Begin typing your search above and press return to search.

బండి సంజయ్ కొడుకును టీఆర్ఎస్ టార్గెట్ చేసిందా?

By:  Tupaki Desk   |   18 Jan 2023 12:30 AM GMT
బండి సంజయ్ కొడుకును టీఆర్ఎస్ టార్గెట్ చేసిందా?
X
బండి సంజయ్ కుమారుడు ర్యాగింగ్‌కు పాల్పడ్డారంటూ, తోటి విద్యార్థిని చితకబాదారంటూ సోషల్ మీడియాలో టీఆర్ఎస్ నేతలు ఓ వీడియోను షేర్ చేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా ఈ వీడియో వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఓ వీడియోలో ఓ యువకుడు మరో యువకుడిని కొడుతున్న దృశ్యాలున్నాయి. అందులో కొడుతున్న యువకుడు బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ అని.. ఆయన తన తోటి విద్యార్థిని తీవ్రంగా కొట్టడంతో ఆ విద్యార్థి ఆసుపత్రి పాలయ్యాడని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.

అయితే.. ఈ వీడియోలో కొడుతున్న యువకుడి ముఖంపై సరైన వెలుగు పడకపోవడంతో ఎవరనేది స్పష్టంగా కనిపించడం లేదు. కానీ, బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ పోలికలు కనిపిస్తున్నాయి.
మంత్రికి చెప్పినా నన్నేమీ పీకలేవు అంటూ ఆ యువకుడు అనడం ఆ వీడియోలో వినిపిస్తోంది. ఈ వీడియోను టీఆర్ఎస్‌కు చెందిన నాయకులు చాలామంది ట్విటర్, ఫేస్‌బుక్‌లో షేర్ చేస్తున్నారు. అయితే.. సోషల్ మీడియాలో పెట్టడానికి ముందే ఈ వీడియోను టీఆర్ఎస్ నాయకులు చాలా మీడియా సంస్థల ప్రతినిధులకు పంపించారని... టీఆర్ఎస్ ఉద్దేశపూర్వకంగానే బండి కుమారుడిని ఇందులో ఇరికించిందని బీజేపీ నేతలు కౌంటర్ చేస్తున్నారు. కాగా బండి సంజయ్ కుమారుడు భగీరథ్ ప్రస్తుతం మహీంద్ర యూనివర్సిటీలో చదువుతున్నారు. ఇంతకుముందు భగీరథ్ డిల్లీలో చదువుతున్నప్పుడు కూడా అక్కడ గొడవలు చేయడంతో యాజమాన్యం బయటకు పంపించిందని టీఆర్ఎస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి.

అయితే.. ఈ వీడియో వైరల్ అయిన కొద్ది సేపటికే మరో యువకుడి సెల్ఫీ వీడియో రిలీజైంది. తన పేరు శ్రీరామ్ అని.. బండి సంజయ్ కుమారుడు తననే కొట్టాడని.. ఇది పాత వీడియో అని ఆ యువకుడు చెప్పాడు. సంజయ్ కుమారుడు భగీరథ్ స్నేహితుడి చెల్లెలికి అర్ధరాత్రి తాను మెసేజ్‌లు పంపించి లవ్ చేయమని వేధించడంతో తనను కొట్టాడని.. ఆ గొడవ సమసిపోయి తామంతా కలిసిమెలసి ఉంటున్నామని.. ఇప్పుడు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని ఆ యువకుడు వీడియోలో చెప్పాడు. మొత్తానికి బండి కుమారుడు చేసింది తప్పే అయినా టీఆర్ఎస్ ప్రత్యేక ఇంట్రెస్ట్‌తో ఈ విషయాన్ని ఇష్యూ చేస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

కేంద్రంలోని బీజేపీ అధిష్ఠానం బండి సంజయ్‌పై ప్రశంసలు కురిపించిన తరుణంలో ఆయన్ను డిఫెన్సులో నెట్టేందుకు టీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోందంటున్నారు.బండి సంజయ్ కుమారుడు ర్యాగింగ్‌కు పాల్పడ్డారంటూ, తోటి విద్యార్థిని చితకబాదారంటూ సోషల్ మీడియాలో టీఆర్ఎస్ నేతలు ఓ వీడియోను షేర్ చేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా ఈ వీడియో వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఓ వీడియోలో ఓ యువకుడు మరో యువకుడిని కొడుతున్న దృశ్యాలున్నాయి. అందులో కొడుతున్న యువకుడు బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ అని.. ఆయన తన తోటి విద్యార్థిని తీవ్రంగా కొట్టడంతో ఆ విద్యార్థి ఆసుపత్రి పాలయ్యాడని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.

అయితే.. ఈ వీడియోలో కొడుతున్న యువకుడి ముఖంపై సరైన వెలుగు పడకపోవడంతో ఎవరనేది స్పష్టంగా కనిపించడం లేదు. కానీ, బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ పోలికలు కనిపిస్తున్నాయి.
మంత్రికి చెప్పినా నన్నేమీ పీకలేవు అంటూ ఆ యువకుడు అనడం ఆ వీడియోలో వినిపిస్తోంది. ఈ వీడియోను టీఆర్ఎస్‌కు చెందిన నాయకులు చాలామంది ట్విటర్, ఫేస్‌బుక్‌లో షేర్ చేస్తున్నారు. అయితే.. సోషల్ మీడియాలో పెట్టడానికి ముందే ఈ వీడియోను టీఆర్ఎస్ నాయకులు చాలా మీడియా సంస్థల ప్రతినిధులకు పంపించారని... టీఆర్ఎస్ ఉద్దేశపూర్వకంగానే బండి కుమారుడిని ఇందులో ఇరికించిందని బీజేపీ నేతలు కౌంటర్ చేస్తున్నారు.

కాగా బండి సంజయ్ కుమారుడు భగీరథ్ ప్రస్తుతం మహీంద్ర యూనివర్సిటీలో చదువుతున్నారు. ఇంతకుముందు భగీరథ్ డిల్లీలో చదువుతున్నప్పుడు కూడా అక్కడ గొడవలు చేయడంతో యాజమాన్యం బయటకు పంపించిందని టీఆర్ఎస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి.

అయితే.. ఈ వీడియో వైరల్ అయిన కొద్ది సేపటికే మరో యువకుడి సెల్ఫీ వీడియో రిలీజైంది. తన పేరు శ్రీరామ్ అని.. బండి సంజయ్ కుమారుడు తననే కొట్టాడని.. ఇది పాత వీడియో అని ఆ యువకుడు చెప్పాడు. సంజయ్ కుమారుడు భగీరథ్ స్నేహితుడి చెల్లెలికి అర్ధరాత్రి తాను మెసేజ్‌లు పంపించి లవ్ చేయమని వేధించడంతో తనను కొట్టాడని.. ఆ గొడవ సమసిపోయి తామంతా కలిసిమెలసి ఉంటున్నామని.. ఇప్పుడు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని ఆ యువకుడు వీడియోలో చెప్పాడు. మొత్తానికి బండి కుమారుడు చేసింది తప్పే అయినా టీఆర్ఎస్ ప్రత్యేక ఇంట్రెస్ట్‌తో ఈ విషయాన్ని ఇష్యూ చేస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. కేంద్రంలోని బీజేపీ అధిష్ఠానం బండి సంజయ్‌పై ప్రశంసలు కురిపించిన తరుణంలో ఆయన్ను డిఫెన్సులో నెట్టేందుకు టీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోందంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.