Begin typing your search above and press return to search.
‘యూట్యూబ్ స్టార్’అమెరికాలో ఏం చేస్తున్నాడు?
By: Tupaki Desk | 24 April 2019 11:09 AM GMTఏపీ ఎన్నికల వేడిలో కావాల్సినంత ఎంటర్ టైన్ మెంట్ పంచి ‘యూట్యూబ్ స్టార్’గా ఎదిగిపోయాడు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్. విచిత్రమైన వ్యవహారశైలి, హావభావాలు, సీరియస్ కామెడీ పంచుతూ జనాలకు భలే కామెడీని పంచారు. సీరియస్ పాలిటిక్స్ లో కామెడీ పంచులతో అదరగొట్టారు..
కేఏపాల్ ఏపీ ఎన్నికల వేళ చేసిన హడావుడి యూట్యూబర్లు , పలు టాప్ టీవీ చానెళ్లు అందిపుచ్చుకున్నాయి. ఆయనను పదేపదే లైవ్ లోకి తీసుకొచ్చి ఆయన చేసిన వీడియోలను సేకరించి ‘యూట్యూబ్ స్టార్’ ను చేసేశాయి. కేఏ పాల్ కనిపిస్తే చాలు మొన్నటి వరకు లక్షల వ్యూస్ వచ్చేశాయి. అంతటి పాపులారిటీ సంపాదించిన కేఏపాల్ ఎన్నికల అనంతరం అమెరికా వెళ్లిపోయాడు.
ఇప్పుడు అమెరికాలో వివిధ క్రిస్టియన్ చర్చిలు, మిషనరీస్ లో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. ఆయన ఉదయాన్నే జాగింగ్, యోగా చేస్తున్న ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో వచ్చేశాయి. స్వతహాగా మతబోధకుడు అయిన కేఏ పాల్ అక్కడ వివిధ క్రిస్టియన్ల సమావేశంలో ప్రసంగాలు చేస్తున్నారు. ఇక సాయంత్రం, రాత్రి తన ప్రజాశాంతి పార్టీ కోసం ఏపీలో కష్టపడ్డవారితో లైవ్ చాట్ నిర్వహిస్తూ భరోసానిస్తున్నారు. గెలుపుపై నమ్మకం వ్యక్తం చేస్తూ నియోజకవర్గాల వారీగా పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు.
కేఏ పాల్ ప్రస్తుతం అమెరికాలోని న్యూయార్క్ సహా వివిధ నగరాల్లో క్రైస్తవ చర్చిలను సందర్శిస్తూ ఆదివారాలు క్రిస్టియన్ మత కార్యక్రమాల్లో ప్రసంగిస్తూ తన రోజువారీ కార్యకలాపాలతో బిజీగా మారారు. మత బోధనలు చేస్తూ వివిధ అధికార, ప్రతిపక్ష నాయకులతో సమావేశమవుతూ క్రైస్తవ మత ప్రచార కార్యక్రమాల్లో బిజీబిజీగా గడుపుతున్నట్టు వివిధ సామాజిక మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి. .. ఏపీ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేసిన కేఏ పాల్ ఇప్పుడు అమెరికాలో ఈ గ్యాప్ లో రిలాక్స్ అవుతూనే తన మత బోధనలు చేస్తూ గడుపుతున్నారు.