Begin typing your search above and press return to search.
అరుదైన 'గోల్డెన్ బ్లడ్ గ్రూప్' గురించి మీకు తెలుసా..?
By: Tupaki Desk | 24 Jan 2022 3:49 AM GMTమానవుని జీవనానికి అత్యంత ముఖ్యమైనది రక్తం. ఇది శరీరంలో ఎటువంటి ఆటంకం లేకుండా ప్రవహిస్తేనె మనిషి బ్రతుకుతాడు. లేదంటే క్షణాల్లోనే చనిపోతారు. అయితే ఇలాంటి రక్తానికి సంబంధించిన ఉన్న గ్రూప్ లను మనం చిన్నప్పుడు తరగతుల్లో చదువుకున్నాం. మనకు తెలిసినంత వరకు ప్రపంచంలో బ్లడ్ గ్రూప్ ల సంఖ్య చాలా తక్కువ. వాటి మొత్తాన్ని వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. మనకు తెలిసినంత వరకు బ్లడ్ గ్రూపులు అంటే ఏ, బీ, ఓ.. అంతేకాకుండా వాటి నెగటివ్ గ్రూప్ లు కూడా. ఇవి మాత్రమే మనకు తెలిసిన బ్లడ్ గ్రూప్ లు.
గోపిచంద్ నటించిన ఓ సినిమా చూస్తే అరుదైన బ్లడ్ గ్రూప్ అంటే ఎంతో తెలుస్తుంది. ఆ సినిమాలో విలన్ అనారోగ్యంతో బాధపడుతూ ఉంటాడు. అతనికి కావాల్సిన అత్యంత రేర్ బ్లడ్ గ్రూప్.. బాంబే బ్లడ్ గ్రూప్. ఇది గోపీచంద్ దగ్గర ఉంటుంది. ఇలా సినిమా చూసి అత్యంత అరుదైన బ్లడ్ గ్రూప్ ఏంటి అనేది చాలా మంది తెలుగు వాళ్ళు తెలుసుకున్నారు. అంతేకాకుండా ఈ బాంబే బ్లడ్ గ్రూప్ కంటే ఇంకా ఏదైనా బ్లడ్ గ్రూప్ ఒకటుంది. దీని గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ప్రపంచంలో ఇలాంటి బ్లడ్ గ్రూప్ ఉండే వాళ్ల సంఖ్య వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు అంటే ఇంకా ఆలోచించండి. దీనినే గోల్డెన్ బ్లడ్ గ్రూప్ అంటారు.
గోల్డెన్ బ్లడ్ కు ఉండే అసలు పేరు ఆర్.హెచ్ నల్ బ్లడ్ గ్రూప్. ఈ బ్లడ్ గ్రూప్ కి ఈ పేరు ఎలా వచ్చింది అనేది ఓ సారి తెలుసుకుందాం. సాధారణంగా ప్రతి బ్లడ్ గ్రూప్ లలో దానికి సంబంధించిన యాంటీజన్ కారకాలు ఉంటాయి. ఏ గ్రూప్ ని తీసుకుంటే దానిలో ఏ యాంటీజెన్ ఉంటుంది. బీ గ్రూప్ లో దీనికి సంబంధించిన బీ యాంటీజన్లు ఉంటాయి. ఈ రెండు లేనిది ఓ బ్లడ్ గ్రూప్. అయితే సాధారణంగా బ్లడ్ లో ఆర్.హెచ్.డి అనేది ఉంటుంది. దీని బట్టి బ్లడ్ గ్రూప్ నెగటివ్ నా పాజిటివ్ నా అనేది నిర్ణయిస్తారు. కానీ గోల్డెన్ బ్లడ్ గ్రూప్ విషయానికి వస్తే ఈ బ్లడ్ గ్రూప్ లో ఆర్.హెచ్ అనేది పూర్తిగా ఉండదు. ఇలా పూర్తిగా ఆర్.హెచ్ లేకపోతే దానిని గోల్డెన్ బ్లడ్ గ్రూప్ గా పరిగణిస్తారు.
ఈ అత్యంత అరుదైన బ్లడ్ గ్రూప్ ను మొదటిసారిగా 1961లో గుర్తించారు. మొదటగా ఈ బ్లడ్ గ్రూప్ ఆస్ట్రేలియా కు చెందిన ఓ మహిళలో బయటపడినట్లు పరిశోధకులు చెపుతున్నారు. అయితే ఈ బ్లడ్ గ్రూప్ ప్రపంచం మొత్తం మీద కేవలం 43 మందిలో మాత్రమే ఇప్పటి వరకూ గుర్తించినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందుకే దీనిని అత్యంత బ్లడ్ గ్రూప్ గా పిలుస్తారు అని పేర్కొన్నారు.