Begin typing your search above and press return to search.
మీకు తెలుసా: పక్షులకూ ఓ ఆస్పత్రి.. ఎక్కడంటే?
By: Tupaki Desk | 7 Nov 2021 12:30 AM GMTతమిళనాడులోని కోయంబత్తూర్ పర్యాటక ప్రాంతం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పశ్చిమకనుమల్లో ఉన్న ఈ ప్రాంతానికి ఎన్నో పక్షులు వలస వస్తుంటాయి. రకరకాల పక్షులను అక్కడ చూడవచ్చు. అయితే ఇటీవల కాలుష్య కోరలు ఆ పక్షులకు చాలా హాని చేస్తున్నాయి. మనుషులు వాడి పడేసిన వస్తువులు పక్షులకు తగిలి గాయపరుస్తున్నాయి. ప్లాస్టిక్ కవర్ల వంటివి కరెంటు తీగలకు తగిలి... హాని చేస్తున్నాయి. ఇలా తరుచుగా జరిగి... పదుల సంఖ్యలో పక్షులు గాయాలపాలవుతున్నాయి. అందుకే అక్కడి అటవీ సిబ్బంది వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ఓ స్వచ్ఛంద సంస్థతో కలిసి పక్షుల కోసం ప్రత్యేక ఆస్పత్రి ఏర్పాటు చేశారు. గాయాలపాలైన పక్షులకు ఆ ఆస్పత్రిలో చికిత్స అందిస్తారు. పిట్టలకు కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయని ఆ ఆస్పత్రి నిర్వహకులు చెబుతున్నారు.
ఈ ఆస్పత్రి ముఖ్య ఉద్దేశం పక్షులను కాపాడటం... గాయపడిన పిట్టలకు చికిత్స అందించడం. అయితే కేవలం మనుషుల కారణంగా గాయపడిన పక్షులనే కాకుండా... ఇతర అటవీ జంతువుల దాడిలో గాయాల పాలైన పిట్టలకూ చికిత్స అందిస్తారు. ఎక్కడైనా పక్షి గాయపడినట్లు కనిపిస్తే స్థానికులు ఈ ఆస్పత్రికి తీసుకొస్తారు. కాగా హాస్పిటల్ నిర్వాహకులు ఆ గాయాలను పరిశీలిస్తారు. వారానికి ఒక పక్షుల వైద్యుడు ఇక్కడికి వస్తారు. గాయాలైన పిట్టలన్నింటినీ పరిశీలించి... వాటికి తగిన చికిత్స అందిస్తారు. ఇలా పక్షులను కాపాడుతూ వాటి గాయాలకు చికిత్స చేస్తారు. ఈ సమయంలో వాటికి మంచి దాణాను ఇస్తారు. ఇలా పక్షి పూర్తిగా కోలుకుంటుంది. ఆ తర్వాత వాటిని మళ్లీ అడవిలో విడిచిపెడతారు.
పక్షులకు శస్త్ర చికిత్స అందించేందుకు ఓ ప్రత్యేక గది కూడా ఉంది. ఈమధ్యే సూళ్లూరు సమీపంలో గాయాలపాలైన ఓ డేగను ఈ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఈజిప్టుకు చెందిన ఈ మాంసాహార డేగ రెక్కకు గాయమైంది. ఫలితంగా అది ఎగరలేకపోతోంది. ఇది గమనించిన అటవీశాఖ సిబ్బంది ఆ డేగను ఇక్కడికి తీసుకొచ్చినట్లు తెలిపారు. రెక్క గాయానికి వైద్యులు చికిత్స అందిస్తున్నారని వెల్లడించారు. కొన్ని రోజుల్లో ఆ గాయం పూర్తిగా నయం అవుతుందని చెప్పారు. ఆ అరుదైన డేగను పర్యవేక్షణలో ఉంచినట్లు వివరించారు. ప్రస్తుతం ఈ ఆస్పత్రిలో గాయపడిన చిలుకలు 100, పావురాలు 7, పిట్టలు 3, నెమళ్లు 4, డేగలు 2 ఉన్నాయని పేర్కొన్నారు.
ఇకపోతే ఈ ఆస్పత్రిలో పక్షుల కోసం ఎక్స్ రే, శస్త్ర చికిత్సకు కావాల్సిన అన్నిరకాల పరికరాలు ఉన్నాయి. ఇంక్యూబేటర్ సౌకర్యం కూడా ఉంది. ఇలా పక్షుల చికిత్సకు అవసరమైన అన్ని రకాల వైద్య పరికరాలు ఉన్నాయి. పక్షులు మృతిచెందితే వాటినిని దహనం చేయడానికి విద్యుత్తు శ్మశాన వాటిక కూడా అందుబాటులో ఉంది. దీనిని మూడు నెలల క్రితమే ఏర్పాటు చేశారు. ఇందులో 40కిపైగా పక్షుల మృతదేహాలను దహనం చేశారు. అయితే ఇలాంటి ఆస్పత్రి తమిళనాడులో ఇదే మొదటిది కావడం గమనార్హం. అటవీ శాఖ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థ చొరవను పక్షి ప్రేమికులు అభినందిస్తున్నారు. పక్షులను దృష్టిలో ఉంచుకొని ప్లాస్టిక్ ను నిషేధించాలని కోరుతున్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ పాటుపడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.