Begin typing your search above and press return to search.
ఏపీ స్పెషల్ స్టేటస్ గురించి జగన్ మాట్లాడలేదా?
By: Tupaki Desk | 12 Nov 2022 1:30 PM GMTఔను! ఏపీకి సంబంధించిన కీలక మైన విషయం ప్రత్యేక హోదా! 2014కు ముందు రాష్ట్ర విభజన సమయం లో ఏపీకి ప్రత్యేక హోదాను ఇస్తామనిఅప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ పార్లమెంటులో నే ప్రకటించారు.
దీనిని ఐదు కాదు పదేళ్లకు పెంచాలని.. అప్పటి బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. అయితే, ఇప్పటి వరకు కూడా దీనిని అమలు చేయలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రధాని ఏపీలో పర్యటించిన నేపథ్యంలో ఈ విషయంలో జగన్ ఏం చేశారనేది ప్రశ్న. కనీసం ప్రత్యేకహోదా విషయాన్ని మాట మాత్రంగా కూడా జగన్ ప్రస్తావించలేదు.
తాజాగా ప్రదాని మోడీ ఏపీలో పర్యటించారు. విశాఖలో పర్యటించిన మోడీ.. ఆంధ్ర యూనివర్సిటీలో నిర్వహించిన సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొన్ని నెలల కిందట అల్లూరి జయంతి వేడుకలకు వచ్చే సౌభాగ్యం కలిగిందని తెలిపారు. భారత్‌కు విశాఖపట్టణం ప్రత్యేకమైన నగరమని ప్రధాని అభివర్ణించారు. ప్రాచీనకాలం నుంచి విశాఖ పోర్టుకు ఘన చరిత్ర ఉందన్న మోడీ.. ఎన్నో ఏళ్లుగా ప్రముఖ వ్యాపార కేంద్రంగా విరాజిల్లుతోందని వ్యాఖ్యానించారు.
వెయ్యేళ్ల క్రితమే పశ్చిమాసియా, రోమ్‌కు విశాఖ నుంచి వ్యాపారం జరిగేదని తెలిపారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హరిబాబు ఎప్పుడు తనని కలిసినా ఏపీ అభివృద్ధిపైనే అడుగుతారని తెలిపారు. ఏపీకి సంబంధించి అనేక అంశాలపై చర్చిస్తారని కూడా మోడీ చెప్పారు. మరి ఇలాంటి సమయంలో అయినా.. సీఎం జగన్.. ఖచ్చితంగా ఏపీ అంశాలను ప్రస్తావిస్తారని అందరూ అనుకున్నారు. కానీ, మోడీని పొగడ్డంలోనూ.. కేంద్రాన్ని నెత్తికెత్తుకోవడంలోనూ ఆయన పరిమితం అయ్యారనే వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం.
వాస్తవానికి గతంలో ప్రతిపక్ష స్థానంలో ఉన్న జగన్.. అప్పట్లో అనేక వినతి పత్రాలు ఇచ్చారు. ఏపీకి హోద ఇవ్వాలని.. ఆయన కోరారు. అయితే.. ఇప్పుడు కనీసం మాట మాత్రంగా కూడా జగన్ వాటిని ప్రస్తావించ కపోవడం గమనార్హం. ఏపీ గురించిన సమస్యల పరిష్కారం కోసమే.. రాష్ట్ర అజెండా కోసమే తాను కేంద్రం తో చెలిమి చేస్తున్నానని చెబుతున్న జగన్.. కనీసం వాటి గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం గమనార్హం. మరి దీనిని బట్టి జగన్ ఏపీ కోసమే కేంద్రంతో చెలిమి చేస్తున్నారా? అనే డౌట్లు వస్తున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.