Begin typing your search above and press return to search.
మీ ఫోన్ అంటేనే మీరు వణికే ముచ్చట ఇది
By: Tupaki Desk | 6 March 2017 7:09 AM GMTచేత్తో స్టైల్ గా పట్టుకొని.. మాట్లాడేయటం.. చాట్ చేసేయటం.. ఇలా చెప్పుకుంటూ పోతే.. నిమిషం కూడా స్మార్ట్ ఫోన్ లేకుండా బతకలేని స్థితికి డిజిటల్ జీవి చేరిపోయారు. మరింత క్లోజ్ గా ఉండే స్మార్ట్ ఫోన్ అసలు ముచ్చట తెలిస్తే.. షాక్ తినాల్సిందే. ఎందుకంటే.. చేతిలో నిత్యం పట్టుకొని తిరిగే స్మార్ట్ ఫ్లోన్లో ఎన్ని స్మూక్షజీవులు.. ఎంత ప్రమాదకరమైన బ్యాక్టీరియాలో ఉండే అవాక్కు అవ్వాల్సిందే.
తాజాగా జరిపిన ఒక పరిశోధనలో షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. పూణెకు చెందిన పరిశోధనకారులు వివిధ స్మార్ట్ ఫోన్లపై భారీగా పరిశోధనలు జరిపారు. ఈ సందర్భంగా వారు కనుగొన్నకొత్త విషయాలేమిటంటే.. మనం వాడే స్మార్ట్ ఫోన్ మీద 500 రకాల బ్యాక్టీరియాల్ని గుర్తించారు. అంతేకాదు.. స్మార్ట్ ఫోన్ మీద స్మార్ట్ క్రియులు స్మార్ట్ గా నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాయని.. వాటిని వదిలించుకోవటం అంత తేలికైన విషయం కాదని తేల్చేశారు.
ఒక్కమాటలో చెప్పాలంటే.. టాయిలెట్ లో ఉండే క్రిముల కంటే కూడా దారుణమైన బ్యాక్టీరియా మన స్మార్ట్ ఫోన్ మీద ఉంటాయన్న విషయాన్ని వెల్లడించారు. అంతేకాదు.. తాము తాజాగా జరిపిన పరిశోధనల్లోమూడు రకాల సరికొత్త సూక్ష్మ క్రిములు.. 30 రకాల ఫంగస్ లను గుర్తించామని.. వాటికి కొత్తగా పేర్లు పెట్టినట్లుగా చెబుతున్నారు.
వీటి వల్ల మనుషులకు ఎంత ప్రమాదం అన్న విషయం మీద వారు మరింత పరిశోధన చేయాలన్న మాటను చెబుతున్నారు. ప్రాధమికంగా అయితే అంత డేంజర్ కాకున్నా.. వీలైనంత వరకూ జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. కనీసం రోజుకు ఒకసారైనా.. స్మార్ట్ ఫోన్ ను పూర్తిగా ఆఫ్ చేసేసి.. సబ్బునీటితోకానీ.. మరేదైనా లిక్విడ్ తో శుభ్రం చేయాలని.. అలాంటప్పుడు మరీ తడి చేయకూడదని.. బాగా పొడి అయ్యాక మాత్రమే ఛార్జింగ్ పెట్టాలని జాగ్రత్తలు చెబుతున్నారు. శుభ్రం చేసే క్రమంలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా అపాయం తప్పదని హెచ్చరిస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/