Begin typing your search above and press return to search.
ముప్పతిప్పలు పెడుతున్న ఆ పులి దొరికేనా?
By: Tupaki Desk | 13 July 2022 3:31 AM GMTఆంధ్రప్రదేశ్ లో కాకినాడ, అనకాపల్లి, తూర్పుగోదావరి జిల్లా వాసులను ఓ పెద్ద పులి ముప్పతిప్పలు పెడుతోంది. దాదాపు రెండు వారాల క్రితం నుంచి ఓ పెద్ద పులి ఈ జిల్లాల సరిహద్దుల్లో సంచరిస్తోంది. పశువులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. ఈ పులి దెబ్బకు గేదెలు, ఆవులు ఆహారమైపోతున్నాయి. అటవీ శాఖ అధికారులు, స్థానిక పోలీసులు పులి పాద ముద్రల ఆధారంగా దాని జాడలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నా ఇంతవరకు అది చిక్కలేదు. కెమెరాలు అమర్చి పులి జాడలను అన్వేషిస్తున్నారు.
అధికారులు ఆ పులిని పట్టుకోవడానికి వేట సాగిస్తుంటే.. దాని వేట అది సాగిస్తోంది. పశువులు బలై పోతున్నాయి. ఇప్పటివరకు మనుషుల మీద దాడులు చేసిన దాఖలాలు లేవు. అయితే ఆయా గ్రామాల్లో ప్రజలు బిక్కుబిక్కుమని గడుపుతున్నారు. పొలాలకు వెళ్లి పనులు చేసుకోవడానికి, అటవీ ప్రాంతాలకు పశువులను తోలుకెళ్లడానికి వణికిపోతున్నారు. ఈ ముప్పతిప్పలు పెడుతున్న పులిని పట్టుకోవడానికి అధికారులు ఇతర రాష్ట్రాల నుంచి నిపుణులను కూడా రప్పించారు.
కొద్ది రోజుల క్రితం అది తాండవ నదిని దాటి ఒడిశాలోకి ప్రవేశించిందని అధికారులు చెప్పారు. ఇక అది ఏపీలోకి రాదన్నారు. అయితే అనూహ్యంగా మళ్లీ పులి అనకాపల్లి జిల్లాలో దర్శనమిచ్చింది. ఒక గేదెను సగం తిని వదిలిపెట్టింది. మిగిలిన సగం కోసం మళ్లీ వస్తుందని భావించిన అధికారులు కెమెరాలు పెట్టారు. ఈ కెమెరాల్లో పులి స్పష్టంగా రికార్డైంది.
కాకినాడ జిల్లా పత్తిపాడు పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్న పులిని పట్టుకునేందుకు అధికారులు బోనులు ఏర్పాటు చేశారు. వాటిని పసిగట్టిన పులి.. అటవీశాఖ అధికారులకు చిక్కకుండా తిరుగుతోంది. ఈ క్రమంలో అక్కడ నుంచి తప్పించుకుంటూ.., రౌతులపుడి నుంచి తుని మండలంలోకి అడుగుపెట్టింది. కుమ్మరిలోవ కాలనీ వద్ద రోడ్డు దాటుతుంటే స్థానికులు గుర్తించినట్లు తెలుస్తోంది. అదే ప్రాంతంలో కుమ్మరిలోవ నుంచి కొలిమేర వెళ్లే మార్గ మధ్యంలో అటవీశాఖ అధికారులు పులి పాదముద్రలు గుర్తించారు.
తాజాగా జూలై 12న జిల్లాలోని అనకాపల్లి జిల్లా చోడవరం, సబ్బవరం మండలాల్లో పులి సంచరించింది. చోడవరం మండలం గంధవరం గ్రామంలో జూలై 12న తెల్లవారుజామున ఎం.అప్పారావుకు చెందిన గేదె దూడపై పులి దాడి చేసి చంపింది. పులిని ప్రత్యక్షంగా చూసిన అప్పారావు భయపడిపోయి ఆస్పత్రి పాలయ్యాడు. అప్పారావు పశువుల పాక గ్రామ సమీపాన ఉంది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో అప్పారావు బహిర్భూమికి పశువుల పాక వద్దకు వెళ్లే సరికి పులి గేదె దూడను చంపి తినడాన్ని గమనించాడు. అప్పారావు వెనుకొచ్చిన కుక్క పులి పైకి వెళ్లడంతో పులి కుక్కను నోట కరుచుకొని కొండ ప్రాంతానికి పోయింది. ఘటనా స్థలానికి అటవీశాఖ అధికారులు, పోలీసులు చేరుకొని, పులి జాడను పరిశీలిస్తున్నారు. అలాగే సబ్బవరం మండలం నారపాడు పంచాయతీ పరిధిలో జూలై 11 రాత్రి పులి సంచరించి మేకలపై దాడికి పాల్పడింది. తొమ్మిది మేకలను చంపి తింది.
పులికి అనువైన కొండలు, డొంకలు ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఉండటం వల్ల పులి ప్రజల కంట పడకుండా తప్పించుకుని తిరుగుతుందని అధికారులు చెబుతున్నారు. నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వు బృందాలను పులిని ట్రాప్ చేసేందుకు రంగంలోకి దింపారు. పులి సంచరిస్తున్న పరిసర ప్రాంతాలు, ట్రాప్ కెమెరాల్లో చిత్రాలను అధికారుల బృందం క్షుణంగా పరిశీలిస్తోంది. ఇక ఆఖరి ప్రయత్నంగా ట్రాంక్విలైజర్ గన్‌తో పులికి మత్తు మందు ఇచ్చి బంధించడానికి ప్రయత్నిస్తున్నారు.
ఎప్పటికప్పుడు పులి సంచరిస్తున్న ప్రాంతాలను గమనిస్తూ.., ఆయా ఊర్లను అధికారులు పూర్తిగా తమ ఆదీనంలోకి తీసుకుంటున్నారు. ఆ ప్రాంతంలోకి ప్రజలు, పశువులు, రాకుండా బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారు. పులిని తిరిగి అడవికి తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని.. ప్రజలు కాస్త ఒపికగా ఉంటూ సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. త్వరగా పులి గండం నుంచి ఎప్పుడు గట్టెక్కుతామా అని ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉంటున్నారు.