Begin typing your search above and press return to search.

చదువు కోసం టాంజానియా నుంచి హైదరాబాద్ కు వచ్చి ఆ పనా?

By:  Tupaki Desk   |   29 Jun 2021 4:30 AM GMT
చదువు కోసం టాంజానియా నుంచి హైదరాబాద్ కు వచ్చి ఆ పనా?
X
గతానికి భిన్నంగా ఇటీవల కాలంలో కొత్త దందా మొదలైంది. విదేశీ ట్యాగ్ తో తమకు తాము డిమాండ్ ను క్రియేట్ చేసుకొని అడ్డదారులు తొక్కుతున్న వైనం అంతకంతకూ ఎక్కువ అవుతోంది. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి హైదరాబాద్ లో వెలుగు చూసింది. చదువు కోసం భారత్ కు రావటం.. డ్రగ్స్ ను సరఫరా చేయటం కొన్నేళ్లుగా నడుస్తోంది. దీనికి తోడుగా మహిళలు పలువురు భారత్ లోని పలు నగరాల్లో తిష్ట వేసి.. వ్యభిచారం చేస్తున్నారు. గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న ఈ వ్యవహారాన్ని తాజాగా రాచకొండ పోలీసులు ఛేదించారు.

టాంజానికి చెందిన డయానా.. వారెన్ లు చదువుకోవటం కోసం హైదరాబాద్ వచ్చారు. స్టూడెంట్ వీసా మీద నగరానికి వచ్చిన వారు తొలుత తార్నాక వద్ద ఉండేవారు. రెండు నెలల క్రితం తార్నాక నుంచి నేరేడ్ మెట్ కు మకాం మార్చారు. ఈ క్రమంలో డయానా వ్యభిచార వ్యాపారాన్ని మొదలు పెట్టింది. భార్యభర్తలుగా చెప్పి ఇంటిని అద్దెకు తీసుకున్న వారు.. కొత్త దందాను షురూ చేశారు.

ఒక యాప్ లో తన పేరును నమోదు చేసుకొని.. వినియోగదారుల్ని నేరుగా తన ఇంటికే రమ్మని చెప్పేది. ఈ ఉదంతం గురించి సమాచారం అందుకున్న మల్కాజిగిరి ఎస్వోటీ.. నేరెడ్ మెట్ పోలీసులు సంయుక్తంగా ఇంటి మీద దాడి చేశారు. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని.. వ్యభిచారాన్ని నిర్వహిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి పాస్ పోర్టులు.. మొబైళ్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారి వివరాల్ని చెక్ చేయగా.. వీసా మీద దేశానికి వచ్చిన వారి గడువు పూర్తి అయిందని గుర్తించారు. అక్రమంగా ఉంటున్నట్లుగా తేల్చారు. ఇటీవల కాలంలో హైదరాబాద్ లో ఈ తరహా వ్యాపారాలు ఎక్కువైపోయాయి.