాయిగూడ ప్రాంతానికి చెందిన జాన్ జార్జి ఈసీఐఎల్ రాధిక మల్టీప్లెక్స్ లో ప్రొజెక్టర్ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. అతడి భార్య ఓ ప్రముఖ ఎలక్ట్రిక్ సామగ్రి విక్రయ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. అయితే భార్య పనిచేసే సంస్థలో ఆమె పై ఉద్యోగి, టీం లీడర్ తరచూ టార్గెట్లు విధిస్తూ ముప్పు తిప్పలు పెడుతున్నాడట. దీంతో తన భార్త అయిన జాన్ జార్జికి విషయం చెప్పి ఆ భార్య బోరుమంది. టీం లీడర్ టార్చర్ భరించలేక ఉద్యోగం మానేస్తానని భర్తను వేడుకుంది.
తన భార్యనే టార్చర్ చేస్తున్న టీం లీడర్ పరువు తీయాలని జాన్ జార్జి పగ పెంచుకున్నాడు. దీంతో షేర్ చాట్ లో ఆ టీం లీడర్ ఉన్న గ్రూపు ఫొటో పెట్టి కాల్ గర్ల్స్ అంటూ టీం లీడర్ ఫోన్ నంబర్ లో అందులో పేర్కొన్నాడు. అయితే ఆ కాల్ గర్ల్స్ లో జాన్ జార్జి భార్య కూడా ఉండడం గమనార్హం.
ఇది చూసిన టీం లీడర్ తో మిగతా ఫొటోలో ఉన్న మహిళలు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేసిన పోలీసులు ఐపీ అడ్రస్ ఆధారంగా జాన్ జార్జి చేశాడని తెలుసుకొని అరెస్ట్ చేశారు. పోస్టింగ్ పెట్టింది తానేనని జాన్ ఒప్పుకున్నాడు. టీం లీడర్ పరువు తీయాలనే తన భార్య ఫొటో ఉన్న విషయాన్ని కూడా చూడకుండా కాల్ గర్ల్స్ అంటూ సోషల్ మీడియాలో పెట్టేసిన వ్యవహారం ఇప్పుడు వైరల్ గా మారింది.