Begin typing your search above and press return to search.
పరిషత్ ఎన్నికల్లో `నవరత్నాలు` పనిచేయలేదా? ఎందుకు?
By: Tupaki Desk | 10 April 2021 8:34 AM GMTపరిషత్ ఎన్నికలు ఇటీవలే ముగిశాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అధికార పార్టీ దూకుడు చూపిస్తుం దని అందరూ అనుకున్నారు. ముఖ్యంగా టీడీపీ ఈ ఎన్నికలను బహిష్కరించిన నేపథ్యంలో వైసీపీ మరిం త దూకుడుగా ముందుకు సాగుతుందని అనున్నారు.కానీ, పోలింగ్ శాతం ఘోరంగా పడిపోయింది. మరి దీనికి కారణం ఏంటి? తాము నమ్ముకున్న నవరత్నాలు పనిచేస్తాయని అనుకున్న వైసీపీ నేతలకు.. అవి పనిచేయలేదా? అనే సందేహం తెరమీదికి వచ్చింది. వాస్తవానికి రాష్ట్రంలో గత నెలలో జరిగిన పంచాయతీ, మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ సహా వైసీపీ జోరుగా పోటీ పడ్డాయి.
ఆ ఎన్నికల్లో 85 శాతం నుంచి 90 శాతం వరకు పోలింగ్ జరిగింది. దీంతో పంచాయతీలో అయితే.. ఈ రెండు పార్టీలూ.. కార్పొరేట్ విద్యాసంస్థలు గతంలో ఎంసెట్ ఫలితాలను ప్రకటించుకున్నట్టు మేం అన్ని స్థానాలు గెలుచుకున్నాం.. అంటే.. మేం ఇన్ని స్థానాల్లో విజయం దక్కించుకున్నాం.. అని ప్రకటించుకున్నాయి. కానీ, కార్పొరేషన్ ఎన్నికలు, స్థానికంలో మాత్రం పార్టీ గుర్తులపై ఎన్నిక జరగడంతో వైసీపీ క్లీన్ స్వీప్ చేయడంతో నవరత్నాల వల్లే తాము ఇన్ని స్థానాలు సాధించామని.. జగన్ పాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పుగా ప్రచారం చేసుకున్నారు అధికార పార్టీ నేతలు.
ఇక, ఇప్పుడు రాష్ట్రంలో జరిగిన పరిషత్ ఎన్నికల్లో మాత్రం డబ్బులు పంచలేదు. పైగా టీడీపీ బహిష్కరిం చింది. దీంతో వైసీపీ దూకుడు ఓ రేంజ్‌లో ఉంటుందని బావించినా.. కొన్ని కొన్ని చోట్ల మాత్రం 10 శాతం ఓట్లు కూడా రాలేదు. అంతేకాదు.. ఏజెంట్లు కూడా లేకపోవడంతో ఫొటోలు, వీడియోలు తీసుకోకుండా.. అధికార పార్టీ వారే ఓట్లు వేసుకున్నారనేది జగమెరిగిన సత్యం అంటున్నారు పరిశీలకులు. అయితే.. ఓటర్లు ఎందుకు బయటకు రాలేదు? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. సాధారణంగా ప్రతి పార్టీకీ(టీడీపీ, వైసీపీ) 20-25 శాతం సంప్రదాయ ఓటు బ్యాంకు ఉంది. కానీ, ఇప్పుడు అది కూడా వైసీపీకి రాలేదని అంటున్నారు.
మరి దీనికి ప్రధాన కారణం ఏంటి? అంటే.. నవరత్నాల పేరుతో ఎన్ని పథకాలు పెట్టినా.. ఓట్ల విషయానికి వచ్చేసరికి డబ్బులు పంచకపోవడమే ప్రధాన కారణం అంటున్నారు పరిశీలకులు. అంటే.. నవరత్నాల దారిది నవరత్నాలదే ఓట్ల దారిది ఓట్లదే.. అని స్పష్టమైంది. ఎక్కడా కూడా ఓటర్లకు డబ్బులు పంచకపోతే.. అక్కడ ఓటర్లు బయటకు రాలేదనే విషయం స్పష్టమైంది. ఇదే విషయాన్ని కర్నూలులో ఓటర్లు మొహమాటం లేకుండా చెప్పేశారు. మాకు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి.. మేం ఓట్లు వేయం అని అక్కడి ఓటర్లు స్పష్టం చేసేశారు. దీనిని బట్టి.. రాజకీయ నేతలు ఇప్పటకైనా మారాల్సిన అవసరం ఎంతైనా ఉందని అర్ధమవుతోంది.ఓటర్లకు ఓటు విలువ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డబ్బులు అలవాటు చేయడం మానేసి.. ఓటు విలువ చెప్పాల్సిన అవసరం ఉందని ``తుపాకీ .కామ్` వేడుకుంటోంది. మరి నేతలు మారతారో లేదో చూడాలి.