Begin typing your search above and press return to search.

జాగ్ర‌త్త ... ఏపీలో మ‌రో సంక్షోభం !

By:  Tupaki Desk   |   22 Jun 2022 7:37 AM GMT
జాగ్ర‌త్త    ... ఏపీలో మ‌రో సంక్షోభం !
X
ఇప్ప‌టిదాకా వ్య‌వసాయ ప‌నులు ఆరంభం అయిన పల్లెల‌కు కొత్త సమ‌స్య వచ్చిప‌డుతోంది. మొన్న‌టిదాకా డీజిల్ పై సుంకం త‌గ్గించి కేంద్రం కొంత వ‌ర‌కూ ఉప‌శ‌మనం ఇచ్చినా ఆ ప్ర‌భావం మాత్రం పెద్ద‌గా డీల‌ర్ల‌పై చూప‌లేక‌పోయింది. అంతేకాదు వారు ముందుగానే ఎక్సైజ్ డ్యూటీ చెల్లింపు చేయ‌డంతో సంబంధిత డీల‌ర్లు కేంద్రంతో క‌య్యానికి దిగారు.

దేశ వ్యాప్తంగా మూడు వంద‌ల నుంచి ఐదు వంద‌ల కోట్ల వ‌ర‌కూ ముంద‌స్తు ఎక్సైజ్ డ్యూటీ చెల్లింపులు అయిపోయాయి అప్ప‌టికే..! కానీ మోడీ నిర్ణ‌యం కార‌ణంగా కేంద్రం ఆ మొత్తాన్ని తిరిగి ఇస్తుందో లేదో తెలియ‌డం లేదు. ఆ స‌మ‌స్య అలా ఉంటుండ‌గానే ఇప్పుడు డీల‌ర్లు డీజిల్ కొర‌త కార‌ణంగా త‌మదైన పంథాలో బంకు య‌జ‌మానుల‌కు చుక్క‌లు చూపిస్తున్నారు.

దీంతో ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ డీజిల్ కొర‌త అన్న‌ది ప్ర‌ధాన స‌మ‌స్య‌గా ఉంది. ఇందుకు స్ప‌ష్ట‌మైన కార‌ణాలు అయితే తెలియ‌డం లేదు. ఉక్రెయిన్ యుద్ధ ప్ర‌భావం ఉంద‌ని మాత్రం ప్రాథ‌మికంగా తెలుస్తున్న స‌మాచారం.

ఏపీలో డీజిల్ సంక్షోభం త‌లెత్త‌నుంది. ఇప్ప‌టికే చాలా బంకుల ద‌గ్గ‌ర నో స్టాక్ బోర్డులు ద‌ర్శ‌నం ఇస్తున్నాయి. సంక్షోభం దృష్ట్యా అధికారులు ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌ల‌యితే తీసుకోవ‌డం లేద‌ని తెలుస్తోంది. వ్య‌వ‌సాయ ప‌నులు ప్రారంభం అయిన లేదా అవుతున్న ద‌శ‌లో డీజిల్ కొర‌త అన్న‌ది రైతాంగాన్ని వేధిస్తోంది.

దీంతో సాగు ప‌నులు ముందుకు వెళ్ల‌డం లేద‌ని వాపోతోంది. ఇప్ప‌టిదాకా ముంద‌స్తు ఖ‌రీఫ్ కు అటు తెలంగాణ స‌ర్కారు కానీ ఇటు ఆంధ్రా స‌ర్కారు కానీ ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇందులో భాగంగానే పంట కాలువ‌ల‌కు నీళ్లు వ‌దిలాయి. కానీ మోటారుతో నీరు తోడి పంట సాగు చేసే విధానంతో అనుసంధానం అయిన రైతాంగం ఇప్పుడు డీజిల్ అవ‌సరం మేర‌కు దొర‌క్క అవ‌స్థ ప‌డుతోంది.

ఇదే సంద‌ర్భంలో కొన్ని చోట్ల కృత్రిమ కొర‌త సృష్టిస్తూ నాలుగు డ‌బ్బులు అద‌నంగానే పిండుకోవాల‌ని చూస్తోంది. ఇక రాష్ట్రంలో ఉన్న మూడు వేల ఐదు వంద‌ల బంకుల‌కు గాను రోజుకు ఏడు ల‌క్ష‌ల లీట‌ర్ల డీజిల్ అమ్ముడ‌వుతోంద‌ని గ‌ణాంకాల ద్వారా తెలుస్తోంది. రోజు వారీ స‌ర‌ఫ‌రాలో త‌మ‌కు న‌ష్టం వ‌స్తుంది అన్న కార‌ణంతో (లీట‌రు డీజిల్ కు 25 నుంచి 30 రూపాయ‌లు నష్టం) కోతలు సంబంధిత కంపెనీలు విధిస్తున్నాయి అని ప్ర‌ధాన మీడియా చెబుతోంది. మ‌రోవైపు ప‌త్రిక‌ల్లో వ‌స్తున్న క‌థ‌నాల ప్ర‌కారం తాము డీడీలు రెండు,మూడు రోజుల ముందుగానే చెల్లిస్తున్నా డీజిల్ స‌ర‌ఫ‌రా చేయ‌డం లేద‌ని డీల‌ర్లు అంటున్నారు.